ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. పెద్దవారి స్పీచ్ తరువాత సాయిబాబా గొప్పతనం, ఆయన మహత్యాలు స్టార్ట్ అయ్యాయి.
నాకు అక్కడ కూర్చొని చిరాకు పుడుతోంది. ఎంచక్కా అందరూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ, జోక్స్ వేసుకుంటూ హాయిగా ప్రోగ్రాం చేస్తూ ఉంటే నేను మాత్రం పంజరంలో పడ్డ చిలుకలా అటూ ఇటూ కదలక ఉన్నచోటనే కూర్చోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ప్రత్యక్షంగా తెలిసివస్తోంది.
సినిమాలో మహానుభావులు పర్ఫెక్షన్ కోసం గంటల తరబడి మేకప్ వేసుకుని ఎలా కూర్చుంటారో తలచుకుంటే వాళ్ళు ఎంత గోప్పవారో తెలిసింది.
ఇంతలో మా జూనియర్స్ చేయబోయే ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందని అనౌన్స్ మెంట్ చేశారు. మా బాలవికాస్ మెంబర్స్ అందరూ ప్రోగ్రాం చూడ్డానికి బయలుదేరారు. నాకు ఆ అదృష్టం లేకుండా పోయింది.
అర్థగంట భారంగా నడిచింది. ఆ ప్రోగ్రాంకు సంబంధించి సాంగ్ నాకు వినపడుతోంది కాని మా వాళ్ళను చూసే పరిస్థితి లేదు.
కాసేపటి తరువాత ప్రోగ్రాం అయినట్టు సాంగ్ నిలిచిపోయింది. నా దగ్గరకు ఎవరూ రాలేదు కానీ ప్రోగ్రాం మాత్రం బాగా జరిగినట్టు అందరూ మాట్లాడుకుంటుంటే వినిపించింది.
ఇంతలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్టు అనౌన్స్ మెంట్ వినిపించింది.
మళ్ళీ బాడ్ లక్.
నేను స్టేజ్ పైన ప్రైజ్ తీసుకోవడం ఒక కోరిక. అది ఎన్నో సంవత్సరాల నుండి తీరని కోరిక. బాల వికాస్ లో ఎన్నో ప్రైజెస్ గెలిచానని చాలా సంతోషం కలిగింది. నేను స్టేజ్ పైన ప్రైజ్ తీసుకుంటుంటే మా పేరెంట్స్ చూస్తే బాగుంటుంది అన్న కోరిక ఎప్పుడు తీరుతుందో అన్న నిరాశ ఉండేది.
ఇక్కడ ప్రైజెస్ రావడంతో నా కోరిక తీరుతుందని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు
మేకప్ తో స్టేజ్ పైకి వెళ్ళడం కుదరదు. ఆంటీ స్ట్రిక్ట్ గా చెప్పి మరీ వెళ్ళింది.
స్టేజ్ పైన ప్రతి పోటీలో నా అనౌన్స్ మెంట్ వినిపిస్తుంటే నా బదులుగా మా జూనియర్స్ వెళ్లి తీసుకుంటున్నారు. నా బాధ చెప్పుకోలేనిది…
ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అలా నేను బాధలో ఉండగానే పూర్తి అయ్యింది.
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్