స్వామి వివేకానంద
ఆయన బోధనలు యువతరానికి నవతరానికి భావితరానికి భవిష్యత్తు భారతానికి సదా ఆచరణీయాలు…
విద్యార్థుల్లో సృజనాత్మకత వున్నవాళ్లు వున్నారు…మనం మన మైండ్ సెట్ ను పిల్లల మీద రుద్దుతున్నాం…కానీ ఒక్కక్షణం..
మై డియర్ యంగ్ పేరెంట్స్..
ఒక్కసారి మీరు పిల్లల మైండ్ సెట్ తో ఆలోచించండి.
మీ పిల్లల్లో వున్న సృజనాత్మకత గమనించండి
విద్యావ్యవస్థలో వున్న లోపాలు సరిచేసుకుందాం…
మన ఇంట్లో ఒక గురువు ఉండాలి ప్రతీ ఇంట్లో ఒక ఉపాధ్యాయుడు ఉండాలి…ఎందుకంటే ఉపాధ్యాయులే రేపటిభారతానికి నవతరం భావాలతో వుండే నవయువతను సృష్టించే అపర విధాతలు ఉపాధ్యాయులు.
విద్యార్థులు చదివే తరగతిని బట్టి వారి వయసును బట్టి తరగతి గది అలంకరణ ఉంటే ఆ తరగతి గది ప్రభావం విద్యార్థులను ఉత్సాహభరితంగా మారుస్తుంది.పాఠాలు నేర్పడమే లక్ష్యంగా కాకుండా..సమాజంపై అవగాహన కలిపించాలి.విద్యార్థులు చెప్పిన పాఠాలను బట్టీ పట్టే విధంగా కాక స్వంతంగా ఆలోచించేలా,గుర్తు పెట్టుకునేలా ఉండాలి.
పాఠాలను ఉపన్యాసంలా కాకుండా కథలా చెప్పగలగాలి.అనగనగా కథలు మనకు ఎంత ఉత్సాహాన్ని ఇస్తాయో..విద్యార్థులలో ఎలా ఆసక్తిని పెంచుతాయి…పాఠాలు కూడా అలాంటి ఆసక్తిని పెంచాలి.అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి.ఉదాహరణలతో పాఠాలు చెబితే తొందరగా అర్థమవుతుంది.
కొని సందర్భాల్లో వర్తమాన పరిస్థితులకు అన్వయించి కూడా చెప్పవచ్చు,
సాంకేతిక నైపుణ్యాన్ని కూడా జోడించవచ్చు.విద్యార్థులకు ఖరీదైన సెల్ ఫోన్స్ అనవసరమే …
కానీ అప్పుడప్పుడు అందులోనూ వారికీ అవసరమైన పాఠాలను సెల్ ఫోన్స్ లో చూపించేదిశగా తల్లిదండ్రులు ప్రయత్నించాలి.
ప్రమాదకరమైన ఆటలు/గేమ్స్ ఆడకుండా చూడాలి.సెల్ ఫోన్ ను సృజనాత్మకతకు ఎలా ఉపయోగించవచ్చో పిల్లలకు అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పాలి
సెల్ ఫోన్ ఎందుకు ఉపయోగిస్తున్నారా చెక్ చేయాలి.కాల్ హిస్టరీ ని చూడాలి.వారంలో ఏ ఒక్కరోజో ,కొద్దీ సమయాన్ని సెల్ ఫోన్ తో గడిపేలా చేయాలి.
సెల్ ఫోన్ ఖరీదైన ప్రమాదకరమైన వ్యసనం కాకూడదు.
కత్తితో ప్రాణాలు తీయవచ్చు..అదే కత్తితో కూరలు తరగవచ్చు..
కత్తితో మనల్ని మనం రక్షించుకోవచ్చు…
డాక్టర్ చేతిలోని కత్తి సర్జరీ చేసి ప్రాణాలు కాపాడుతుంది.
ఆయుధం మనచేతిలో వున్నప్పుడు అది ఎలా ఎందుకు ఉపయోగించాలో మనకు తెలిసి ఉండాలి.
ఆ ఆయుధాన్ని పిల్లలకు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి..వారికి మంచి చెబుతూ ఉండాలి.
స్వామి వివేకానందను స్మరించుకుంటూ ప్రతీఒక్కరం పిల్లల భవిష్యత్తు కోసం పునరంకితం అవుదాం.
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్