సకల శుభకరమగు కృష్ణాపుష్కరాలకు శుభస్వాగతం

(ఆగష్టు 12 కృష్ణ పుష్కరాల సందర్భంగా…చీఫ్ ఎడిటర్ )
( మైథిలి)
మహా దేవ పర్వత శ్రేణుల లో ఉద్భవించి రాష్ట్రాలుమారి కొండలు కోనలు దాటి, జలజలమను రసధ్వనితో పుడమితల్లిని పునీతం చేసే జీవనది…సకల ప్రాణకోటికి జీవనాధరమైన ప్రాణనది…
గత వైభవాల మేళవింపుతో …శతాబ్దాల చరిత రంగరింపుతో. ….ధార్మిక జీవనానికి మోక్షప్రదాయని …
మన జీవన వాహినిలో ఉత్తర వాహిని …కృష్ణా నది అలల ఒరవడిలో ఓ వేదం ధ్వనియిస్తే…
ఆ గలగల లోస్వరగతులనాదం జనియిస్తుంది…
ఆ సవ్వడి ఎందరోరాజుల చరిత్ర వినిపిస్తే మరెందరో కవి రాజుల కవనాలు పలికిస్తుంది. ..రైతన్న ఇంట సిరులపంట కురిపిస్తుంది…
మహా మహూల మహర్షుల సాంగత్యం సర్వదేవతల సంగమమై…పుణ్యఫలమిచ్చే ….పుష్కర కృష్ణ మ్మ కు ……..
అక్షర హారతి..

NO COMMENTS

LEAVE A REPLY