మా తెలుగుతల్లి …నిన్ను తలుచుకునంతనే పులకించు తెలుగువాడి మనసు … తెలుగుతల్లీ.,,నీకు వందనం….డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి

మాతృభాష మృతభాష కారాదు…తెలుగునుడికారం పరభాషా చట్రాలకింద నలిగిపోరాదు అమ్మను మరిచి అమ్మ భాషను విడిచి పరాయి భాషతో తేటతెనుగు మాధుర్యాన్ని నేలపాలు చేయరాదు.
మనతెలుగు భాషా సంపద తరతరాలకు వెలుగునిచ్చు అక్షరాలా చరిత…పదాల ఘనత…
వాగ్గేయకారులైనా కవితా పితామహులైనా,సాహితీకారులైనా గురువులైనా మహారాజులైనా తెలుగుభాష స్వరంతో ధన్యమైనవారే…
ప్రబంధాలు మహాకావ్యాలు రామాయణ ఇతిహాసాలు పురాణాలు చరిత్ర గ్రంథాలు..తెలుగు భాషతో వర్థిల్లిన అద్భుతాలు.
‘చందమామ రావే – జాబిల్లి రావే’ అని అమ్మ బిడ్డకు చందమామను చూపించి పాటపాడినా….
అదివో అల్లదివో అని అన్నమాచార్యులు
జ్ఞానపథం .. జానపదం
పంచరత్నాలు అయినా యక్షగానాలు అయినా..
వెన్నెల్లో ఆడుకునే బాలగంగాధర తిలక్‌. అక్షరాలు
శ్రీ శ్రీ మహాప్రస్థానం ..
తెలుగు భాషను సుసంపన్నం చేసిన మహానుభావులు ఎందరో ఎందరెందరో…
తెలుగుభాష నిండుగ వెలుగుభాష కావాలి.అన్యభాష అవసరమే కానీ తెలుగుభాష స్థానంలో సవతి భాష రారాదు …కన్నతల్లిని విస్మరించరాదు.
ప్రత్యామ్నాయం లేని పదాలకు ఆంగ్లభాష ..మన భాష అర్థం కానీ చోట పరాయిప్రాంతంలో ఆయా ప్రాంతాల భాష అనివార్యం ..
కానీ మనమే మన భాషను కుదించి పరాయిభాషను ఆదరిస్తున్నాం..మన భాషను విస్మరిస్తున్నాం…
మన పిల్లలకు సుమతీశతకాలు,వేమన పద్యాలూ,క్షేత్రయ్య పదాలు,అన్నమయ్య కీర్తనలు…మధురమైన అమ్మానాన్న బాబాయి మామయ్య తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మ లాంటి పిలుపులు దూరమయ్యాయి..భారమయ్యాయి.
ఘనంగా వైభవంగా జరుపుకుంటోన్న తెలుగు మహాసభలు తెలుగుఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పాలి.
జయహో తెలుగు…
నిత్యం వెలుగై తెలుగువారి గుండెల్లో కొలువై నిలువు
తెలుగులో మాట్లాడుదాం…తెలుగువారిగా తలెత్తుకు నిలబడుదాం…

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY