దుర్యోధనుడు పడ్డ సీన్ లో నాకు ద్రౌపది నవ్వు వినిపించినట్టు ఒక వైపు చూస్తూ నేను డైలాగ్స్ చెప్పాలి…స్మార్ట్ రైటర్ సురేంద్ర సీరియల్ నిన్నటి నేను (14 &21-01-2018)

ఆంటీ వచ్చి నన్ను రెడీగా ఉండమని చెప్పి వెళ్ళింది.
డ్రామా… స్టేజ్ అంటే నాకు ఎప్పుడూ భయం వేయదు… వేయలేదు…
కానీ ఆంటీ పేస్ చూస్తే ఎందుకో టెన్షన్ పడుతున్నట్టు అనిపించింది.
ఇంతలో ప్రదీపన్న రూమ్ లోకి వచ్చాడు. అన్న మొహంలో కూడా ఎందుకో టెన్షన్ కనపడింది. బహుశా నా డ్రామా వారికి ఫస్ట్ టైం కావడం వల్ల వచ్చిన టెన్షన్ అని అర్థం అయ్యింది.
అయినా నాకు లేని టెన్షన్ వాళ్లకు ఎందుకో అర్థం కాలేదు.
ఇంతలో నా ప్రోగ్రాం గురించి అనౌన్స్ మెంట్ వినిపించింది.
అనౌన్సర్ గా మా ఆంటీనే ఉన్నారు…
ఏక పాత్రాభినయం అన్న కాన్సెప్ట్ కొత్తది కావడం వల్ల ఆంటీ దాని గురించి కాస్త ఎక్కువగానే చెబుతున్నారు..
నేను స్టేజ్ పైకి ఎక్కాను. స్టేజ్ కర్టెన్ ఇంకా అలాగే ఉంది. చివరగా నా పేరు చెప్పి ఆంటీ స్టేజ్ దిగారు.
ఇంతలో కర్టెన్ ఓపెన్ చేశారు. ఇక నా చుట్టూ ఏమి జరుగుతుందో పట్టించుకునే స్థితి దాటిపోయాను.
నా అనుభవాన్నంతా ఉపయోగించి యాక్టింగ్ చేస్తున్నా… ఆడియన్స్ అంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు.
ఎన్టీఆర్ డైలాగ్స్ కావడంతో పెద్దవారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వారి రియాక్షన్ తో నేను మరింతగా రెచ్చిపోతున్నాను.
నన్ను ఆపడం ఎవరితరం కానట్టు రేగిపోతున్నాను.
డ్రామా మధ్యలో దుర్యోధనుడు మడుగులో పడే సీన్ ఉంది. దుర్యోధనుడు నీటిలో పడగానే ద్రౌపది నవ్వుతుంది… ఆ నవ్వుతో కోపం… కసి పెరిగి దుర్యోధనుడు ఆవేశంతో చెప్పే డైలాగ్స్ ఉన్నాయి.
సాదారణంగా ఏక పాత్రాభినయంలో ఎవరూ ఉండరు. మనం ఎవరో ఉన్నట్టుగా ఊహించుకుని డైలాగ్స్ చెప్పాలి.
స్కూల్ లో ఇదే డ్రామా వేసినప్పుడు కూడా అలానే చేశాను. ఇలా నా ఫ్లోలో నేను డైలాగ్స్ చెప్పుకుంటూ దానికి సమానంగా యాక్టింగ్ చేసుకుంటూ వెళుతున్నాను…
దుర్యోధనుడు పడ్డ సీన్ లో నాకు ద్రౌపది నవ్వు వినిపించినట్టు ఒక వైపు చూస్తూ నేను డైలాగ్స్ చెప్పాలి.
“ఏమే.. ఏమేమే… నీ వికటాట్టహాసమూ…” అంటూ డైలాగ్
నేను పడ్డట్టు యాక్షన్ చేసి ఇంతలో ఎవరో నవ్వినట్టు డైలాగ్ చెప్పబోతుంటే ఒక సైడ్ నుండి ఎవరో లేడీ నవ్వినట్టు వినిపించింది.
నేను సీరియస్ గా యాక్టింగ్ చేస్తుంటే మద్యలో వినపడ్డ నవ్వుతో నేను కన్ఫ్యూజ్ అయ్యాను.
ఇంతకూ నవ్వింది ఎవరు? ఎందుకు నవ్వారు?
నా యాక్టింగ్ లో లోపం ఏదైనా ఉందా? లేక నా యాక్టింగ్ అంత కామెడీగా ఉందా?
నవ్వు కరెక్ట్ గా రావలసిన చోటే రావడంతో ద్రౌపదిలా ఎవరైనా నవ్వారా?
పైగా ఆ నవ్వు మైక్ ద్వారా వినిపించడంతో ఆడియన్స్ కి కూడా వినిపించి ఉంటుంది.
స్టేజ్ పైన ఉన్న నాకు ఎక్కువగా ఆలోచించే సమయం లేదు.
పైగా మంచి ఎమోషన్ లో ఉన్న సీన్ మద్యలో ఆపేస్తే రసాభాస అవుతుంది.
ఇక ఏదైతే అది అయ్యిందని ఆ నవ్వు ద్రౌపది నవ్వినట్టు కవర్ చేసుకుంటూ స్పాంటేనియస్ గా నెక్స్ట్ సీన్ కంటిన్యూ చేశాను.
స్టేజ్ సైడ్ స్క్రీన్ లో ప్రదీపన్న, ఆంటీ నిలుచుని ఉన్నారు. వారి మోహంలో స్టేజ్ పైన జరిగిన కన్ఫ్యూషన్ తాలూకూ టెన్షన్ కనిపించింది.
ఆ సీన్ లో ఎమోషన్ తప్ప మరో ఎక్స్ ప్రషన్ కనపడకూడదు.
ఆడియన్స్ కళ్ళు నాపనే ఉంటాయి. ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే ఆంటీ వాళ్ళ ఫీలింగ్స్ ని పట్టించుకోకుండా ముందుకు సాగిపోయాను.
అర్థగంట గడిచింది. ఆడియన్స్ మొత్తం నిశ్శబ్దంగా నన్ను నా యాక్టింగ్ ను చూస్తున్నారు.
ఇంతలో నా డ్రామా అయ్యింది… కర్టెన్ క్లోజ్ చెయ్యగానే నేను స్టేజ్ దిగాను.
కాసేపు నిశ్శబ్దం… నాకు సిట్యువేషన్ అర్థం కాలేదు.
ప్రోగ్రాం బాగాలేదా? లేక నా యాక్టింగ్ చెండాలంగా ఉందా?
ఎందుకు ఆడియన్స్ రియాక్షన్ లేదు?

(చిగురించిన జ్ఞాపకాల్లో చిన్నవిరామం)

సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

http://kinige.com/author/Vijayarke

ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY