తనకు ఫుడ్ పెట్టిన కంపెనీ,వ్యాపారం సాగితే అతి తక్కువ కాలం లో మూతపడడం గ్యారెంటీ .అవసరం ఐతే రేయింబవళ్లు కష్టపడాలని నిర్ణయానికి వచ్చాడు .ఆ నిర్ణయమే అతని జీవితం లో తుఫాను చెలరేపుతుందని ఆ క్షణం చరణ్ కి తెలియదు.
ఆ రోజు నటేశన్ చరణ్ ని తన ఛాంబర్ కి పిలిచాడు.
ఆ ఛాంబర్ లో ఇద్దరే వున్నారు.
“చరణ్…చాలా కొద్దికాలం లో నువ్వు నాకు ఆప్తుడి వయ్యావు.అందుకే నామనసు విప్పి ,నా మనసు లోని మాట నీతో చెప్పుకుంటున్నాను.వ్యాపారం పూర్తిగా నష్టాల్లో కూడుకు పోయింది.మన స్టాఫ్ లో సిన్సియారిటీ లేదు.
ఇప్పుడిస్తున్న జీతాలే నేను భరించలేక పోతున్నా. దానికి తోడు జీతాలు పెంచమంటున్నారు
ఈ కంపెనీ బాధ్యత నీమీదే పెడుతున్నాను. నీకు నా కంపెనీలో వాటా కావాలా?
తీసుకో …కానీ ఆ కంపెనీ మూత పడకుండా చూసే బాధ్యత నీదే .
నటేశన్ చాలా దిగులుగా వున్నాడు.అతని లో ఫిజికల్ గా కూడా మార్పు వచ్చింది.
“సార్ …ఈ కంపెనీ లాభాలు పెంచే పూచీ నాది .నేను పెద్ద జీనియస్ ని కాకపోవచ్చు.వ్యాపారం లో సిన్సియారిటీ, చిత్త శుద్ధి ఉంటే చాలు.నేను మనస్పూర్తి గాచెబుతున్నాను. ఈ రోజునుండి ఇరవైనాలుగు గంటలు పనిచేస్తాను”స్థిరంగా, దృడంగా చెప్పాడు చరణ్ .
అయినా నటేశన్ లో దిగులు
“రోజుకు ఇరవై నాలుగు గంటలు పని చేసైనా మన కంపెనీకి లాభాలు వచ్చేలా చూస్తాను.అన్నం పెట్టె కంపెనీని మూతపడనివ్వను”చరణ్ మాట్లాడుతుంటే కృతజ్ఞతతో నటేశన్ కళ్ళు చెమ్మగిల్లాయి.
***
హుషారుగా ఈల వేస్తూ ఈలపాటి రఘురామయ్యలా బిల్డప్ ఇస్తూ లోపలి అడుగుపెట్టిన తిక్కేశ్వర్రావ్ కు లోపలెవరూ కనియించలేదు.ముందు పరియపురుషుడు కనిపిస్తాడేమోనని తన వెధవ బుద్ధితో వెతికాడు తుప్పట్టిన గన్ పట్టుకుని …బట్ నో యూజ్..అతనిలో బీపీ అమాంతం పెరిగింది.తన స్త్రీ కూడా కనిపించకపోయేసరికి భయం ఉత్తరకొరియాలా మారింది.అప్పుడే అతనికి భూతంలా ఓ ఉత్తరం కనిపించింది.
“మహామహరాజశ్రీ అనుమానపు మొగుడి గారికి ..మీ అనుమానాన్ని భరించలేక మీ అనుమానాన్ని నిజం చేస్తూ లేచిపోతున్నాను..వుంటాను .ఇట్లు ఒకప్పటి మీ మాజీ భార్య…
ఆ ఉత్తరాన్ని చూసి షాకయ్యాడు…అతని బాడీ లో వణుకు మొదలైంది.భార్యను అనుమానిస్తే ఫ్యూచర్ ఎంత వరెస్ట్ గా ఉంటుందో..అర్థమవుతుంది.
***
ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు.లేచి ఫ్రెషప్ అయ్యాడు.చందన వంక చూసాడు.హాయిగా నిద్రపోతుంది.ఆమెను డిస్ట్రబ్ చేయాలనుకోలేదు.కిందికి వంగి ఆమె నుదురుమీద ముద్దుపెట్టుకుని నిశ్శబ్దంగా బయటకు నడిచాడు.
బిజినెస్ లో అనుభవం వున్న ఓ మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు.తమ కంపెనీ సబ్బులను డిపాజిట్ లేకుండా అతనికి ఇచ్చేట్టు..అతను ఏ రోజు డబ్బులు ఆ రోజే ఇచ్చేట్టు..
***
మిగితా వచ్చేవారం
తేజారాణి తిరునగరి రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/ksearch.php?searchfor=tejarani
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. చీఫ్ ఎడిటర్