వరంగల్ నగర ప్రథమ పౌరుడిగా గుండా ప్రకాష్ రావు

మేన్ రోబో బ్యూరో ( వరంగల్ )
చారిత్రాత్మక ఓరుగల్లు నగరానికి మేయర్ గా 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుండా ప్రకాశ్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సౌమ్యుడిగా వివాదరహితుడిగా పేరు వున్న గుండా ప్రకాష్ రావు వ్యాపారవేత్తగా ,ప్రజలకు అందుబాటులో వుండే వ్యక్తిగా వరంగల్ ప్రజలకు సుపరిచితులు.
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ,కౌన్సిల్‌లో నాలుగు దఫాలుగా ఎన్నికైన చరిత్ర ,వున్న గుండా ప్రకాశ్‌రావు వరంగల్ నగర  కొత్త మేయర్‌గా శనివారం ప్రకాశ్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు
58 స్థానాలకు గానూ తెరాసకు సంపూర్ణ బలం ఉండడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
1994లో వరంగల్‌ మున్సిపాలిటీ.. కార్పొరేషన్‌గా అవతరించాక 1995లో జరిగిన ఎన్నికల్లో తొలి మేయర్‌గా కాకుమాను పద్మావతి పనిచేయగా, ప్రకాశ్‌రావు ఆరో మేయర్‌గా ఎన్నికయ్యారు.
దాదాపు మూడున్నర దశాబ్దాలకు పూర్వం యువతరంగం అనే పత్రికను నడిపారు.
ఏకగ్రీవంగా వరంగల్ మేయర్ గా ఎన్నికైన గుండా ప్రకాష్ రావు కు మేన్ రోబో అభినందలుతెలియజేస్తుంది.

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY