తిరుపతిలో కొత్తవీధికి అన్న బండి వెళ్ళింది.
ఆ ఏరియా నాకు తెలియనిది కాదు. పైగా మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చాడో అనుకుంటూ బండి దిగాను.
ఎదురుగా చిన్న బిల్డింగ్.
ప్రదీపన్న బిల్డింగ్ పక్కనే ఉన్న మెట్ల ద్వారా ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకువెళ్ళాడు.
నేమ్ బోర్డ్ పై ఏదో రాసుంది. నాకు చదివినా అర్థం కాలేదు.
డోర్ బెల్ కొట్టగానే కాసేపటి తరువాత ఒక ముసలాయన వచ్చి తలుపు తీశాడు.
మమ్మల్ని చూసి లోనికి రమ్మని చెప్పాడు. మేం వస్తామని ఆల్రెడీ తెలిసినట్టు ఉంది అతని వాలకం. నేను అన్న వైపు చూశాను.
అన్న ఏమీ మాట్లాడకుండా నన్ను లోపలి తీసుకు వెళ్ళాడు.
నేను లోపలి అడుగుపెట్టగానే ఒక్కసారి ఆశ్చర్యపోయాను.
లోపల కొన్ని బొమ్మలకు విగ్గులు తగిలించి ఉన్నాయి. మరో పక్క వైరు వేలాడదీసి ఉంది. దానిపై డ్రామాకు సంబంధించి చాలా కలర్స్ లో బట్టలు వేసి ఉన్నాయి.
మరోవైపు మీసాలు కనుబొమ్మలు ఉన్న షోకేస్ ఉంది. నాకు అర్థం అయ్యింది.
డ్రామా కోసం మేకప్ వేయించడానికి అన్న నన్ను తీసుకుని వచ్చాడు.
ఆంటీ మేకప్ మాన్ తో ఆల్రెడీ అన్ని విషయాలు ఫోన్లో చెప్పినట్టు ఉంది.
ఆయన నన్ను టేబుల్ వద్దకు తీసుకు వెళ్ళాడు. బుద్దిగా ఆయన వెనుకనే వెళ్లాను.
షర్టు తీసివేయమని చెప్పడంతో ఎందుకో కాస్త సిగ్గుగా అనిపించింది.
ప్రదీపన్న చేతిలో బ్యాగ్ తో పాటు వచ్చాడు. అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకుని వచ్చినట్టు అనిపించింది.
మరేం మాట్లాడకుండా షర్టు తీసేసి ఆయన చూపించిన చైర్ లో కూర్చున్నాను.
నా పేస్ కి మేకప్ వేయడం స్టార్ట్ చేశాడు.
ఎదురుగా గోడకు ఉన్న క్లాక్ లో టైం చూశాను
మధ్యాహ్నం రెండు గంటలు కావస్తోంది. మా జూనియర్స్ అందరూ స్కూల్ లో తక్కువ మేకప్ తో ఉంటే నేను మాత్రం ఒంటరిగా ఎక్కడో ఏమిటో అన్నట్టు ఉండడం ఒక రకంగా లోన్లీగా ఫీల్ అయ్యాను.
అయినా ఏమీ చేయకుండా కేవలం నా డ్రామా కోసం ఆంటీ, ప్రదీపన్న పడుతున్న కష్టం గుర్తువచ్చేసరికి నా లోన్లీనెస్ ఫీలింగ్ ఒక్కసారిగా గాలికెగిరిపోయింది
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్