“థాంక్యూ సర్ ..మీవల్ల ఈరోజు నేను ప్రాణాలతో బ్రతికున్నాను.అంతేకాదు మా పూర్వీకుల గుర్తుగా వున్న నార్త్ అవెన్యూ స్వంతం చేసుకున్నాను.నాకు ఆస్తిమీద వ్యామోహం లేదు.నార్త్ అవెన్యూ ని మ్యూజియం గా మారిస్తే ఈ భవనాన్ని ప్రభుత్వపరం చేస్తాను.అంతే కాదు చుట్టుపక్కల వున్న స్థలాలను అమ్మేసి నార్త్ అవెన్యూ లో నా సోదరుడి మూలంగా ప్రాణాలు కోల్పోయిన వారికీ నష్టపరిహారంగా,పాపప్రక్షాళనగా చెల్లిస్తాను.
పరమహంస కోలుకున్నాక తను జైలు నుంచి బయటకు వచ్చేక,నా మిగితా ఆస్తిని అతనికి చెందేలా వీలునామా రాస్తున్నాను…సెలవు”రెండు చేతులూ జోడించాడు రాజహరిశ్చంద్ర ప్రసాద్ అనబడే ఆ వృద్ధుడు.
ఆ రోజే గోమతిని ఢిల్లీ కి పంపించాడు అనిరుద్ర.
ఆ సాయంత్రం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎర్విక్ కు సన్మానం జరిగింది.స్వాప్నిక బాధ్యతను అనిరుద్ర స్వీకరించాడు భార్యగా.
***
ఎయిర్ ఫోర్ట్ లో సమీర్ ఎర్విక్ తన ఇద్దరు చిన్నారులతో సహా అనిరుద్ర స్వాప్నికాలకు వీడ్కోలు చెప్పింది.
విమానం గాల్లోకి ఎగిరింది.ఆనందం అంబరాన్ని తాకింది.
నార్త్ అవెన్యూ టూరిస్ట్ స్పాట్ గా మారింది.
***అయిపొయింది ***
ఒకమాట
నార్త్ అవెన్యూ ని ఇన్నివారాలుగా మేన్ రోబో లో సీరియల్ గా ఆదరించిన పాఠకాభిమానులకు కృతఙ్ఞతలు.చాలా టెన్స్ తో కాసింత భయంతో రాసిన సీరియల్ నవల నార్త్ అవెన్యూ.థ్రిల్లర్ రాయడం నాకు కొత్త.
ఇప్పుడిపుడే అక్షర ప్రపంచంలో సాహితీ లోకంలో నడకలు నేర్చుకుంటున్నాను.ఫిక్షన్ ఎలా రాయాలి.ఎలాంటి సమాచారాన్ని సేకరించాలి.మనకు తెలిసి సమాచారాన్ని ఎలా అందించాలి.ఎక్కడ మొదలుపెట్టాలి?ఎలా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి…?
పాఠకులకు నచ్చేలా సస్పెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి?ఇలాంటి విషయాలు నేర్చుకుంటూ రాసిన సీరియల్ ఒక్కో చాప్టర్ రెండుమూడు సార్లు తిరగరాయాల్సి వచ్చేది.ఒక రచన అద్భుతంగా ఉండాలంటే రైటర్ కు నిజాయితీతో పటు సహనం,పరిశీలనా దృక్పథం,ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పే ప్రయత్నం అనివార్యం.అవసరమని తెలుసుకున్నాను.
డెత్ సెంటెన్స్ తరువాత నేను పూర్తిస్థాయిలో రాసిన థ్రిల్లర్ నార్త్ అవెన్యూ.
నన్ను రచయిత్రిగా ప్రోత్సహిస్తూ ఆదరిస్తోన్న పాఠకులకు మేన్ రోబో కు కృతఙ్ఞతలు అనే పదం చాలా చిన్నది…,పెద్దమనసుతో చిన్న పదాన్ని స్వీకరించండి.థాంక్యూ సో మచ్
తేజారాణి తిరునగరి
మిమ్మల్ని అలరిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ నార్త్ అవెన్యూ కినిగే ద్వారా ఈ బుక్ గా మీ ముందుకు వచ్చింది.
ఈ నవల మీద మీ స్పందన తెలియజేయండి.
నార్త్ అవెన్యూ నవల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/book/North+Avenue
తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్