ఆంటీ దగ్గరగా నేను ఉండడంతో నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు.
నేను అర్థం కాకుండా అలానే నిలుచున్నాను. వాళ్ళు ఉన్న గ్రూప్ సాయిబాబాకు దగ్గరగా వస్తుంది.
ప్రతి ఒక్కరి చేతిలో ఏదో పూజకు సంబందించిన వస్తువు ఉంది.
ఇంతలో నా ప్రక్కన ఉన్న వ్యక్తి ఆంటీ చేస్తున్న సైగను చూసి నన్ను ముందుకు నెట్టాడు.
అనుకోని ఆ సంఘటనకు నను తూలి ముందుకు పడబోతూ నిలద్రోక్కుకోవడానికి కొన్ని అడుగులు ముందుకు వేశాను. అలా ఆంటీ సమీపానికి పోయాను.
ఆంటీ తన చేతిలో ఉన్న పూజా వస్తువును నా చేతిలో పెట్టి నన్ను లైన్ లో ముందు నిలబెట్టింది.
నాకు క్షణకాలం ఏమీ అర్థం కాలేదు. అప్పటికే నేను ఉన్న గ్రూప్ సాయిబాబాకు అతి దగ్గరగా వచ్చేసింది.
ఇక ఏమి మాట్లాడినా ప్రయోజనం లేదనుకుంటూ మా గ్రూప్ లో ఉన్న వ్యక్తులు ఏమి అంటున్నారో వినడానికి ట్రై చేశాను.
ఏదో మంగళ హారతికి సంబంధించి పాడుతున్నారు. ఆ పాట బాల వికాస్ లో అప్పుడప్పుడు పాడేదే కనుక వినగానే అర్థం అయ్యింది. వాళ్ళతో పాటు నేను కూడా ఆ పాట పాడుతూ ముందుకు సాగాను.
అలా మేము సాయిబాబా ముందుకు వచ్చి నిలబడ్డాం.
అప్పుడే సాయిబాబాను అతి దగ్గరగా చూశాను. తెల్లటి సిల్క్ డ్రెస్ లో మెరిసిపోతున్నాడు.
మరో రెండు గంటల్లో ప్రోగ్రాం అయిపోయింది. మేము షెడ్ కి చేరాం.
ఇక అందరూ తిరుగు ప్రయాణం ప్యాకింగ్ లో బిజీ అయ్యారు.
మరో గంటలో బస్ ఉండడంతో ఆంటీ నన్ను ఎక్కడికీ పోవద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు.
బ్యాగ్స్ ప్యాకింగ్ లో నా వంతు సహాయం నేను చేశాను.
మరో పది నిముషాలలో అన్నీ రెడీ అయ్యాయి.
మిట్టమధ్యాహ్నం కావడంతో ఎండ తన ప్రతాపాన్ని మాపై చూపుతోంది.
ఇక రిటర్న్ లో తిరుపతికి ఏ బస్ ముందు వస్తే ఆ బస్ లో బయలదేరాలని ఆంటీ పట్టుబట్టింది.
ఇక మేం ఇళ్ళు చేరడానికి బాగా పోద్దుపోతుందని ఆంటీ తొందర.
మా జూనియర్స్ మా ఇంటి పక్కనే ఉండడంతో వాళ్లకు ఇబ్బంది లేదు.
మా అదృష్టం బాగుంది. ఎక్కువ వెయిట్ చేయ్యకనే బస్ వచ్చేసింది. అప్పటికే చాల గ్రూప్స్ ప్స్ వెళ్ళిపోవడంతో మాకు ఈజీగానే సీట్ దొరికింది.
అలా మా పుట్టపర్తి ప్రయాణం పదనిసలతో హాయిగానే గడిచింది
*
నా చిన్ననాటి ముచ్చట్లను ఇంతకాలం ఆదరించిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ – మీ సురేంద్ర
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్