అతని చూపుడువేలులో రహస్యం ఏదో వుందనిపించింది….వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ (19-02-2017)

                                       (17)
ఒక్కక్షణం బాధతో కళ్ళు మూసుకున్నాడు అనిరుద్ర.మొదటసారి తను డప్పుదాసును కలిసిన సంఘటన గుర్తొచ్చింది.ప్రజల్ని తనడప్పుతో మేలుకొలిపే టముకు శబ్దం ఇక వినిపించాడు.పోలీసులకు పరోక్షంగా సహకరిస్తూ తన ప్రాణాలను కోల్పోయిన డప్పుదాసుకు మౌనంగా శ్రద్ధాంజలి ఘటించాడు.
అతని చూపుడువేలులో రహస్యం ఏదో వుందనిపించింది.మెల్లిగా ఆ పొదలవైపు కదిలాడు.అలా కదులుతూ ఒకసారి వెనక్కి తిరిగాడు,అతని చూపు స్వప్నిక మీద పడింది.స్వప్నిక చుడిదార్ కు వుండే హుక్ దగ్గర వున్న డివైస్ ను ఒక్కసారి పరీక్షగా చూసాడు.అతని చూపులు గమనించి ఒక్కక్షణం సిగ్గుపడింది.స్వాప్నిక మొహం  ఎర్రబడింది.
అనిరుద్ర స్వాప్నిక దగ్గరికి వచ్చి ఆ డివైస్ తీసివ్వమన్నట్టు సైగ చేసాడు.స్వాప్నికతో పాటు ఎర్విక్ కూడా తన దగ్గర వున్న డివైస్ తీసి అనిరుద్రకు ఇచ్చింది.అనిరుద్ర తన షర్ట్ బటన్ కు వున్న డివైస్ తీసి మూడింటినీ కిందవేసి షూ తో గట్టిగా తొక్కేసాడు.డివైస్ లు ముక్కలయ్యాయి.
ఇక పరమహంస తమను ట్రె చేసే అవకాశం లేదు..అనుకున్నాడు.తర్వాత ఆ పొదలవైపు నడిచి షాకయ్యాడు.ఆ పొదల్లోపల సొరంగ మార్గం వుంది.మెల్లిగా అందులోకి ప్రవేశించాడు.అతడ్ని ఎర్విక్ ,స్వాప్నిక ఫాలో అయ్యారు.అతని చేతిలో వున్న మొబైల్ లోని ఫ్లాష్ వెలుతురులో లోపలికి నడుస్తున్నారు.కొద్దీ దూరం నడిచాక అతనికి ఏవో శబ్దాలు వినిపించాయి.చిన్న చెక్కగోడలాంటిది తగిలింది. చెక్కగోడకు  ద్వారం ఎక్కడ వుందానని వెతుకుతున్నాడు.అతని అన్వేషణ ఫలించింది.ద్వారం ఎక్కడుందో తెలిసింది.
                                                     ***
గోమతి మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది.తలంతా దిమ్ముగా అనిపించింది.వృద్ధుడి తలమీద ఎవరో బలంగా   కొట్టడం,అతను తనకళ్ల ముందే పడిపోవడం,తనకు స్పృహతప్పి పడిపోవడం అంతా గుర్తుకు వచ్చింది. 
కళ్ళు  తెరిచి చూస్తే నేలమీద పడివుండాల్సిన వృధుడు లేదు.కానీ ఇద్దరు వ్యక్తులు తలకు గాయాలతో కనిపించరు.అంటే ఆ వృద్ధుడే వీళ్ళను కొట్టి వెళ్లిపోయాడా?ఆలోచిస్తూ ఉండగానే ఆమెను ఓ విషయం   అర్థమైంది.తన చేతులకు కట్లు లేవు.అంటే తన కట్లు విప్పి అతను వెళ్లిపోయాడా?మరి తననెందుకు తీసుకువెళ్ళలేదు…గోమతి వెంటనే కుర్చీలో నుంచి లేచింది.ఆ గది అంతా పాడుబడి వుంది.తానెలా పారిపోవాలో అర్థం కావడం లేదు.ఏడుపు తన్నుకు వస్తుంది.నిస్సహాయంగా దరి వెతుకుతుంటే ఆమె దృష్టి గోడమీద పడింది.
రక్తంతో బాణం గుర్తు కనిపించింది.పారిపో అన్న అక్షరాలు కనిపించాయి.అంటే బాణం చూపంచిన గుర్తు ద్వారా పారిపోవాలా? వెంటనే బాణం గుర్తు వున్న వైపు పరుగెత్తింది.ఇక బలమైన చెక్కతలుపు కనిపించింది.అక్కడికి వెళ్లేసరికి ఆ తలుపుభయంతో వణికిపోయింది.ఎవరై వుంటారు?ఖచ్చితంగా శత్రువులై ఉండకపోవచ్చు.
ఎందుకంటే వాళ్లకు ఈ మార్గాలు అన్నీ తెలుసు.తనను రక్షించాడనికి దేవుడు ఎవరినైనా పంపించాడా?అలా ఆలోచిస్తూ,భయపడుతూనే మెల్లిగా తలుపు తీసింది.
వచ్చేవారం వరకూ…బీ అలర్ట్
మిమ్మల్ని అలరిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ కినిగే ద్వారా ఈ బుక్ గా మీ ముందుకు వచ్చింది.
ఈ నవల మీద మీ స్పందన తెలియజేయండి.
నార్త్ అవెన్యూ నవల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/book/North+Avenue

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY