జీవితం ఒక యుద్దరంగం..( life is a battlefield)..వ్యూహంతో ముందుకు కదిలితే మీదే విజయం ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి “అక్షరాలతో నేను” (17-12 -2017 )

జీవితంతో అనునిత్యం అనుక్షణం పోరాటం సలిపితేనే ఉనికిని నిలుపుకోగలరు..
ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేని వాయిదా వేసుకోలేని పోరాటమిది…జీవనం కొనసాగించాలంటే జీవితంతో యుద్దం చేయక తప్పదు
ఎలాంటి పరిస్థితినైనా సులభంగా గెలవాలంటే చక్కనైన వ్యూహం అత్యవసరం..  పరిస్థితులను మనకు అనుగుణంగా మరల్చుకోవడం అందుకు తగినట్టుగా వ్యూహరచన చేయడంలోనే విజయం ఇమిడి ఉంది..ఒక సమస్యనో సంక్షోభాన్నో ఎదుర్కోవాల్సి వచ్చిన ప్రతిసందర్బంలోనూ వ్యూహాన్ని ఆయుధంలా మలుచుకోవాలి..
కత్తి కంటే పదునైనదీ.. ఫిరంగి కంటే శక్తివంతమైనదీ…క్షిపణి కంటే వేగవంతమైనదీ వ్యూహమే..
వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలోనే మనమేమిటో మనకు తెలిసిపోతుంది.. వ్యూహంలో మన మేధ నే శత శతఘ్నులతో సమానం.. మన ఆలోచనలే అక్షౌహిణుల సైన్యం..కురుక్షేత్రయుద్ధంలో అనేక సైనిక వ్యూహాలను అమలు చేయడం ద్వారా పాండవులు విజయాన్ని సాధించారు..
చత్రపతి శివాజీ అమలు పరిచిన గెరిల్లా వ్యూహం నేడు అన్ని రంగాల్లోనూ అమలు పరుస్తున్నారు..
సమరానికి సిద్ధం కావడమంటే మనసును సన్నద్ధం చేసుకోవడం ఆలోచనలను లక్ష్యం వైపు మోహరించడమే…
పోరాటం అనివార్యమైన చోట వ్యూహం తప్పనిసరి అవుతుంది..
పోరాడకపోతే పోయేదేమి లేదు..
అనామకులుగా అడ్రస్ లేనివాళ్లుగా మిగిలిపోతామంతే!!
మీరే తేల్చుకోండి..సమస్యలతో ఓటమితో నిరంతరం ఎదురయ్యే సవాళ్లతో ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో పోరాడుదామా?
భయంతో ఓడిపోతామనే ఆత్మన్యూనతాభావంతో అనామకంగా  మిగిలిపోదామా..చరిత్రలో విజయాన్ని సాధించినవారిగా వెలిగిపోదామా?
జేకే రౌలింగ్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది,ఇంటికి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో రైలు  ప్రయాణం చేస్తున్న ఆమెకు చనిపోతే…ఎలా అన్న ఆలోచనకు వచ్చి చివరికి ఆ ఆలోచనతోనే పోరాడింది.ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించింది.అక్షరాల వ్యూహంతో పాపులారిటీని జయించింది.సాధించింది 
హ్యారి పోటర్ లాంటి అద్భుతమైన నవల రాసింది.
ప్రపంచంలోనే సంపన్నమైన రచయిత్రిగా నిలిచింది.
జీవితం ఒక యుద్దరంగం..( life is a battlefield)..
వ్యూహంతో ముందుకు కదిలితే మీదే విజయం
ఆల్ ది బెస్ట్

గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.

గుప్పెడంత ఆకాశం లింక్

http://kinige.com/book/Guppedanta+Akasam

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY