వాషింగ్టన్: అమెరికాలో అదో రెస్టారెంట్..ఒక పదిహేనేళ్ల అమ్మాయి వెయిట్రెస్‌గా తన డ్యూటీ చేస్తోంది.ఆరుగురు సిబ్బంది తరచూ కనిపిస్తున్నారు.వారెవరా… అని ఆరా తీస్తే అమెరికా సీక్రెట్ ఏజెంట్లు అని తెలిసి నోరెళ్లబెట్టక తప్పలేదు.అంతకన్నా షాకింగ్ న్యూస్ ఏమిటంటే …
ఆ వెయిట్రెస్ అమెరికా దేశాధ్యక్షుడి రెండవ కూతురు నటాషా(సాషా)
కొందరికి పని చేయాలంటే బద్ధకం…హోటల్లో పని చేయాలంటే మరీ నామోషీ …మనం ఏం చదివినా ఉద్యోగం మాత్రం ఏసీలో ఉండాలి…దర్జాగా ఉండాలి అనుకుంటాం.కానీ అమెరికా దేశాధ్యక్షుడి కూతురి,అగ్రరాజ్యానికి అధిపతి బరాక్ ఒబామా చిన్న కుమార్తె సాషా మాత్రం అలా అనుకోలేదు.కష్టపడే తత్త్వం…చేసే పని ఏదైనా సిన్సియర్ గా చేయాలనుకుంది.
అగ్రరాజ్యానికి అధిపతి అయిన బరాక్ ఒబామా చిన్న కుమార్తె సాషా ఓ హోటల్‌లో వెయిట్రెస్‌గా చేరింది. మనం నమ్మడానికి కాస్త సమయం పట్టినా ఇది నిజ్జం..
సమ్మర్ జాబ్‌లో భాగంగా మార్తాస్ వినీయార్డ్‌లోని సీఫుడ్ రెస్టారెంట్ అయిన నాన్సీస్‌లో నటాషా(సాషా) చేరింది.
15 ఏళ్ల నటాషా ఉద్యోగంలో ఏదో ఆషామాషీగా గడపడం లేదు. పూర్తిస్థాయి వెయిట్రెస్‌గా పనిచేస్తోంది. టేబుల్ క్లీనింగ్ నుంచి వినియోగదాలకు కావాల్సిన పదార్థాలు అందించడం వరకు అన్నీ చక్కగా చేస్తోంది. రెస్టారెంట్‌లోని బెంచీలు, బయట ఉన్న ఎస్‌యూవీ(కారు)లో ఉన్న ఆరుగురు సీక్రెట్ ఏజెంట్లు ఆమెకు కాపలాగా ఉంటున్నారు. నాలుగు గంటల షిఫ్ట్‌లో పనిచేస్తున్న నటాషా తన డ్యూటీ పూర్తయిన అనంతరం సెక్యూరిటీ సిబ్బందికి డ్రింక్స్ కూడా అందిస్తోందట.
నటాషా ఇలా ఓ రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పనిచేయడాన్ని అభినందించేవారి సంఖ్యా రోజురోజులూ పెరుగుతోందిట…. అమాత్యుల వారసులు పెద్దల పదవులు అడ్డుపెట్టుకుని నానా చెత్త పనులు చేసే …స్కాములు గట్రా చేస్తుంటే …
అగ్రరాజ్యాధినేత కూతురు నటాషా ఇలా ఓ రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పనిచేయడాన్ని మనం అభినందించాలి.ఆదర్శంగా తీసుకోవాలి.
ఇది ఒబామా తండ్రిగా సాధించిన విజయం …అతని పెంపకానికి మనం ఓటు వేయకతప్పదు.
ఈ కథనం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు……చీఫ్ ఎడిటర్