ఒళ్ళు గగుర్పొడిచింది.భయం అనుభవంలోకి వచ్చింది…అప్పుడు కనిపించింది దెయ్యాల మైలురాయి …హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకుల కోసం ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి …(ఘోస్ట్ స్టోరీస్) 18-02-2018

 

                                           (6)

చీకటి దుప్పటిలో ముసుగేసాక ఆ చీకట్లో ఏం జరుగుతుందో ఎవరికీ ఏం తెలుసు? తన భవిష్యత్ లో ఏం జరగబోతోందో తెలియని ఠాకూర్ సింగ్ తన ఇంటిలో ఎ.సి గదిలో హాయిగా నిద్రిస్తున్నాడు…
నిర్మానుష్యమైన ప్రదేశంలో నిర్జనమైన బాటలో మిట్టమధ్యాహ్నవేళలో ఠాకూర్ సింగ్ బైకు మీద వెళుతున్నాడు. చాలా సేపటి ప్రయాణిస్తున్న ఠాకూర్ కి అలసటగా అనిపించి విశ్రాంతి తీసుకోవాలనిపించింది. చుట్టూ అడవి లాంటి నిర్మానుష్యమైన ప్రదేశం. అంతలో దాపులనే ఒక పెద్ద ఊడల మర్రిచెట్టు కనిపించింది. బైకు ఒక పక్కగా ఆపి ఆ చెట్టునీడలో అలా విశ్రాంతిగా వాలిపోయాడు ఠాకూర్ బాగా అలిసిపోయి ఉన్నందున వీచే చల్లగాలికి ఒళ్లు తెలియకుండా నిద్ర పట్టేసింది.
అలా రెండు.. మూడు గంటలు గడిచాక…
ఉలిక్కిపడి నిద్రలేచాడు ఠాకూర్ అప్పటికే సాయంకాలం అవుతోంది. ఎక్కువసేపు నిద్రపోయాననుకుంటూ బైకు తీసి స్టార్ట్ చేశాడు.
సరిగ్గా అదే సమయంలో ఒక ఆకారం ఆ మర్రిచెట్టు నుండి దభేలున కిందకి దూకింది. బైకు స్టార్ట్ చేసిన శబ్దంలో ఠాకూర్ కి ఆ ఆకారం దూకిన శబ్దం వినపడలేదు. అది ఠాకూర్ ని అనుసరిస్తూ రాసాగింది. బైకు చక్రాలతో సమానంగా దాని కాళ్లకు చక్రాలున్నట్టు అనుసరిస్తోంది.
అలా కొద్దిదూరం వచ్చాక ఠాకూర్ మిర్రర్ వ్యూ నుండి ఆ ఆకారాన్ని చూడనే చూశాడు. తెల్లటి పొడవైన ఆకారం ముఖం నుండి కాళ్లవరకూ తెల్లని ముసుగు వేసుకుని చాలా వేగంగా ఠాకూర్ ని అనుసరిస్తూ వచ్చేస్తోంది ఆ ఆకారం
ఒళ్ళు గగుర్పొడిచింది.భయం అనుభవంలోకి వచ్చింది. ఠాకూర్ బైకు వేగం బాగా పెంచాడు. ఆ వేగంతో సమానంగా వస్తోంది ఆ ఆకారం. ఆ బాట నుండి దారి మళ్లించి ఎలా పడితే అలా వెళుతున్నాడు ఠాకూర్ ఎలా వెళ్లినా ఆ ఆకారం అనుసరించడం మానలేదు. అలా కొంతదూరం వెళ్లాక ఎడమపక్క ఒక మలుపు ఆ మలుపు మొదట్లో ఒక రోడ్డు కనిపించింది. ఆ రోడ్డులో వెళితే ఎవరైనా కనిపించి తనకు సాయం చేస్తారనుకున్న ఠాకూర్ తన బైకును మళ్లించాడు. ఆ రోడ్డుకు ఒక పక్క ఒక మైలురాయి. ఆ మైలురాయి మీద అక్కడ ఉన్న ప్రదేశం పేరు అదెంత దూరం ఉందో తెలిపే సమాచారం ఉంది. ఆ ఆకారం వెంబడిస్తోందన్న భయంలో ఉన్న ఠాకూర్ ఆ మైలురాయిని చూడకుండా ఆ రోడ్డులో వెళ్లడం మొదలు పెట్టాడు.
ఒకవేళ ఠాకూర్ ఆ మైలురాయి మీద ఉన్న సమాచారాన్ని చదివి ఉంటే…?ఈ కథ మరోలా ఉండేదేమో….
అలా ఆ రోడ్డులో కొంతదూరం వెళ్లాక మిర్రర్ నుండి చూశాడు ఠాకూర్ అక్కడెవరూ లేరు. అనుమానం తీరక వెనుతిరిగి చూశాడు. నిజంగానే అక్కడ అనుసరించి వచ్చే ఆకారం కానీ మరెవరు కానీ లేరు. తప్పించుకున్నానని సంతోషపడుతూ అలా ముందుకు సాగిన ఠాకూర్ 2 కి.మీ. ప్రయాణించాక ఒక గ్రామాన్ని చేరుకున్నాడు. అక్కడంతా చాలా సందడిగా హడావుడిగా ఉంది. ఠాకూర్ ని చూసిన వారందరూ అక్కడేవో వేడుకలు జరుగుతున్నాయని తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని ఆహ్వానించారు. అలా ఒకరి ఇంటిలో ఆతిథ్యం స్వీకరించిన ఠాకూర్ ఆ రాత్రి వారింటిలోనే పడుకున్నాడు. అలా ఒకటి రెండు ఝాములు గడిచాక…….
ఠాకూర్ కి మెలకువ వచ్చింది. అంతలో ఏదో అలికిడి. కప్పుకున్న దుప్పటి తీయకుండానే ఆ అలికిడి ఏమిటో వినాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ అలికిడికి ఆజ్యం పోసినట్టుగా ఏవో మాటలు తన చెవులలో గుసగుసలుగా వినపడుతున్నాయి
దుప్పటి తీసిన ఆకారం ఠాకూర్ ని చూసింది. అది మనిషి కాదు. ఒక చీకటి ఆకారం . భయపడిన ఠాకూర్ ఒక్క ఉదుటున ఆ ఇంటి నుండీ బయటకు పరుగుపెట్టాడు
వెంటనే ఆ ప్రాంతం నుండి వెళ్లిపోవాలని బైకు కీస్ తీశాడు అంతే అవి గాలిలో ఎగరడం మొదలుపెట్టాయి.
తన దగ్గరున్న అన్ని వస్తువులు అలా గాలిలో ఎగురుతున్నాయి. చుట్టూ చూశాడు ఠాకూర్
ఆశ్చర్యం
కానీ వారందరూ మనుషులు కాదు. అవన్నీ చీకటి ఆకారాలు. అప్పుడు గమనించాడు ఠాకూర్ వారు తింటున్నది తాగుతున్నది. రక్తాన్ని. అంతలో వారందరూ ఠాకూర్ ను చూశారు
అక్కడంతా కోలాహలంగా ఉంది. అందరూ ఏవో తింటున్నారు తాగుతున్నారు ఆడుతున్నారు
అందరూ కలిసి ఠాకూర్ వెంట పడ్డారు. తప్పించుకు తిరుగుతున్న ఠాకూర్ అలా ఆ రాత్రి మొత్తం వాటికి దొరకకుండా తిరుగుతూనే ఉన్నాడు.
అలా పరిగెడుతూ ఆ గ్రామం బయటకు వచ్చాడు ఠాకూర్ ఆ ఆకారాలన్నీ ఠాకూర్ వెంట వస్తూనే ఉన్నాయి.
అలా ఆ గ్రామమంతా తిరుగుతున్న ఠాకూర్ కు ఎక్కడ చూసినా ఆ చీకటి ఆకారాలే కనిపిస్తున్నాయి. వెంబడిస్తున్నాయి. వాటికి దొరకకుండా అలా పరుగులు తీస్తునే ఉన్నాడు ఠాకూర్
అలా దాదాపు ఒక కి.మీ. వచ్చాక అక్కడకు కొద్దిదూరంలో ఒక ఆలయం వెలుతురుతో వెలిగిపోతోంది. అది చూసిన ఠాకూర్ ఆ ఆలయంలోకి పరుగుతీశాడు. ఆ ఆలయంలోకి వెళ్లడం చూసిన ఆ ఆకారాలన్నీ ఒక్కొక్కటిగా కనుమరుగైపోయాయి
అలా సూర్యోదయం అయ్యేవరకూ ఆ ఆలయంలో తల దాచుకున్న ఠాకూర్ భయం భయంగా బయటికి అడుగు పెట్టాడు. అక్కడెవరూ లేరు వాతావరణంలో ఎలాంటి అసహజత్వం లేదు.కాలినడకన ఆ వచ్చిన రోడ్డులో నడక సాగించాడు ఠాకూర్
అలా నడిచి వచ్చి ఆ రోడ్డు మొదటిలో ఉన్న ఆ మైలురాయిని ఆనుకునీ అలా కూర్చుండిపోయాడు
ఇక అక్కడనుండి ఎలాగైనా బయట పడాలని అనుకుంటూ అనుకోకుండా ఆ మైలురాయిని చూసిన ఠాకూర్ అదిరిపడ్డాడు
ఆ మైలురాయి మీద ఇలా ఉంది
“కుల్దారా”
(దయ్యాల గ్రామం)2 కిలోమీటర్లు
అంటే రాత్రి తాను భయపడుతూ పారిపోయి వచ్చింది “కుల్దారా ..దెయ్యాల గ్రామానికి..తనకు ఆతిథ్యం ఇచ్చింది? ఒక్కక్షణం తను ఆ మైలురాయిని చూసి ఉంటే బావుండేది…
తనను కాపాడిన ఆలయం వైపు అందులో వున్న దేవుడి విగ్రహం వైపు చూసి చేతులు జోడించాడు ఠాకూర్ .
బైక్ పోయినా తన ప్రాణాలు దక్కాయి అనుకుంటూ తన ఊరికి వెళ్తోన్న ఠాకూర్ వైపు ఆ మైలురాయి చూస్తూనే వుంది..మైలురాయికి అనుకుని ఠాకూర్ బైక్ వుంది..ఆ బైక్ ఠాకూర్ వైపు చూస్తోంది.
(“రాజస్థాన్ ” లోని కుల్దారా దయ్యాల గ్రామమనీ అక్కడకు వెళ్లేవారికి అసహజపరిణామాలతో మరణం సంభవిస్తుందనీ” తెలిసిన సమాచారం ఆధారంగా..రచయిత్రి)

గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.
గుప్పెడంత ఆకాశం లింక్
http://kinige.com/book/Guppedanta+Akasam
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

http://kinige.com/author/Vijayarke

ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY