(గత సంచిక తరువాయి…)
ఆదివారం…
ఎస్వీ యూనివర్సిటీ లైబ్రరీ…
తెలుగు బుక్స్ విభాగం..
ఫ్రెండ్ సహాయంతో లైబ్రరీలో ఎంట్రీ దొరికింది.
మంచి డ్రామాలు ఉండే బుక్స్ షెల్ఫ్ గంటసేపు వెదికి మరీ పట్టుకున్నా.
బుక్స్ ఒక్కోటీ ఓపెన్ చేసుంటే బుర్ర గిర్రున తిరుగుతోంది.
కందుకూరి వీరేశలింగంగారి నవలలు నాటికలా ఉన్న బుక్స్, గయోపాఖ్యానం, రామాంజనేయ యుద్ధం లాంటి డ్రామాలు.
ఇవన్ని నాకే సరిగా అర్థం కావడం లేదు. ఇక ఇలాంటి డ్రామాలను నేను మా జూనియర్స్ కి నేర్పించడం అంటే అవుట్ అఫ్ మైండ్..
చినబాబు మాటలు గుర్తుకు వచ్చి ఒక్కసారి నీరసం ఆవహించిది.
సరి అయిన డ్రామాతో వెళ్లకపొతే నాపై ఉన్న మర్యాద గౌరవం తగ్గిపోతాయి. పైగా నేనేదో పెద్ద డైరెక్టర్, యాక్టర్ అని అనుకుంటున్నారు. దాన్ని మైంటైన్ చెయ్యాలంటే ఎదో ఒకటి చేసి డ్రామా రెడీ చెయ్యాలి.
పోనీ ఏదైనా పాయింట్ తీసుకుని స్క్రిప్ట్ ప్రిపేర్ చేద్దామంటే టైం లేదు. డైలాగ్స్ రాయడం ఎలానో కూడా తెలియదు.
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్న రీతిలో ఉంది నా పరిస్థితి. ఏదో గొప్పలకు పోయి సరిగ్గా ఇరుక్కుపోయాను అనుకున్నా…
అదేంటో గాని కష్టాలు పీక మీదకు వచ్చినప్పుడే బుర్ర బాగాపనిచేస్తుంది.
డ్రామా కోసం వెదుకుతూ ఆలోచిస్తుండగా వెంటనే క్లిక్ అయ్యింది…
నేను నవలలు కొనే షాప్…
మధుబాబుగారి డిటెక్టివ్ నవలలుతో స్టార్ట్ అయిన నా పుస్తకపఠనం షాప్ లో ఒక్క పుస్తకం కూడా వదలకుండా కొనే స్థితికి తీసుకువచ్చింది.
రెగ్యులర్ గా వెళ్ళే బుక్ షాప్ లో నాకు తెలిసి నవలలతో పాటు చాలా బుక్స్ ఉంటాయి…
అనుకున్నదే తడవుగా లైబ్రరీ వదిలి బయలుదేరా…
ఎస్వీ యూనివర్సిటీ నుండి గాంధీ రోడ్ 3 కిలోమీటర్లు పైనే ఉంటుంది.
మిట్ట మధ్యాహ్నం…
ఎండ మండిపోతోంది… అయినా లెక్కచేయకుండా బయలుదేరాను.
నడుస్తుంటే ఎందుకో మనసులో ఆందోళన.
ఎప్పుడూ నాకు కావలసిన బుక్స్ మాత్రమే కొనే నాకు అక్కడ ఒకవేళ డ్రామాకు సంబందించిన బుక్స్ ఉంటాయో లేవో తెలీదు. ఉంటే నా లైఫ్ ఈజీ.లేకుంటే…
కథ మళ్ళీ మొదటికి వచ్చినట్టు అయ్యింది…
ఏదైతే అది అవుతుందని మొండిగా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నా…
మనసుకు వచ్చే పిచ్చి ఆలోచనలను తొక్కిపెట్టి షాప్ చేరాను.
అనుమానంతో తడబడుతూ షాప్ అతణ్ణి డ్రామా బుక్స్ కోసం అడిగాను.
ఆటను లోపలి వెళ్లి కాసేపటి తరువాత వచ్చాడు.
ఆత్రంగా చేతిలో బుక్స్ ఏమైనా ఉన్నాయో లేవో అనుకుంటూ చూశాను.
అదృష్టం నావైపే ఉన్నట్టు అనిపించింది.
చేతి నిండా బుక్స్ తో నా ముందు నిలబడ్డాడు… ఒక్కసారిగా ధైర్యం వచ్చినట్టు అయ్యింది
అతని చేతిలోని బుక్స్ దాదాపు లాక్కున్నట్టు తీసుకున్నా.
నా రియాక్షన్ కి అతను షాక్ తిన్నట్టు నిలబడ్డా… నేను పట్టించుకోకుండా నా పని నేను ప్రారంభించాను.
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్