ఫీడ్ బ్యాక్
*చరణ్ పాట్లు చదువుతుంటే నవ్వాగడం లేదు…మా బాస్ అపార్థం చేసుకుంటాడని నవ్వాపుకుంటున్నాం…(హైమ ) విజయవాడ
*మంచి రిలీఫ్ …శ్రీ&శ్రీమతి మా పేవరెట్ సీరియల్ అయిపొయింది ..కేఆర్ .రాజు సుందరం(వరంగల్)
*చాలాకాలం తర్వాత ఒక ప్లజంట్ సీరియల్ చదువుతున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది.కళ్ళముందు పాత్రలు భలే గమ్మత్తుగా వున్నాయి….శ్యామ్ కుమార్ (బెంగుళూరు)
5
రాత్రి పదకొండు అయ్యింది.
చరణ్,ప్రసాద్ ఇద్దరూ బయటకు వచ్చారు.మొహం గుర్తు పట్టడానికి వీల్లేకుండా రకరకాల రంగులు పులుముకున్నారు
తిక్కేశ్వర్రావు ఇంటి దగ్గరికి వచ్చారు.
వరండాలోకి వచ్చాడు చరణ్ .కూడా ప్రసాద్ వున్నాడు.చరణ్ కిటికీలో నుంచి చూసాడు.బెడ్రూమ్ లా వుంది.వరండాలోకి చూసాడు పక్క కిటీకీలో నుంచి.తన ప్యాంటూ షర్ట్ కనిపించాయి,
ప్రాణం లేచివచ్చినట్టు అయ్యింది చరణ్ కు,ఎగిరి గంతు వేయాలనుకున్నాడు.
సరిగ్గా అదే సమయంలో మెలుకువ వచ్చింది తిక్కేశ్వర్రావు కు.
ఏదో శబ్దం వినిపించింది.అనుమానంగా భార్య వైపు చూసాడు.హాయిగా నిద్ర పోతుంది.పక్కనే వున్నా టార్చీ లైట్ తీసుకుని పెరటిగుమ్మం వైపు కదిలాడు.టార్చీలైట్ వేసి మొత్తం చూస్తున్నాడు అనుమానంగా.ఓ చేత్తో వీరప్పన్ స్టయిల్లో గన్ పట్టుకుని.
చరణ్ మెల్లిగా ఓ పెద్దకర్రను చివర కొక్కెం లా కిటికీలో నుంచి ప్యాంటుకు తగిలించి బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నాడు.
ప్రసాద్ కాపలా కాస్తున్నాడు.అప్పుడే తిక్కేశ్వర్రావు వచ్చాడక్కడికి.
ప్రసాద్ కు పై ప్రాణాలు పైనే పొయ్యాయి.అరుద్దామనుకున్నాడు.తిక్కేశ్వర్రావు గన్ ప్రసాద్ వైపు గురిపెట్టాడు.బ్రతికుంటే పానీపూరి అమ్ముకుని అయినా బ్రతకొచ్చనుకున్నాడు.
తిక్కేశ్వర్రావు చరణ్ వెనుకవైపు నుంచి వెళ్లి భుజం తట్టాడు.”ష్ …ఆగరా…? దగ్గరికి వచ్చేసింది.మళ్ళీ అనుమానపు తిక్కోడు నిద్రలేస్తే కష్టం.”విసుక్కుంటూ చెప్పాడు…. ప్యాంటూ షర్ట్ కర్రతో తీసుకునే ప్రయత్నం చేస్తూ.
“పళ్లు పటపట నూరి మళ్ళీ భుజం తట్టాడు తిక్కేశ్వర్రావు .
“అబ్బబ్బ …నీకు బొత్తిగా మ్యానర్స్ లేకుండా పోతుందిరా…” అంటూ వెనక్కి తిరిగి తిక్కేశ్వర్రావు ను చూసి హారర్ పిక్చర్ చూసినట్టు కెవ్వుకెవ్వుమంటూ కేకేశాడు …
ఆ అరుపుకు వీపు చరుచుకుని భయంతో గన్ వదిలేసాడు తిక్కేశ్వర్రావు ,
అంతే …ప్యాంటు గబగబా వేసుకుని చొక్కా చేతిలో పట్టుకుని పరుగెత్తాడు చరణ్.
ప్రసాద్ వెనుకే చరణ్ ను ఫాలో అయ్యాడు
ఈ హడావుడికి శ్రీ లక్ష్మి నిద్ర లేచింది.
“ఎవడు వాడు…ఎక్కడివాడు…ఇంత రాత్రి వేళ మన ఇంటికి వచ్చిన ఆ మగవాడు?అసలీ మలయాళం సినిమా ఎన్రోజులుగా ఆడుతుంది.? జుత్తు పీక్కుంటూ అడిగాడు
వెంటనే శ్రీ లక్ష్మి మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని.మొగుడి చెంపలు టపటపా వాయించి…”అమంగళం మాటలు మాట్లాడితే అడ్రెస్ లేకుండా పోతారు.నా బొట్టుబిళ్ల రాలిపడుతుంది?అంది డ్రమెటిగ్గా
“నీ పాతివ్రత్యాన్ని హాలీ వుడ్ లో సినిమా తియ్య…నా చెంపలు వాయించి మంగళసూత్రాన్ని అడ్డుకుంటావా?హమ్మా హమ్మమ్మా “నెత్తీ నోరు బాదుకున్నాడు తిక్కేశ్వర్రావు.
(వాట్ నెక్స్ట్…వచ్చేవారం)
తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్