(గత సంచిక తరువాయి)
వారం గడిచింది..
డైలాగ్స్ మొత్తం కంట్రోల్ లోకి వచ్చాయి..
ఇక స్టేజ్ పైన యాక్షన్ చెయ్యడం నేర్చుకోవాలి…
మోనో యాక్షన్ – ఏకపాత్రాభినయం.. స్టేజ్ మొత్తంలో ఒక్కడే ఉంటాడు.
జనాలకు బోర్ కొట్టించకుండా టైంను కుదించకుండా నేర్పుగా ఓర్పుగా సీన్ రక్తి కట్టించాలి
అది ఒకరకంగా కత్తి మీద సామే… అప్పటికే ఆంటీ నాపైన పెట్టిన, పెట్టబోయే ఖర్చును తలచుకుంటే ఒక డ్రామా కోసం నన్ను నమ్మి ఇంత చేస్తున్న ఆంటీ పేరు నిలబెట్టాలి అన్న ఫీలింగ్ కలగంగానే ఇక ఆలస్యం చేయదలచుకోలేదు.
నాకు తెలిసిన టీచర్స్ లో మనకు ఏక పాత్రాభినయం ఎలా చేయాలో చెప్పగలవారు ముగ్గురు మాత్రమే.
వారిలో ఇద్దరు నాతో డ్రామాలో యాక్ట్ చేశారు. నాకు క్లోజ్ గా ఉన్న మొదటి సర్ ని కలిశాను. నేను చెప్పింది అంతా విని రాబోయే శనివారం కలవమని చెప్పాడు.
నా సంతోషానికి పగ్గాలు లేకుండా పోయాయి. ఇక యాక్షన్ వచ్చేస్తే నేను ధైర్యంగా ఆంటీకి నా ప్రతాపం చూపోచ్చు అన్న ఫీల్ రావడంతో శనివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడ్డం స్టార్ట్ చేశాను
అది రెండవ శనివారం కావడంతో మా స్కూల్ హాలిడే.
ప్రొద్దున్నే టిఫిన్ తిని మా సర్ ఉంటున్న రూమ్ కి వెళ్లాను. అప్పుడే తను కూడా టిఫిన్ తిని రెడీ అవుతున్నారు.
పది నిముషాలలో రెడీ అయ్యి నన్ను మేడ పైకి తీసుకు వెళ్ళాడు. మేడ మీద ఎండ లేని చోట సెటిల్ అయ్యాం.
నా చేతిలోని డైలాగ్ పేపర్ తీసుకుని చదవడంలో మునిగిపోయాడు. మొత్తానికి తెలుగు సర్ కావడం వల్ల దీర్ఘ సమాసాలు ఉన్న డైలాగ్స్ చదవడం సర్ కి ఇబ్బంది కాలేదు.
మరో పది నిముషాలు భారంగా గడిచాయి. సర్ ఆ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు నేను ఆయన ఫీలింగ్స్ గమనించడం స్టార్ట్ చేశాను.
కొన్ని సందర్భాలలో మొహం గంభీరంగా పెట్టారు. బహుశా డైలాగ్స్ అర్థం చేసుకునే మూడ్ లో ఉన్నారేమో అనుకున్నాను.
స్క్రిప్ట్ చదవడం పూర్తి అయ్యాక పేపర్ నా చేతికి ఇచ్చి లేచి నిలబడ్డారు.
“మొదటి డైలాగ్ చదువు” అంటూ యాక్షన్ చేయడానికి రెడీ అయ్యారు.
“కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తర భ్రమ…” అంటూ స్టార్ట్ చేశాను
దేవదాసులో నాగేశ్వరరావు గారిలా ఊగుతూ నేను చెప్పిన డైలాగ్ కి యాక్షన్ చేయడం మొదలుపెట్టారు. ఆ యాక్షన్ లో ఆయన తలపు ఉన్న పొడవాటి వెంట్రుకలు గమ్మత్తుగా ఊగడం చూసి నేను నవ్వు ఆపుకోలేకపోయాను.
ఆయన అది గమనించకుండా డైలాగ్ ప్రకారం ఊగుతూ తూగుతూ దైల్గాగ్ చెబుతూ యాక్షన్ చేయడం స్టార్ట్ చేసేసరికి ఇక నవ్వు ఆపుకోవడం నా వల్ల కాలేదు.
(వచ్చే వారం మరో జ్ఞాపకం)
(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్