congratulations …. హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ గా సి.వి.ఆనంద్ .

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ స్థానంలో ఉండి అవినీతి నిరోధకశాఖ డీజీగా బదిలీ అయిన అంజనీకుమార్‌ సీవీ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించారు.
నగర కోత్వాల్‌గా నియమించిన సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలియజేసారు సివి ఆనంద్.
Hyderabad police commissioner CV Anand : నగరంలో శాంతి భద్రతలతో పాటు సైబర్ క్రైం కట్టడికి కృషి చేస్తామని,హైదరాబాద్ సీపీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌ తెలిపారు.
మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగుతోందని…. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.
హైదరాబాద్‌ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. తాను పుట్టి పెరిగిన నగరానికి సీపీగా రావటం ఆనందంగా ఉందని తెలిపారు.
నేను చదువుకుని,పెరిగిన ప్రాంతానికి సీపీగా నియామకం కావడం చాలా సంతోషంగా ఉంది ” అన్నారు సి.వి.ఆనంద్
సౌమ్యుడిగా వృత్తి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే ఐపీఎస్ అధికారిగా పేరు సంపాదించుకున్న 
సి.వి.ఆనంద్ గారికి  మేన్ రోబో శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

ప్రముఖ రచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://kinige.com/author/Vijayarke

NO COMMENTS

LEAVE A REPLY