అమ్మానాన్న లేని ప్రపంచాన్ని సృష్టికర్త కూడా ఊహించలేడు.డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

హ్యాపీ పేరెంట్స్ డే

అమ్మానాన్న లేని ప్రపంచాన్ని సృష్టికర్త కూడా ఊహించలేడు.
తల్లిపేగు తెంపుకుని బయటకు వచ్చే బిడ్డ
నాన్న చేయి పట్టుకుని తప్పటడుగులు నుంచి ఎదిగే బిడ్డ..
పెరిగి పెద్దయి ప్రయోజకుడై పిల్లలకు తండ్రయి …
తన తల్లిదండ్రులను మాత్రం వృద్ధాశ్రమాలకు పంపిస్తుంటే…
ఆ తల్లిదండ్రులకు ఎంత గుండెకోత…ఇది బిడ్డల వెన్నుపోటా?కత్తిపోటా?
ఈ ప్రపంచం ఎటుపోతోంది?టెక్నాలజీ పెరిగింది
ఆధునికత పెరిగింది..జీవన శైలి మారింది…
కానీ అమ్మానాన్నల ప్రేమ మాత్రం అలాగే వుంది…
పెరుగన్నంలా…పులిహోరలా…పాయసంలా …అమృతంలా
ఎవరు మారాలి?మరెవరు ఆలోచించాలి?తప్పెవరిది…శిక్ష ఎవరికి?
బిజీ పేరుతో ఉరుకుల జీవితంలో పిల్లలను …
ఖరీదైన హాస్టల్స్లో వేస్తె పిల్లల్లో ఒంటరితనం..తెలియని అమ్మానాన్నల ప్రేమ…
కోల్పోయే బాల్యంలోని అనుభూతులు…
ఇల్లు..అమ్మ నాన్న బామ్మ తాతయ్యలు పిన్నమ్మలు మామయ్యలు…
చందమామ కథలు గోరుముద్దలు…
వీటిని మీ పిల్లలకు దూరం చేయకండి.
చదువుతో పాటు ప్రేమలు ఆప్యాయతలు బంధాలు అనుబంధాలు నేర్పించండి.
పిల్లలూ..
ఇదే ప్రేమను మీ కన్నవాళ్లకూ అందించండి.
కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్లు…
ఇల్లంతా కళకళలాడుతూ…జీవితపు చరమదశను అద్భుతమైన మజిలీగా మార్చి మీ కన్నవాళ్ళు రుణం తీర్చుకోవడం జీవితానికి అసలైన అర్థం.
ఇంతకన్నా ఇంకేం చెప్పాలి?
హ్యాపీ పేరెంట్స్ డే…
హ్యాపీగా జరుపుకునే పేరెంట్స్ కు…హ్యాపీగా జరిపే చిల్డ్రన్స్ కు…శుభాకాంక్షలు.
మీ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

NO COMMENTS

LEAVE A REPLY