కోయిల కూజితాలు… మామిడితోరణాలు… షడ్రుచుల సంబరాలు …నూతనసంవత్సరాన్ని ఆహ్వానించే తెలుగువారి స్వాగత స్వగతాలు…
శ్రీ హేవిళంబి నామ ఉగాది నీకు శుభస్వాగతం…
ఈ ఉగాది సరికొత్త సృజనాత్మకతకు నాంది పలకాలి…ఆదిగా ..ముందుగా నిలవాలి.
ఒక రైతు మొక్కలు నాటి పంటను పండిస్తే ఆ ప్రాంతం సుభిక్షతమవుతోంది.
అలాగే మనం మన పిల్లల్లో సృజనాత్మకత అనే మొక్కను ఇప్పుడే నాటుదాం…
ఆ సృజనాత్మకత పెరిగి పెద్దయి మహావృక్షమై ఎందరికో స్ఫూర్తినిస్తుంది..మరెందరికో నీడనిస్తుంది…ఇంకెందరికో దారి చూపుతుంది.
సృజనాత్మకతే ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్తుంది.కొత్త ఆవిష్కరణలకు మార్గదర్శకం అవుతుంది.
మన చిన్నారులకు సృజనాత్మజాత పట్ల ఆసక్తి కలిగిద్దాం..మీ పిల్లలను రోబోలుగా మార్చకండి.చదువు పట్ల;ఆసక్తిని పెంచండి.కళల పట్ల మక్కువ ఏర్పరచండి.వారిలోని ఆలోచనలకు ఊతం ఇవ్వండి.కొత్తదనాన్ని ప్రోత్సహించండి.రేపటితరానికి మీ పిల్లలే సృజనాత్మక నిండిన ఉత్తమ పౌరులుగా నిలవాలి.
సృజనాత్మకత లేని రేపటిప్రపంచం మన పిల్లలను రోబోలుగా,యంత్రాలుగా మారుస్తుంది.యాంత్రికమైన మన ఆలోచనలు ప్రపంచగమనాన్ని త్రిశంకుస్వర్గంలా మారుస్తుంది.
ఈ ఉగాది సృజనాత్మకతకు శుభారంభం కావాలి…
శాస్త్రవేత్తలు కవులు కళాకారులు రచయితలు ఉపాథ్యాయులు జైజవానులు జైకిసానులు ఇంజనీర్లు కలెక్టర్లు వైద్యనారాయణులు పోలీసులు …
ఆసేతుహిమాచలం సృజనాత్మకత నిండిన బాలభారతం కావాలి… నూతనత్వానికి స్వాగతం పలకాలి.రేపటితరానికి విజయపతాకగా గగనాన సగర్వంగా ఎగరాలి.
ఇది నా సంకల్పం
శ్రీ హేవిళంబి నామ ఉగాది శుభాకాంక్షలతో..మీ విద్యారత్న డాక్టర్ లయన్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
విజయాన్నికోరుకునేవారికోసం..పుస్తకం కోసం ఇక్కడ క్లిక్ చేయండి