అనుమానం అన్నది రాకూడదు. వచ్చిన తరువాత దాన్ని తట్టుకోవడం చాలా కష్టం.
ఆంటీ, ప్రదీపన్న కూడా ఇంకా రాలేదు.
రెండు నిముషాల తరువాత చప్పట్లు మొదలైయ్యాయి.
ఆగకుండా మరో రెండు నిముషాలు ఆ చప్పట్లతో మారుమ్రోగిపోయింది.
కాసేపటి తరువాత ఆంటీ, ప్రదీపన్న లోనికి వచ్చారు.
వాళ్ళ పేస్ ఆనందంతో వెలిగిపోతున్నాయి.
నా డ్రామా చూడ్డానికి మా అమ్మమ్మ తాత కూడా వచ్చారని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
ప్రదీపన్న ఐతే నన్ను ఎత్తుకుని గిరగిరా తిప్పి కిందకు దించాడు.
అప్పటికే ఆకలి దంచేస్తోంది. పొగడ్తలతో నా కడుపు నిండిపోయినా.. లోపల ఆకలి మాత్రం ఎక్కడో కాలుతోంది.
అప్పటికే చాలా మంది నన్ను చూడడానికి లోపలికి వస్తున్నారు. నా ప్రోగ్రాం లాస్ట్ కావడంతో చాలా టైం అయినట్టు ఉంది.
డ్రామా కోసం వేసుకున్న కాష్ట్యూమ్స్ తిరిగి ఇచ్చేయాలి. ప్రదీపన్న నన్ను బయటకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నాడు.
నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు నా డ్రెస్ చూసి చాలా ఇంప్రెస్ అయినట్టు ఉన్నారు.
మొత్తానికి ప్రదీపన్న అతి కష్టం మీద నన్ను బయటకు తీసుకుని వచ్చాడు. ఆకలి నకనకలాడుతోంది. పెట్టుడు మీసాలు తీసేసి తిన్నా ఏమీ ఇబ్బంది ఉండదు కానీ అది మిస్ అయితే తరువాత చాలా ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశ్యంతో ఆకలిని తట్టుకుంటూ అలానే ఉన్నాను. ప్రదీపన్న అంత నైట్ లో రిక్షాను మాట్లాడి నన్ను మేకప్ మాన్ వద్దకు తీసుకు వెళ్ళాడు.
మేకప్ మొత్తం తేసేసి బట్టలు మార్చుకుని ఇంటిస్వాగతంకి చేరడానికి చాలా టైం పట్టింది.
నా పెర్ఫార్మన్స్ కి ఇంటిలో దిష్టి తీసి స్వాగతం చెప్తారేమో అనుకున్న నా ఊహ తారుమారు అయ్యింది.
అప్పటికే చల్లబడి ఉన్న అన్నాన్ని తిని మొహం అయినా కడుక్కోకుండా అలానే పడుకున్నాను
(వచ్చేవారం పుట్టపర్తి ట్రిప్)
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్