అవసరానికి ఆకలికి శరీరాన్ని వ్యాపారంగా మార్చుకునే సెక్స్ వర్కర్ లో వుండే నిజాయితీ డబ్బుతో శారీరక అవసరాన్ని తీర్చుకునే వారిలో ఉండకపోవడం చూస్తే..నైతికంగా చెడింది ఎవరు?అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలా? ముంబైలో జరిగిన సంఘటన చూస్తే ఈ ప్రశ్న మెదులుతుంది.
ముంబైలో ఒక సెక్స్ వర్కర్ కు అతనితో పరిచయం వుంది.గతంలో ఆమెతో గడిపిన ప్రతీసారి వెయ్యి రూపాయలు ఇచ్చేవాడు. తనకు ఆర్థికంగా అవసరాలు ఉన్నాయని ఈ సారి అయిదు వందలు ఎక్కువ ఇవ్వాలని కోరింది.అతను కోపంతో తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.
ఆ స్నేహితులు ఆమెను పిలిపించుకుని ఆమెతో గడిపాక అనుకున్నట్టుగా రూ 1500 ఇచ్చాడు.కథ అక్కడితో అయిపోలేదు.ఇంతలో అతని మరో స్నేహితుడు కూడా వచ్చి అతను కూడా ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. కానీ అందుకు డబ్బు చెల్లించలేదు.అడిగినందుకు సెక్స్ వర్కర్ ను బెల్టు తీసుకుని ఇష్టం వచ్చినట్టు చితకబాదాడు. సిగరెట్ కాల్చి ఒళ్లంతా వాతలు పెట్టాడు దాదాపు నాలుగు గంటలపాటు ఆమెను అత్యంత కిరాతకంగా హింసించాడు. చివరికి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆస్పత్రి ప్రాంతంలో ఆమెను వదిలిపెట్టి వెళ్లిపోయాడు.
ఆ బాధలతో ఆమె అక్కడి నుంచి సరాసరి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తానో సెక్స్ వర్కర్‌నని కాబట్టి చిత్రహింసల కేసు మాత్రమే పెట్టాలని పోలీసులను కోరింది. నిజానికి గ్యాంగ్ రేప్ కేసు పెట్టాల్సి వస్తుందని పోలీసులు చెబుతున్నా ఆమె వారించింది. రేప్ కేసు కూడా పెట్టవద్దని కోరింది. ఆమె కోరిక మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సెక్స్ వర్కర్ లో వున్న నిజాయితీ ఆ మృగాళ్లలో లేదు.
కర్టసీ …ఆంధ్రజ్యోతి