నా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అక్కడ ఉన్నవారిలో నేనే సీనియర్ అయినా…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (02-07-2017)

(గతసంచిక తరువాయి)

బాలవికాసం
నేను ఎయిత్ స్టాండర్డ్ చదివే రోజులు.
ఒక ఆదివారం..
మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు (నా కన్నా జూనియర్స్) బుక్స్ తీసుకుని ఎక్కడికో బయలుదేరుతున్నారు
నాకు ఆడడానికి ఎవరూ లేక తెగ బోర్ కొట్టేస్తోంది.
విషయం ఏమని కనుక్కుంటే అర్థం అయ్యింది ఏమంటే … అందరూ బాలవికాస్ కు వెళుతున్నారు.
“బాల వికాస్” మొట్టమొదటిసారి వినడం. అసలు బాలవికాస్ అంటే ఏమిటో వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు.
నేను కూడా వారితో వస్తానని ఇంట్లో చెప్పి బయలుదేరాను. వాళ్ళు లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే బోర్ కొట్టడం కన్నా అలా వెళ్లి అసలు అది ఏమిటో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ పెరిగిపోయింది.
భవాని నగర్ లో ఒక ఇంట్లో బాలవికాస్ జరుగుతుంది అని తెలియడంతో మా జూనియర్స్ తో నేను కూడా కదిలాను.
ఆదివారం మధ్యాహ్నం… భోజనాలు చేసి అందరూ చక్కగా రెస్ట్ తీసుకుంటున్నారు. రోడ్స్ మనుషులు లేక బోసిపోతున్నాయి.
పది నిముషాల నడకలో ఆ ఇల్లు చేరాం.
ఇల్లు చాలా పెద్దది. ఇంటి ముందు భాగంలో ఒక పెద్ద రూమ్ ఉంది.
అక్కడ ఉన్న చైర్స్ లో కూర్చున్నాం. పది నిముషాల తరువాత ఒక అంటి వచ్చారు.
“సాయిరాం ఆంటీ” అంటూ మా జూనియర్స్ విష్ చేశారు.
నా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అక్కడ ఉన్నవారిలో నేనే సీనియర్ అయినా ఆంటీ నాకు తెలియకపోవడంతో ఏమి మాట్లాడకుండా కూర్చున్నాను.
మా జూనియర్స్ నన్ను వాళ్ళ అన్నగా పరిచయం చేశారు.
నన్ను వాళ్ళతోనే ఉండమని చెప్పి ఆంటీ ప్రార్థన స్టార్ట్ చేశారు
సహనాభవతు సహనౌభునక్తు… అంటూ మొదలెట్టేసరికి మా జూనియర్స్ కూడా రిపీట్ చెయ్యడం మొదలైంది.
మనకు తెలిసినవే కావడంతో కొంచం బోర్ గా ఫీల్ అయ్యాను. ఇక తప్పాడు అన్నట్టు నేను కూడా గొంతు కలిపాను.
సత్య సాయిబాబా పేరుతో నడిచే గ్రూప్ అని అర్థం అయ్యింది. నాకు బాబాలపై నమ్మకం లేదు.
అందరూ కళ్ళు మూసుకుని సీరియస్ గా ప్రార్థన చేస్తున్నారు.
నేను కళ్ళు తెరిచి ఎవేరెవరు ఏమి చేస్తున్నారో చూద్దామని చుట్టూ చూశాను. అందరూ బిజీగా ప్రేయర్ లో ఉన్నారు. నేను ఆ రూమ్ ని ఒక్కసారి కలయజూసాను.
సత్య సాయి బాబా నిలువెత్తు ఫోటో. అందులో మెత్తటి వెల్వెట్ కవర్ చేసిన సింహాసనం పై సాయి బాబా ఆశీర్వాదం చేస్తూ కూర్చున్న ఫోటో.
పక్కన్నే మరో ఫోటో సర్వమత చిహ్నాలతో ధర్మచక్రంలా ఉంది.
సాయబాబా మహత్యం తెలియజేసే బుక్స్.
ఇంతలో ప్రేయర్ అయ్యింది.
ఆంటీ సాయిబాబా గురించి ఏదో చెబుతుంటే మా జూనియర్స్ సీరియస్ గా రాసుకుంటున్నారు.
ఇంతలో తినడానికి ఎదో వచ్చింది. అప్పటివరకు బోర్ గా ఫీల్ అవుతున్న నాలో చలనం వచ్చింది.

(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY