ఇంట్లో ఈ విషయం చెప్పి బట్టలు సర్ధుకుని రెడీ అయ్యాను…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (14-05-2017)

(గత సంచిక తరువాయి)
షుగర్ ఫ్యాక్టరీ – ఓ స్వీట్ ఫ్రెండ్
నేను సెవెంత్ క్లాస్ చదివే రోజుల్లో చక్రపాణి పేరుతో ఓ ఫ్రెండ్ ఉండేవాడు. అతడు రోజు తిరుపతి దగ్గరలో ఉన్న గాజులమండ్యo నుండి స్కూల్ కి వచ్చేవాడు. వాళ్ళ ఫాదర్ అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో పెద్ద పొజిషన్ లో ఉండేవారు.
స్కూల్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయ్యాక అతను నాతో సరదాగా
“సురేంద్రా… మా ఇంటికి రా. అక్కడ చాలా బాగుంటుంది. నీకు షుగర్ ఫ్యాక్టరీ చూపిస్తా. మనం అక్కడ చాలా గేమ్స్ ఆడుకోవచ్చు” అంటూ పిలిచాడు
కొత్త ప్లేస్ లు తిరగడం, కొత్త వాతావరణం, కొత్త వ్యక్తుల కలయిక అంటే నేను ఎప్పుడూ ముందే ఉంటాను.
ఇంట్లో ఈ విషయం చెప్పి బట్టలు సర్ధుకుని రెడీ అయ్యాను. చక్రపాణి వాళ్ళ సిస్టర్ కూడా మా స్కూల్ లోనే చదివేది. తను మాకన్నా రెండు సంవత్సరాలు జూనియర్.
గాజులమండ్యo షుగర్ ఫ్యాక్టరీ నుండి ప్రతిరోజూ కంపెనీ వ్యాన్ స్కూల్ కి వచ్చేది. అందులోనే గాజులమండ్యo షుగర్ ఫ్యాక్టరీలో పని చేసే వాళ్ళ పిల్లలు తిరుపతి వచ్చి చదువుకునేవారు.
సాయంత్రం స్కూల్ అయ్యాక మేము క్రికెట్ ఆడడంలో బిజీ అయిపోయాం. ఇంతలోనే మా ఫ్రండ్ వ్యాన్ రెడీ అంటూ వచ్చాడు.
వ్యాన్ లో మనకు ప్లేస్ ఉంటుందో ఉండదో అన్న సందేహంలో ఉంటే చక్రపాణి మాత్రం మరేం పరవాలేదు ఎలానో అడ్జస్ట్ చేసుకుందాం అన్న రీతిలో చూశాడు. అప్పటికే డ్రామాలో పార్టిసిపేట్ చేయడం వల్ల మన పేరు స్కూల్ మొత్తం తెలిసిపోయింది. నాకు తెలియని వారు కూడా తెలిసినట్టు పలకరించడం కామన్ అయ్యింది.
నేను వ్యాన్ ఎక్కగానే అక్కడ ఉన్న వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా క్లాస్ వాళ్ళు ఎవరూ లేరు నేను, చక్రపాణి తప్ప. మిగిలిన వాళ్ళందరూ మా జూనియర్స్. అయినా ఎంతో ఆదరంగా నన్ను వ్యాన్ లోకి పిలిచి తమ ప్రక్కన్నే కూర్చోమంటూ ప్లేస్ ఇచ్చారు.
నా ట్రిప్ లో టెన్షన్ పడవలసిన పని లేదని సంతోషించాను. వ్యాన్ బయలుదేరింది.
జూనియర్స్ మొత్తం నా చుట్టుముట్టారు. డ్రామాలో నేను చెప్పిన డైలాగ్స్ చెప్పమని ఒక్కటే గోల.
అప్పటికే నేను మిమిక్రీ ప్రాక్టీస్ చేశాను. ఆ వివరాలలోకి వెళితే
ఒకరోజు మా ఫాదర్ “శ్రీదేవి పెళ్లి” అన్న ఒక మిమిక్రి ఆడియో కేసెట్ తెచ్చారు. అందులో రావుగోపాలరావు, ప్రభాకర్ రెడ్డి, నూతన్ ప్రసాద్ గారి వాయిస్ విని ఒక్కసారి స్టన్ అయ్యాను.
ఇతరుల వాయిస్ ను ఇంత చక్కగా ఇమిటేట్ చెయ్యొచ్చు అన్న విషయం నాకు అర్థం అయ్యింది.
ఇక ఆ కేసెట్ వింటూ అందులో వచ్చే డైలాగ్స్ ను ఎంజాయ్ చేస్తూ ఉండడం అలవాటుగా మారింది. ఆ క్రమంలో నేను కూడా ఒకటీ రెండూ డైలాగ్స్ అదే రీతిలో చెప్పడానికి ట్రై చేస్తే వచ్చినట్టే అనిపించింది. ఇంట్లో వాళ్ళ ముందు చేసి చూపిస్తే బాగుంది అని మెచ్చుకున్నారు. దానితో నా కాన్ఫిడెన్స్ లెవెల్ కోతలు దాటింది.
స్కూల్ లో ఫ్రండ్స్ ముందు సరదాగా ఆ డైలాగ్స్ చెప్తే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేవారు. దానితో ఆ కేసెట్ లో అన్ని డైలాగ్స్ దాదాపు నోటికి వచ్చేసింది.
గాజులమండ్యo షుగర్ ఫ్యాక్టరీ వెళ్ళే వ్యాన్ లో మా జూనియర్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి డ్రామా డైలాగ్స్ తో పాటు మిమిక్రీ కూడా చేయడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ సమయంలో నేనేదో పెద్ద సెలెబ్రిటి లా జూనియర్స్ నా ప్రక్కన కూర్చోవడానికి పోటీ పడడంతో నాకు ఆశ్చర్యం వేసింది. పబ్లిక్ లో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారి లైఫ్ ఎలా ఉంటుందో అనుకున్నా…
ఆ ఆదరణ, ఆ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఒక మత్తు లాంటివి. ఒక్కసారి మనిషిని ఆవహిస్తే మరి వదలవు. మనిషి కూడా ఆ లోకంలోనే జీవిస్తూ, ఇలానే జీవించాలని తలపోస్తూ ఉంటాడేమో అనిపించింది.
ఇలా ఆలోచిస్తుండగా చక్రపాణి నన్ను కదపడంతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను.
వ్యాన్ గాజులమండ్యం చేరింది.

(వచ్చే వారం మరో జ్ఞాపకం)

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY