మూడువందల అరవైనాలుగు రోజుల శ్రమకు దక్కే పురస్కారం…గెలుపు…ఉత్తీర్ణత
జూన్ నుంచి మార్చి వరకు తరగతిగదిలో నేర్చుకున పాఠాలు ,ఇంట్లో చదువుకున్న చదువులు,అమ్మానాన్నలు పడ్డ తపన….విద్యార్థుల ఏకాగ్రత వీటన్నింటికీ ఒకేఒక ఫలితం ఇపుడు మీరు రాయబోయే పరీక్షల మీదే ఉంటుంది.
ఇది పరీక్షా సమయం..విద్యార్థులకు, ఉపాథ్యాయులకు, తల్లిదండ్రులకు…
తనదగ్గర పాఠాలు నేర్చుకున్న ప్రతీవిద్యార్థి ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని ఉపాథ్యాయులు కోరుకుంటారు.
సంవత్సరమంతా ఫీజులు కట్టి ఇంట్లో పిల్లలను చదివించి పాస్ అనే ఒకేఒకే “గెలుపు పదం” కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తారు.
ప్రతిరోజూ బుద్ధిగా స్కూల్ కు వెళ్లి ఉపాథ్యాయులు చెప్పిన పాఠాలు విని ,చదువుకుని పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుని పై తరగతికి వెళ్లి,విద్య నేర్పిన గురువులకు,జన్మనిచ్చి తమకోసమే కష్టించే,జీవించే తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని పిల్లలూ ఎదురుచూస్తారు.
అందుకే ఇది అందరికీ పరీక్షాసమయం.
ఇన్నాళ్లు మీరు చదివింది వేరు…ఇప్పుడు చదివింది మరోసారి మననం చేసుకుని,పరీక్షాపత్రంలో ఇచ్చే ప్రశ్నలకు ప్రశాంతంగా అలోచించి సమాధానాలు రాసే సమయం.
వేకువనే లేచి,శుభ్రంగా తయారై పుస్తకాలు ముందేసుకుని ఒక్కసారి పునశ్చరణ చేసుకోండి.
ఆందోళన వదిలేయండి.
పరీక్షాసమయానికన్నా ముందే పరీక్ష కేంద్రంలో వుండండి.
ప్రశ్నాపత్రాన్ని శ్రద్ధగా చదవండి.తెలిసినవాటికి సమాధానాలు ముందు రాయండి.
తొందరపడి కొట్టివేతలు,కలిపిరాతలు రాయకండి.
ఒక్కసారిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని తరగతి గదిలో మీ ఉపాథ్యాయులు చెప్పిన పాఠాలు గుర్తుకు తెచ్చుకోండి.ఇంట్లో మీరు చదువుకున్న జవాబులు సరిచూసుకోండి.
పరీక్షాసమయానికన్నా ముందే రావాలన్న ఆత్రుత వద్దు.పూర్తి సమయం వరకు వుండండి.పూర్తి సంతృప్తి కలిగేవరకు తొందరపడకండి.
పరీక్ష రాసాక దాని గురించి ఆదుర్ధా పడుతూ,,స్నేహితులతో చర్చిస్తూ.ఎన్ని మార్కులు వస్తాయో..అని తర్జనభర్జనలు వద్దు..
మరుసటిరోజు పరీక్ష గురించి మాత్రమే ఆలోచించాలి.ఒకసారి చేసిన పొరపాటు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి.
తల్లిదండ్రుల్లో కనీసమై ఒక్కరైనా పిల్లల పరీక్షలు అయ్యేవరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
తెల్లవార్లూ చదివించడం మంచిది కాదు.దానివల్ల మరుసటిరోజు పరీక్ష సమయంలో అలసట మత్తు ఉంటుంది.
మీరు దగ్గర ఉండి పిల్లలను చదివించడం వల్ల వాళ్లలో సెక్యూర్డ్ ఫీలింగ్ కలుగుతుంది.
పళ్లరసాలు ఇవ్వండి.అదేపనిగా టీలు,కాఫీలు ఇవ్వొద్దు.
పరీక్షకు వెళ్లేముందు కొబ్బరినీళ్ళు తాగించండి. వీలయితే మీరే పరీక్షాకేంద్రానికి తీసుకు వెళ్ళండి.ఆల్ ది బెస్ట్ చెప్పండిమీ విషెస్ వారికి సంతోషాన్ని కలిగిస్తుంది.
పరీక్షల సమయంలో ఇంట్లో టీవీ ని కట్టేయండి .మీరూ చూడకండి.
మీరూ మీపిల్లలు ఉపాథ్యాయులు సంవత్సరంపాటు పడిన శ్రమకు ఫలితం వచ్చే పరీక్షా సమయం…అత్యుత్తమ ఫలితాలు ఇస్తుందని ఆశిద్దాం.
ఆల్ ది బెస్ట్
మీ డాక్టర్ కోమటిరెడీ గోపాల్ రెడ్డి
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్