కార్పొరేట్ కల్చర్ లో హెయిర్ స్టయల్ మీ లుక్కును మారుస్తుంది …హెయిర్ స్టయిలిస్ట్ జ్యోతిరాజ్

బి.కామ్ చదివిన జ్యోతిరాజ్ తన వృత్తిని దైవంగా భావించాడు.
తన ప్రొఫెషన్ ను కార్పొరేట్ స్థాయికి విస్తరించాడు.
కస్టమర్స్ కు తన ప్రతిభ పట్ల నమ్మకాన్ని కలిగించాడు. 

మనం ఎంత అందంగా వున్నా మనల్ని మరింత అందంగా చూపిస్తుంది మన హెయిర్ స్టయల్
సెలూన్ కు వెళ్ళగానే మొక్కుబడిగా కత్తెర వేసి హెయిర్ కట్ చేసి పంపించేస్తే..కస్టమర్ కు శాటిస్ఫాక్షన్ ఉండదు.
అలా కాకుండా మీ పేస్ ను బట్టి,మీకు తగ్గట్టుగా హెయిర్ స్టయల్ చేస్తే అదో మ్యాజిక్ .
కార్పొరేట్ కల్చర్ లో హెయిర్ స్టయల్ మీ లుక్కును మారుస్తుంది.ఇదివరలో సినిమా వాళ్ళకే పరిమితమైన హెయిర్ స్టయిలిస్టులు ఇప్పుడు కార్పొరేట్ రంగానికివిస్తరించారు.
బ్యూటీ స్పా ల పరిధి పెరిగింది.
అయితే హెయిర్ స్టయిలిస్ట్ కు సహనం,సృజనాత్మకత వర్క్ పట్ల డెడికేషన్ కస్టమర్స్ ని ఆకట్టుకునే సంస్కారం ఉంటే ఆ రంగంలో  నిలదొక్కుకుంటారు.ఎప్పటికప్పుడు కొత్త హెయిర్ స్టయిల్స్ ,అంతకు మించి కస్టమర్స్ పట్ల కన్సర్న్ ఫీలింగ్ ఉండాలి.
ఒకసారి కస్టమర్ వస్తే అతను పర్మినెంట్ గా అక్కడికే రావాలి.
పదిహేడు సంవత్సరాలుగా హెయిర్ స్టయిలిస్ట్ గా పనిచేస్తున్న జ్యోతిరాజ్ లో ఈ క్వాలిటీస్ వున్నాయి.
పిల్లలైనా యూత్ అయినా,పెద్దలైనా అతనితో కనెక్ట్ అవుతారు.ఎవరికి ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలన్నా తన పనితనంతో మెప్పిస్తాడు.
ట్రిమ్ చేయాలన్నా కటింగ్ చేయాలన్నా హెయిర్ స్టైల్ మార్చాలన్నా కలర్ వేయాలన్న స్పెషల్  కేర్ అతని సెలూన్ లో స్పష్టంగా కనిపిస్తుంది.
అందుకే ఇన్నేళ్ళైనా అతను ఈ రంగంలో నిలదొక్కుకున్నాడు…

అల్ ది బెస్ట్

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

to be continued

1 COMMENT

LEAVE A REPLY