ఆ టెన్షన్ నాకే కాదు మా టీం వారికి కూడా ఉన్నట్టు ఉంది. ఎవరూ ఆయన వంక చూడలేదు… స్మార్ట్ రైటర్ సురేంద్ర నిన్నటి నేను (23-04-2017)

(గత సంచిక తరువాయి)
సైన్స్ ఫెయిర్…
ఎస్వీ (శ్రీ వెంకటేశ్వర) హైస్కూల్ లో ఏర్పాటు చేశారు…
చాలా స్కూల్స్ నుండి ఎంట్రీస్ వచ్చినట్టు ఉంది.ఒక్కటే కోలాహాలం…
రకరకాల స్కూల్ డ్రెస్ లో మెరిసిపోతున్నారు. ఒక్కో స్కూల్ కి ఒక్కో ప్లేస్ కేటాయించినట్టు ఉంది.
మా పి.ఇ.టి సర్ అప్పుడే వచ్చినట్టు ఉన్నాడు.
అక్కడ ఉన్న క్రౌడ్ చూసి ఆయనకు టెన్షన్ ఎక్కువైనట్టు ఉంది.
“మీరు ఏం చేస్తారో ఏమో నాకు మాత్రం టెన్షన్ గా ఉంది” అంటూ స్టార్ట్ చేశారు.
ఆయన మాటలను మేము పట్టించుకోకూడదు అని కలసికట్టుగా డిసైడ్ చేసుకోవడం వల్ల ఆయన మాటలను లెక్క చేయలేదు. మా టర్న్ వచ్చేవరకు సైన్స్ ఫెయిర్ ఆర్గనైజర్స్ ఇచ్చిన బిస్కట్స్ తింటూ అక్కడ వచ్చిన వారిలో మాకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అంటూ వాకబు చేస్తూ గడిపేశాం.
ఇంతలో మా స్కూల్ పేరు పిలిచారు. మా టీం రెడీగా ఉంది. మా సర్ మొహంలోకి చూడదలుచుకోలేదు. ఆయన టెన్షన్ తో మాకు ఎక్కడ టెన్షన్ పెరుగుతుందో అన్న భయం.
ఆ టెన్షన్ నాకే కాదు మా టీం వారికి కూడా ఉన్నట్టు ఉంది. ఎవరూ ఆయన వంక చూడలేదు.
మా డ్రామా స్టార్ట్ అవుతుంది అంటూ మైక్ లో అనౌన్స్ మెంట్ వినిపించింది.
మొదట నేనే స్టార్ట్ చేయాలి.
ధైర్యంగా స్టేజి ఎక్కాను… స్క్రీన్ తీయడంతో మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది. మ్యూజిక్ మా డ్రామాలో లేదు. ఇక్కడ ఉండడంతో ఒక్కసారి కన్ఫ్యూస్ అయ్యాను. అయినా అది బయట కనపడకుండా స్టార్ట్ చేశాను.
ఆడియన్స్ నుండి ఎవరో నా పేరు బిగ్గరగా పిలిచారు. అది ఖచ్చితంగా మా ఫ్రండ్స్ లో ఎవరో ఒకరే. నేను పెద్దగా పట్టించుకోకుండా అలవాటు ప్రకారం కంటిన్యూ చేశాను.
నా తరువాత వచ్చే క్యారెక్టర్స్ తమ రోల్ ను మిస్ కాకుండా అందుకున్నారు.
డ్రామా సక్సస్ గా కంప్లీట్ అయ్యింది. సోషియో ఫాంటసీ డ్రామా కావడం వల్ల రెస్పాన్స్ అదిరిపోయింది. ఆగకుండా చప్పట్లు…
డ్రామా అయ్యాక మేకప్ తీసేసి మా సర్ వద్దకు వచ్చాం. ఆయన పేస్ వెలిగిపోతోంది.
“వండర్ ఫుల్… అమేజింగ్… అదరగొట్టారు.. మీ పెర్ఫార్మన్స్ మార్వలెస్” అంటూ తెగ పొగిడేస్తున్నారు.
ఇంత రియాక్షన్ అవసరమా… బాలన్స్ చేసుకోలేని ఎమోషన్స్ టీచర్స్ కూడా ఉంటాయా అనిపించింది.
సైన్స్ ఫెయిర్ డ్రామా కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ మాకే వచ్చింది. స్కూల్ లో మా పేరు మారుమ్రోగిపోయింది.
ఆ ఉత్సాహంతో స్కూల్ డే ప్రోగ్రాం కి రెడీ అయ్యాం…
***
స్కూల్ డే…
స్కూల్ డే ను రెండు రోజులుగా విడగొట్టారు.
స్పోర్ట్స్ డే ఒకరోజు… స్కూల్ డే మరో రోజు…
డ్రామాలో ఉన్నవారిని ముందు జాగ్రత్తగా స్పోర్ట్స్ లో పాల్గొననివ్వలేదు.
స్పోర్ట్స్ లో దెబ్బలు తగిలితే నెక్స్ట్ డే ప్రోగ్రాం దెబ్బతింటుంది అనుకున్నట్టు ఉన్నారు.
మా డ్రామా రాత్రి 7 గంటలకు…
అందరిని మద్యాహ్నం రమ్మని చెప్పారు.
స్నాక్స్ రెడీ చేశారు. మద్యాహ్నం ఎప్పుడో ఇంట్లో తిన్న ఫుడ్ అప్పటికే అరిగిపోయింది.ఆకలి కేకలు వేస్తోంది…
ఫుడ్ పడకపోతే బండి పని చెయ్యదు.
స్నాక్స్ స్టోర్ చేసి ఉన్న రూమ్ ఎక్కడ ఉందో కనుక్కున్నాను.
***

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY