రోజూ ఆఫీసుకి ‘కంపెనీగా’ వస్తాను రోజు ఫుడ్డుతోపాటు పాకెట్ మనీకి ఓ వంద కొడితే చాలు…వండర్ ఫుల్ రైటర్ తేజారాణి తిరునగరి సీరియల్ శ్రీ &శ్రీమతి (14-05 -2017)

6

“ఏంటీ… మొత్తానికి సాధించినట్టున్నావే…”చరణ్ ప్యాంటు వైపు చూస్తూ అంది చందన .
“ఆ …చావు తప్పి ఐ లొట్టపోయింది ”
“ఐ లొట్టపోవడమేమిటి?
“అదే కన్ను లొట్టపోయి…”పూర్తి చేసాడు చరణ్
“ఇప్పుడేంచేద్దామని ?చందన నడుస్తూ అడిగింది .
“నీతోపాటు రోజూ ఆఫీసుకి ‘కంపెనీగా’ వస్తాను రోజు ఫుడ్డుతోపాటు పాకెట్ మనీకి ఓ వంద కొడితే చాలు” అన్నాడు చరణ్ చందనతో
“నన్ను పెళ్లాడు నాజీతం మొత్తం నీకే ఇచ్చేస్తా’ అంది చరణ్నిఉడికిస్తూ
“అబ్బా… ఆఒక్కటీ తప్ప ఏమైనా అడుగవోయి…”అన్నట్టు మనం రోజు ఇలా ఆఫీసుకు నడుచుకుంటూ రావడం ఏమీ బాగాలేదు “నాకైతే ఇలాగే థ్రిల్ గా ఉంటుంది .దీనివల్ల రెండు లాభాలు వున్నాయి,ఒకటి బస్సు చార్జీలు కనీసం నెలకు వంద రూపాయలైనా అవుతాయి .అవి మనకు మిగిలితే ఆడబ్బులలో సగం అంటే యాభై రూపాయలైనా మనం ఖర్చు పెట్టుకోవచ్చు .మిగితా సగం మాచంటిగాడి పేరుమీద బ్యాంకు లో వేయొచ్చు .ఎందుకంటే రేపు మన పెళ్లి అయితే చంటిగాడిని ఎవరు చూస్తారు? అలా అన్నప్పుడు చందన కళ్ళలో కన్నీళ్లు తళ్ళుక్కున మెరిసాయి.
“ఛ…ఛ అవేం మాటలు చందు…నువ్వు నాభార్యవు అయినప్పుడు నీ తమ్ముడు నాకు పరాయి వ్యక్తి ఇలా అవుతాడు…అయినా మీ పిన్ని మంచిదేగా ” అన్నాడు చరణ్
‘సవతి తల్లి ప్రేమ మీద నాకు నమ్మకం లేదు .చాలా మంది సవతి తల్లులను చూసాను ,ఈ రోజు నేను సంపాదిస్తున్నాను కాబట్టి నాముందు బాగానే చూడొచ్చు ,నేను ఆఫీస్ కి వెళ్ళాక మా చంటిగాడిని ఎలా చూస్తుందో?”
అందుకే అప్పుడప్పుడు సడన్ గా ఆఫీస్ కు సెలవు పెట్టి వెళ్తాను.స్థిరమైన అభిప్రాయంతో అంది చందన .
” అందరు సవతి తల్లులు అలాగే వుంటారా?నువ్వనవసరంగా ఆమెని అనుమానిస్తున్నావేమో …అన్నాడు చరణ్ .
రెండు మూడు సార్లు చందన ఇంటికి వెళ్ళాడు చాలా చక్కగా మాట్లాడింది
“నీకేం తెలియదు చరణ్ అంది” చందన .
దారిలో ఆ టాపిక్ ఆగిపోయింది .
చందన ఆఫీస్ వచ్చేసింది
“బై చరణ్…సాయంత్రం సరదాగా అలా నడుచుకుంటూ ఊరంతా ఓ ట్రిప్పేద్దా మా?”వెళుతూ అడిగంది చందన
“నీకిదేం సరదా …పైగా సరదాగా నడుద్దామా?”ఏడుపు గొంతుతో అన్నాడు చరణ్
అలా మాట్లాడుకుంటూ వెళ్తే థ్రిల్ గా ఉంటుంది ,మళ్ళీ ఇలాంటి అవకాశం మనకు రావొద్దు అంది .
“ఓ కే ఈవినింగ్ కలుద్దాం.ఈ లోగా ఓ రెండు రూపాయలు నా ముఖాన కొడితే మధ్యాన్నం బ్రెడ్డు తిని నీళ్లు తాగుతాను,
“అదేం కుదురదు ,మధ్యాహ్నం ఆఫీస్ కి వచ్చేయ్,కలిసే లంచ్ చేద్దాం అంది ఆఫీస్ లోకి వెళ్తూ .
“ఏంటీ …ఎన్నా విశేషం …చరణ్ ని చూస్తూనే అడిగాడు నటేశన్ ,
ఇదిగోండి మీరిచ్చిన వాషింగ్ కేకులు , పౌడర్లు…ఇందులోనుండి ఓ కస్టమర్ కు ఓ సోప్ వాడాడు.. చీరె పాకిస్థాన్ మ్యాప్ షేప్లో వచ్చింది నా బాడీ ఈ షేప్ మారే ప్రమాదం తిప్పింది, ఆ సబ్బు బిళ్ళ డబ్బులు నాదగ్గర లేవు ఎప్పుడైనా వున్నప్పుడు తెచ్చిస్తాను ,
మీకు మీ సేల్స్ మెన్ జాబ్ కి సీతా… …సీతా…అన్నాడు వెనక్కి తెరిగి.
“అదేమిటి సీతా,సీతా అంటున్నావు?” నటేశన్ ఆశ్యర్యంగా అడిగాడు
“మరేం లేదు అందరు రామ్ రామ్ అంటారుగా ,కాస్తా వెరైటీగా ఉంటుందని… వాడాను ”
“ఇంతకీ ఈ జాబ్ చేయనంటావు?”
“చేయననను …కానీ బట్టతలకి , మోకాలికి ముడిపెట్టినట్టు, ఇంత బిజినెస్ చేస్తే ఇంత కమీషన్ అంటే నాకు వద్దు… నా వల్ల కాదు’
“సరే నెలకు వెయ్యి రూపాయల జీతం ఇస్తాను, సేల్స్ తో సంబంధం లేదు చేస్తావా? నటశేన్ అడిగాడు .
“నిజ్జమా?”వత్తిపలికి అడిగాడు
నిజ్జం వత్తి పలికి చెప్పాడు నటశేన్
“నాకీ జాబ్ ఎందుకిస్తున్నట్టు?”
(ఎందుకిస్తున్నట్టో తెలుసుకోవాలంటే వచ్చేవారం వరకూ వెయిట్ చేయాలి)

తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY