జీవితమే ఒక రంగస్థలం..నాటకం నా ప్రాణం -రావి నాగేశ్వరరావు చివరివరుసలో కూచున్న ప్రేక్షకుడికి కూడా ప్రతీపాత్ర కళ్ళముందు కదలాడాలి.సంభాషణలు హృదయానికి హత్తుకోవాలి.

( మేన్ రోబో బ్యూరో)
జీవితమనే రంగస్థల మీద దేవుడు సృష్టించిన పాత్రలు మనుష్యులైతే,ఒక రచయిత సృష్టించిన పాత్రలు రంగస్థలం మీద ప్రాణం పోసుకుంటాయి.అది కథ అయినా,నాటకం అయినా,సినిమా అయినా ,మాధ్యమం ఏదైనా రచయిత సృజన  ప్రేక్షకులను కట్టి పడేస్తుంది.
టూరింగ్ టాకీస్ నుంచి ఐ మాక్స్ హోమ్ థియేటర్ లు వచ్చినా ,నాటకం మాత్రం తన రాజసాన్ని కోల్పోలేదు. చివరిబెంచీలో కూచునే ప్రేక్షకుడి వరకూ నాటక ప్రదర్శన తీసుకువెళ్లడం గొప్ప ప్రక్రియ,ఎందుకంటే చివరివరుసలో కూచున్న ప్రేక్షకుడికి కూడా ప్రతీపాత్ర కళ్ళముందు కదలాడాలి.సంభాషణలు హృదయానికి హత్తుకోవాలి.బలమైన స్క్రీన్ ప్లే,కథను సాధారణస్థాయి ప్రేక్షకుడికి సైతం చేరేలా రచన చేయడం అద్భుతమైన ప్రక్రియ.
రావి నాగేశ్వరరావు
రిటైర్ జూనియర్ అసిస్టే౦ట్ (Judicial dept ) గా పదవీ విరమణ చేసినా తనలోని రచయిత నిత్య కృషీవలుడే.
నాటకరచన అతనికి ఇష్టమైన వ్యాపకం
వివిధ నాటక పరిషత్తులో నాటక ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు అందుకున్నారు.
తెలుగు కళాసమితి – విశాఖపట్నం వారు నిర్వహించిన నాటకపోటీల్లో ,ప్రముఖ రచయిత విజయార్కె సాక్షి దినపత్రిక లో రాసిన “ ఔను అ ఇంటి విలువ నిలువెత్తు మానవత్వం “ కధను నాటకీకరణ చేసి ప్రథమ బహుమతి విజేతగా నిలిచారు.
నాటకరంగ నేపథ్యంలో …
విశాఖ జిల్లాలోని చోడవరం నివాసం ,చదివింది బికాం
జూనియర్ అసిస్టే౦ట్ (Judicial dept ) గా ఇటీవలే పదవీవిరమణ చేసారు
ఇరవై నాటికలు వ్రాసాను త్యమేవాహం, కొసమెరుపు , అబ్బాయి పెళ్ళి , అగ్రిమెంట్, గోడ, అంకురం, అభినివేశం, చిటారుకోమ్మన మిటాయి పొట్లం,దొంగ చూపులు ,యజ్ఞం ,సతీ రూపవతీ శత్రు ,(భూ ) గర్భ శోకం,శాసన క్రీడాబిరామం,ఎ౦పు, మూడుకాళ్ళ మనిషి , మూడో నేత్రం,నిశబ్ద సంకేతం,సంకల్పం ,డ్రీం, శివుడు, చీమా చీమా ఎందుకు పుట్టావు ,అడ్రెస్ లేని మనిషి, భరోసా వివిధ నాటక పరిషత్తులలో బహుమతులు పొందాయి
అవార్డులు :
*మొదటిగా వ్రాసిన నాటిక త్వమేవాహం నాటికకుఉషోదయ కళాపరిషత్
*సత్తేనపల్లి (గుంటూరు జిల్లా ) రచన పోటీలో లో జూరీ అవార్డు ,
*కూరెల్ల సోమేశ్వరరావు ట్రస్ట్ విశాఖపట్నం నాటక రచన పోటీలో “ ఆడియస్సు బి రడీ “ నాటకానికి జూరీ అవార్డు
* 2019 తెలుగు కళాసమితి – విశాఖపట్నం “భరోసా “ నాటికకు జూరీ అవార్డు
* విజయార్కె గారి “ ఔను అ ఇంటి విలువ నిలువెత్తు మానవత్వం “ కధను విలువ పేరుతొ నాటికీకరణ చేసిన నాటికకు ప్రదమ బహుమతి వచ్చింది
*నాటకాలు :ఆడియన్ బి రడీ . మనసా కవ్వించకే , నవరసాలు ,దూరపు కొండలు . శివుడు, భరోసా , పంతం నాటికలు ఆకాశవాణి
విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం,అయ్యాయి
*2020 చీమా చీమా ఎందకు పుట్టావు ( పెద్దింటి ఆశోక్ కుమార్ గారి కధ) అజో . విజో .కందాళం పొండేషను వారి జనవరిలో జరిగిన నాటిక పోటీల ప్రదర్శించబడి ముద్రణకు నోచుకుంది
రావి నాగేశ్వరరావు మెయిల్ ఐడి
naaguravi@gmail.com
మేన్ రోబో నాటకరంగానికి చెందిన రచయితల దర్శకుల నిర్వాహకుల పరిచయాన్ని అందించాలని భావిస్తుంది.అందుకు మీ సహకారాన్ని ఆహ్వానిస్తుంది….చీఫ్ ఎడిటర్

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

 

NO COMMENTS

LEAVE A REPLY