పిల్లలకు ఫోన్స్ అవసరమా…
మనం ఫోన్స్ ఎప్పుడు వాడాం..నాగరికత అవసరమే..అందివచ్చే టెక్నాలజీ ఉపయోగించుకోవాలి.
సెల్ ఫోన్స్ ఎన్నో విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడనుండి.కమ్యూనికేషన్ కు అవసరమే
కానీ పిల్లలకు స్కూల్ స్థాయి పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ తో అవసరమేమిటి?
ప్రమాదకరమైన గేమ్స్ ఆడుకున్తున్నారు,నీలిచిత్రాలు అలవాటుపడుతున్నారు.
ఒక వ్యసనంలా…దుర్వ్యసనంలా తయారైంది.
తమ పిల్లలకు ఖరీదైన ఫోన్స్ కొనివ్వడం ఒక ఫాల్స్ స్టేటస్ కు దారి తీస్తుంది.
పదకొండేళ్ల పిల్లాడు సెల్ ఫోన్ లో పోకే మేన్ గేమ్ ఆడుతూ ప్రాణాలు తీసుకున్నాడు.ప్రమాదకరమైన ఆ ఆటలో ఎందరో విద్యార్థుల ప్రాణాలు కోల్పోయారు.
అతి ఎప్పుడు మంచిది కాదు.
ఫోను వ్యసనంగా మారితే ఏమవుతుందో ఈ వార్త చదివితే మీకే అర్థమవుతుంది.
***
అధికంగా ఫోను వినియోగిస్తున్నవారిపై ఇటీవల జరిగిన ఒక పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. స్మార్ట్‌ఫోను లేదా కంప్యూటర్‌కు గంటల తరబడి అతుక్కుపోయే యువత మానసిక ఆందోళనకు గురవుతోందని వెల్లడైంది. ముఖ్యంగా ఇది వ్యవనంగా పరిణమించిన యువతులు ఆత్మహత్యలకు తెగబడుతున్నారని సదరు పరిశోధనలో తేలింది.
అమెరికాలోని సాన్ డియోగో స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడు జీన్‌వేగ్ మాట్లాడుతూ యువతలో మానసిక ఆరోగ్యాన్ని స్మార్ట్ ఫోన్లు దెబ్బతీస్తున్నాయి. 5 లక్షల యువత నుంచి సేకరించిన సమాచారం అధారంగా ఈ పరిశోధన సాగిందన్నారు. రోజులో ఐదు గంటలకు మించి స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్న వారిలో మానసిన సమస్యలు పెరుగుతున్నాయని జీన్‌వేగ్ తెలిపారు.
యువత విషయంలోనే ఇలా ఉంటే ఏమీ తెలియని పిల్లల విషయంలో ఇంకెంత ఘోరంగా ఉంటుంది.
ఎలాంటి దుష్పరిమాణాలకు దారితీస్తుంది.
మీ పిల్లలకు ఉన్నత సౌకర్యాలు కల్పిస్తున్నామని భ్రమలో వాళ్ళ జీవితాలను చీకటిలోకి నెట్టకండి.
ఒక్కసారి ఆలోచించండి.మీ పిల్లలకు మీరు ఇచ్చే ఖరీదైన గిఫ్ట్ అంతకన్నా విలువైన వారి భవిష్యత్తును ఎలా నాశనం చేస్తుందో ఆలోచించండి.
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్