ప్రశంసల వర్షంలో తడిసి ముద్దవుతోన్న స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (07-05-2017)

ఫీడ్ బ్యాక్
*సురేంద్ర గారూ..నిన్నటి మీ జ్ఞాపకాలు మమ్మల్ని కాలయంత్రంలో వెనక్కి తీసుకువెళ్తున్నాయి… పి.రత్నకుమారి (చెన్నై)
*చిన్నప్పటి మా ఆటపాటలు మళ్ళీ మా కళ్ళముందుకు తీసుకు వచ్చారు…థాంక్యూ సురేంద్రజీ..థాంక్యూ మేన్ రోబో (పల్లవి శర్మ) ముంబై
*సాహితీవనంలో చిన్ననాటి,”నిన్నటి నేను “పరిమళాలు …శ్వేత (వైజాగ్)
(గత సంచిక తరువాయి)
స్టేజ్ పైన నన్ను చూడగానే మా ఫ్రండ్స్ ఒక్కటే చప్పట్లు, ఈలలు కేకలు…
అప్పటికే సైన్స్ ఫెయిర్ లో స్టేజ్ ఎక్కడం వల్ల నాకు స్టేజ్ పైన ఏ ఇబ్బంది కలగలేదు. అంతకు ముందు రోజు సాయంత్రం స్టేజ్ పైన ప్రాక్టీస్ చెయ్యడం వల్ల స్టేజి ఎంత పొడవు ఉంటుంది, డ్రామాలో ఎలా నడవాలి, ఎక్కడ ఆగాలి అన్న విషయం ఒక అవగాహనకు వచ్చింది.
డ్రామాలో మరో ఇబ్బంది… మైక్ దగ్గరగా వెళ్లి డైలాగ్ చెప్పడం. మనకు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ డైలాగ్ చెప్పడం కుదరదు. మన మాటలు మైక్ అందుకోలేదంటే ఇక డ్రామాలో పట్టు పోతుంది.
అలాగే చెప్తున్న డైలాగ్ ను ఆపేసి మైక్ వద్దకు నడిచి వెళ్లి తిరిగి కంటిన్యూ చెయ్యడం అంటే అది మరీ కామెడీగా ఉంటుంది. రెండింటిని బాలన్స్ చేస్తూ చెప్పాలి.
ఫస్ట్ డ్రామా మైమ్ కావడంతో స్టేజి పైన తిరుగుతూ డైలాగ్ చెప్పవలసిన పని లేదు. రెండు చైర్స్ ఉంటే చాలు డ్రామా మొత్తం ఒక ప్లేస్ లోనే కవర్ చెయ్యొచ్చు.
రైలు ప్రయాణం డ్రామా మొదలెట్టాం. మా ప్రతి సన్నివేశానికి జనం విరగబడి నవ్వుతున్నారు. ఆ రియాక్షన్ నేను ఊహించిందే అయినా మా సర్ ఆ ఎంకరేజ్ మెంట్ తో ఇంకా రెచ్చిపోతున్నాడు. ఎక్కడ కంట్రోల్ తప్పుతాడో అన్న టెన్షన్ మొదలయ్యింది.
దేవుని దయవల్ల అంతా సవ్యంగా జరిగింది. డ్రామాలో లాస్ట్ లో మా సర్ ని కొట్టబోయే సీన్ ఉంది.
అది డ్రామా కావడంవల్ల పైగా బాగా ప్రాక్టీస్ చేసి ఉండడం వల్ల ఆ సీన్ టెన్షన్ లేకుండా చేశాను.
***
ఫస్ట్ డ్రామా అయిపోవడంతో మేకప్ అలానే ఉంచమని మా మెయిన్ డ్రామా సర్ చెప్పారు. చెమటతో మేకప్ చెదిరి ఒక నిరుద్యోగి ఎలా ఉండాలో అలానే తయారైంది నా ఫేస్.
మరో డ్రామాకు డ్రెస్ చేంజ్ చేసుకోవలసి రావడంతో స్టేజి కిందకు దిగాను. ఇంతలో ఒక సర్ నా వద్దకు వచ్చాడు.
“బాగా చేశావ్ సురేంద్రా” అన్నాడు
“థాంక్స్ సర్” అన్నాను
“అయినా మీ సర్ ని కొట్టడం ఏమిటి? ఇదేమన్నా బాగుందా?” అన్నాడు
ఒక్క నిముషం నాకు ఏమి అర్థం కాలేదు. నేను మా సర్ ను కొట్టడం ఏమిటి? కాసేపు ఆలోచించగా అప్పుడు అర్థం అయ్యింది. ఈయన డ్రామా లాస్ట్ సీన్ గురించి మాట్లాడుతున్నాడని..
ఏమి చెప్పలేక వెర్రిమొహం వేసుకుని నిలబడ్డాను..
“ఏదో సరదాగా అన్నాను. ఏమి పరవాలేదు” అని వెళ్ళిపోయాడు.
కాసేపు తరువాత మరో అనౌన్స్ మెంట్… మా మెయిన్ డ్రామా స్టార్ట్ కాబోతున్నట్టు ప్రకటన.
నేను హడావిడిగా డ్రెస్ చేంజ్ చేసుకుని స్టేజ్ పైకి ఎక్కాను. అప్పటికే మా మెయిన్ డ్రామా సర్ నన్ను ఉరిమి చూస్తున్నాడు.
డ్రామా ప్రారంభంలో ఇవన్నీ పట్టించుకుని కూర్చుంటే మా మెయిన్ డ్రామా దెబ్బ తింటుందని స్టేజి ఎక్కాను.
టీచర్ స్థానంలో ఉన్నవారు ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఈగోలతో కొట్లాడుతూ ఉంటే ఇక వాళ్ళు ఉత్తమ గురువులు ఎలా అవుతారో అర్థం కాలేదు.
ఏదేమైనా నా పని నేను చేయడం మంచిది అనుకుంటూ నా పార్ట్ స్టార్ట్ చేశాను.
జనం చివరివరకు ఉండడం వల్ల మాకు కూడా ఉత్సాహంగానే ఉంది.
డ్రామా నెమ్మదిగా సాగుతున్నా ఇంటరెస్టింగ్ గా ఉండడంతో జనం గోల చేయకుండా చూస్తున్నారు.
మొత్తానికి డ్రామా సక్సెస్ గా ముగిసింది. స్టేజి దిగగానే మిత్రుల కోలాహలం, క్లాస్ మేట్స్ షేక్ హాండ్స్ తో మా ఉత్సాహం రెట్టింపైంది.
మా ఇల్లు స్కూల్ దగ్గరలోనే ఉండడం, మా బ్రదర్ సిస్టర్స్ కూడా అదే స్కూల్ లో చదువుతూ ఉండడంతో మా కుటుంబసభ్యులు నా డ్రామాలు రెండు మిస్ కాకుండా చూశారు.
ప్రోగ్రాం ముగిసి రాత్రి 10 గంటలకు ఇల్లు చేరాం.
అప్పటికే అలిసిపోయి ఉండడంతో మా అమ్మమ్మ పెట్టిన గోరుముద్దలు తింటూ నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయాను.
ఉపసంహారం…
టెన్త్ క్లాస్ పరిక్షలు కావడంతో పొద్దున్నే ఆరు గంటలకు ట్యూషన్. పొద్దున్నే ఐదు గంటలకు నిద్రలేచి రెడీ అయ్యి బుక్స్ తీసుకుని ట్యూషన్ కి బయలుదేరాను.
ట్యూషన్ ఇంటి నుండి కిలోమీటర్ దూరం.
నేను నడుస్తూ వెళుతుంటే వెనుక నుండి “అన్నా” అని వినపడింది.
ఎవరై ఉంటారా అనుకుంటూ వెనక్కు తిరిగి చూశాను. ఎవరో స్టూడెంట్… చూస్తుంటే నా జూనియర్ లా ఉన్నాడు.
“నిన్న డ్రామాలో యాక్ట్ చేసింది నువ్వే కదా” అని అడిగాడు
మన పాపులారిటీ ఇంతగా పెరిగిపోతుంది అని అసలు ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు.
తరువాత ఏ ఫంక్షన్ జరిగినా డ్రామా కోసం మమ్మల్నే పిలిచేవారు. ఈ ట్రెండ్ ఇంటర్మీడియట్ డిగ్రీలలో కూడా కంటిన్యూ అయ్యింది…
(వచ్చే వారం మరో జ్ఞాపకం)

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY