మనకోసం మన అవసరాల కోసం సరుష్టించుకున్న డబ్బు కాగితాల్లో రంగురంగుల్లోకి మారి కరెన్సీ పేరుతో మనిషిని “మనీ” షి గా మార్చి మనిషినే శాసించే స్థాయిలో ఉంది
“పైసా పైసా నువ్వేం చేస్తామంటే ..అవసరమైతే పైశాచికంగా కూడా మారుతా ..అన్నదమ్ముల మధ్య ఆడపడుచుల మధ్య ఆ మాటకొస్తే మానవ సంబంధాల మధ్య చిచ్చు పెడతాను”అందిట
నిత్యదైనందిన జీవితంలో ఉదయం లేచింది మొదలు తిరిగి రాత్రి నిద్రపోయేవరకూ ఒకటే లక్ష్యంగా మన ఆలోచనలు పరిభ్రమిస్తూ ఉంటాయి..
అదే “డబ్బు”
అనుబంధాలు ఆత్మీయతలు ఆప్యాయతలు వీటన్నిటికీ తిలోదకాలిచ్చిన మనిషి డబ్బే సర్వస్వంగా అది సంపాదించడమే అంతిమలక్ష్యంగా సాగుతున్నాడు
డాలర్ రూబుల్ దీనార్ రూపాయి ఇలా డబ్బుకు ఎన్ని పేర్లు వున్నా అది చూపించే ఇలువలో తేడాలున్నాయి డబ్బు డబ్బే..కొందరికి డబ్బు జబ్బే.
ఒక్కకలం పోటుతో ఒక్క నోట్ల రద్దుతో కోట్ల విలువైన డబ్బు గుర్తింపును కోల్పోయింది.
దేశం మారితే చలామణిలో ఉండని కరెన్సీ ..
రంగు తప్ప ప్రాణం లేని కరెన్సీ ప్రాణమున్న మనల్ని ప్రాణాలు తీసే స్థాయికి దిగజారుస్తుంది.మేన్ ఈటర్స్”(నరమాంస భక్షకుల) కన్నా మనీ ఈటర్స్ ప్రమాదకరమైన వాళ్ళు .కరెన్సీ వాసనా వస్తే శవాల మీద వాలిపోయే రాబందుల్లా వాలిపోతారు.
కిడ్నప్స్ హత్యలు సుపారీలు డబ్బు కోసం కదా
అధికారుల్లో అవినీతికి కారణం డబ్బు మీద వున్న వ్యామోహం
రాజకీయనాయకుల పదవీకాంక్షల వెనుక ధనకాంక్ష
కోట్లకొద్దీ డబ్బు హవాలా రూపంలో..
కోట్ల కొద్దీ డబ్బు స్విస్ బ్యాంకు అకౌంట్స్ లో…
కోట్లకొద్దీ స్వార్థం …కోట్లకొద్దీ అవినీతి అవకాశవాదం
తోడబుట్టినవాడిలో స్వార్థం
కట్టుకున్నవాడిలో పైశాచికం
అన్నదమ్ముల మధ్య వైరం…
ఓన్లీ ఫర్ ది సేక్ అఫ్ బ్లడీ కలర్ పేపర్స్ …
ఒక్కసారి డబ్బును వదిలి నీ అనుకున్న వాళ్ళను ప్రేమించు చూడు,,నీ ప్రేమను పంచి చూడు…నీ దగ్గరున్న డబ్బుతో నిస్సహాయులకు చేయూతనిచ్చి చూడు…వాళ్ళ కళ్ళలో కనిపించే వెలుగు చూసి ఆ డబ్బు కూడా “నా జీవితం ధన్యమైంది ” అనుకుంటుంది.
ఎందుకంటే డబ్బు కు మెదడు లేదు..మనకు వుంది.మనమే డబ్బును విలన్ ని చేస్తున్నాం.
డబ్బు కన్నా ఏదీ ఎక్కువ కాదనుకుని,మనల్ని కావాలనుకునే వాళ్ళను దూరం చేసుకునే డబ్బు మనుష్యుల మీద ద్వేషంతో …రచయిత్రి
గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.
గుప్పెడంత ఆకాశం లింక్
http://kinige.com/book/Guppedanta+Akasam
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్