నా గుండెను చీల్చి వెలుతురూ కిరణాల ఎదురుగా…నేను అవనిని…తేజారాణి తిరునగరి కవిత

నా గర్భంలో ఊపిరి పోసుకున్న మొక్క ఏదైనా…
పవిత్రమైన తులసీ దళం అయినా..
గంజాయివనం అయినా…
ఆహ్లాదాల పూదోట అయినా ..
నాలో మొలకెత్తిన మొక్కకు ఊపిరి పోసి…
వృక్షంగా ఎదిగేందుకు …
నా గుండెను చీల్చి వెలుతురు కిరణాల ఎదురుగా నిలబెడుతాను…
సహనం నా గుణం.. క్షమయా ధరిత్రి నా నైజం.
ప్రకృతి వైపరీత్యాలను … మనోహర దృశ్యాలను నా నేత్రాలతో వీక్షిస్తాను.
మీ భారాలను మోస్తాను మీ చితాభస్మాన్ని స్పృశిస్తాను
మీ మృతదేహాలను నాలో పదిలపర్చుకుంటాను.
కదిలే వర్తమాన కాలాన్ని చూస్తాను…
గతాన్ని గుండెల్లో పదిలపర్చుకుంటాను..,
భవిష్యత్తుకు సాక్షిగా నిలబడుతను..
నేను మీ అవనిని,మీ భూమిని….
నన్ను ప్రేమించండి.. నన్ను కాపాడుకోండి…

 

తేజారాణి తిరునగరి అనగనగా ఒక మనస్సు కథ ,నేను క్యాన్సర్ ని జయించాను పుస్తకాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/ksearch.php?searchfor=tejarani

                                                       

NO COMMENTS

LEAVE A REPLY