కింద నుండి చూస్తే ఏమాత్రం అర్థం కాని డిజైన్, కొండ పైనుండి చూస్తుంటే శిధిలావస్థలో ఉన్న పార్క్… స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (18-06-2017)

కొండ ఎక్కడం స్టార్ట్ చేశాం. బండలు వేడి సెగలు వెదజల్లుతున్నాయి.
వేడికి కళ్ళు మండుతున్నాయి. దాహంతో నోరు ఎండిపోవడం ప్రారంభం అయ్యింది. లంచ్ టైంలో ఇచ్చిన వాటర్ పాకెట్స్ ఎప్పుడో ఖాళీ అయ్యాయి. క్లాస్ లో ఇంట్రెస్ట్ ఉన్న నాలాంటి కొంతమంది మాత్రమే కొండ ఎక్కడం వల్ల చాలా మంది కిందనే నిలిచిపోయారు. కాసేపు రెస్ట్ తీసుకుని ఎక్కుదామని అక్కడకు దగ్గరలో ఉన్న చెట్టు నీడలో నిలబడ్డాం.
అక్కడ నుండి క్రిందకు చూస్తే రాజ్ మహల్, రాణి మహల్ చక్కగా కనపడుతున్నాయి. దగ్గరలో కోనేరు. మంచి ప్లానింగ్ తో కట్టినట్టు కనపడుతోంది.
కింద నుండి చూస్తే ఏమాత్రం అర్థం కాని డిజైన్, కొండ పైనుండి చూస్తుంటే శిధిలావస్థలో ఉన్న పార్క్, కనపడి కనపడక ఉన్న అలనాటి వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపే ఫౌంటైన్స్ కనువిందు చేస్తున్నాయి.
అలా ఎంత సేపు నిలుచున్నామో తెలియదుగానీ మా సర్ టైం అవుతోందని హెచ్చరించడంతో ఊహాలోకం నుండి వాస్తవంలో పడి తిరిగి ఎక్కడం స్టార్ట్ చేశాం.
ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఎండ భయంకరంగా అనిపించిది. నీరసంతో కాళ్ళు లాగుతున్నాయి. అక్కడ నుండి చూస్తే అసలు మేం సగం కొండ కూడా ఎక్కినట్టు అనిపించలేదు. మాలో కొంతమంది వెనక్కు తిరిగిపోవడమే బెస్ట్ అంటూ అక్కడే కూలబడ్డారు.
కొంతమంది ముందుకే పోవడానికి ఉత్సాహం చూపారు. నా పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు. నడవలేని సిట్యువేషన్. అంత దూరం వెళ్లి తిరిగి రావడం అంటే మాటలు కాదు. పైగా కొండ మీద జన సంచారం ఏమీ ఉండదు. తినడానికి కాకపోయినా కనీసం తాగడానికి కూడా ఏమీ దొరకదు. నేను కూడా రిటర్న్ జర్నీ బెస్ట్ అని డిసైడ్ అయ్యాను. మా సర్ మమ్మల్ని జాగ్రత్తగా కిందకు వెళ్ళమని చెప్పి మిగిలిన స్టూడెంట్స్ తో కొండ ఎక్కడం ప్రారంభించాడు.
మేం కాసేపు రెస్ట్ తీసుకుందామని అక్కడే ఆగిపోయాం. ఎండ ఎక్కువగా ఉన్నా ప్రకృతి పచ్చదనం ఎంతో ముచ్చటగా ఉంది. సూర్యుడు నెమ్మదిగా పడమరవైపుకు సాగుతున్నాడు.
ఇంతలో…
ఎక్కడినుండో ఒక్క అరుపు….
ఆ సౌండ్ కి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం. ఎవరో భయంతో ఏడుస్తున్నట్టు పెద్దగా కేకలు…
మాకు భయం వేసింది. ఏ పిశాచమో లేక దయ్యమో అక్కడ ఉండి అరుస్తుందేమో…
అసలే పాడుబడ్డ కోట. జనసంచారం లేని ప్రదేశాలు..
చిన్నప్పుడు చదువుకున్న దయ్యాల కధలు గుర్తుకువచ్చి ఒక్కసారి గుండె దడదడలాడింది.
నాకు మాత్రమే ఆ కేక వినిపించిండా లేక మా ఫ్రండ్స్ కూడానా అనుకుంటూ వారి వైపు చూశాను. వాళ్ళ కళ్ళల్లో కూడా ఆశ్చర్యంతో కూడిన భయం కనిపించింది.
హమ్మయ్య… మనం ఒంటరి కాదు. మనకు తోడుగా కొంతమంది ఉన్నారు అనుకున్నా… ఇంతలో మరోసారి అదే గొంతు వినిపించింది. ఎవరిదో ఆడ గొంతులా ఉంది. మేం మా భయాన్ని వదిలిపెట్టి ఆ గొంతు వినపడ్డ వైపుకు వేగంగా కదిలాం.
ఒక స్పాట్ కి వచ్చాక షాక్ తో ఒక్కసారిగా ఆగిపోయాం. అక్కడనుండి కొండ ఏటవాలుగా నున్నగా ఉంది. ఆ కొండ అలా వెళ్లి కోనేరులో ఎండ్ అవుతోంది. అదో పెద్ద బండలా ఉంది…
అక్కడ కూర్చుని ఉంది ఒక అమ్మాయి… వైట్ డ్రెస్… ఏడుస్తోంది…
మా పరిస్థితి చెప్పలేని స్థితి. భయంతో ఒక్కసారిగా నేలకు అంటుకుపోయాం…
ఇది ఖచ్చితంగా దయ్యమే… నో డౌట్… దయ్యాలు మాత్రమే వైట్ డ్రెస్ వేస్తాయి..
కాని సినిమాలో చూపించినట్టు చీరలో లేదు. యూనిఫాంలో ఉంది. పిల్ల దయ్యం ఏమో…
వామ్మో… ఇంకేముంది… మా పని అయిపోయినట్టే…
భయంతో చెమటలు పట్టేసాయి
***

(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY