(8)
అది అమెరికాలోని మియామీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు. రన్ వే మీద లండన్ కి వెళ్లాల్సిన విమానం సిద్దంగా ఉంది. ప్రయాణీకులంతా ఒక్కొక్కరుగా తమ తమ సీట్లలో సర్దుకుంటున్నారు. వారందరికీ సహాయం చేస్తూ ఎయిర్ హోస్టెస్ అటూ ఇటూ తిరుగుతోంది.
సక్సేనా కూడా విమానం ఎక్కి తన సీటులో కూర్చున్నాడు. తన పక్కసీటులో ఇంకా ఎవరూ రాలేదు. సరిగ్గా విమానం బయలుదేరడానికి ముందు హడావుడిగా వచ్చిన ఒక మహిళ సక్సేనా పక్కసీటును ఆక్రమించింది. విమానం మెల్లగా గాల్లోకి లేచింది.
వెండిమబ్బుల మధ్య విమానం పయనిస్తోంది. హఠాత్తుగా వెండిమబ్బులు కారుమబ్బులయ్యాయి. వాతావరణంలో అనూహ్యమైన మార్పు గోచరిస్తోంది. చీకటి మబ్బులు విమానాన్ని కమ్ముకున్నాయి. విమానం గాలిలో గిరికీలు కొట్టింది. ప్రయాణీకులంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఉన్నట్టుండి వాతావరణం సాధారణంగా మారిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకునేలోపు..
సక్సేనా పక్కసీటులోని మహిళ లేచింది. ఆ మహిళను చూసిన ప్రయాణీకులందరూ ఉలిక్కిపడ్డారు.
జుట్టు విరబోసుకుని పొడుచుకొచ్చిన కోరలతో భయంకరంగా ఉంది. అక్కడికొచ్చిన ఎయిర్ హోస్టెస్ ను తన కోరలతో పొడవటానికి ప్రయత్నిస్తోంది. తప్పించుకున్న ఆమెను వదిలేసి పైలట్ కాబిన్ లోకి అడుగుపెట్టింది.
ఆ కోరల మహిళను చూసి జడుసుకున్న పైలట్ ను తన కోరలతో బెదిరించి విమానాన్ని తాను చెప్పిన ప్రదేశంలో అత్యవసరంగా దించాలంటూ చెప్పింది.
దెయ్యం మహిళ విమానాన్ని “హైజాక్ ” చేసిందన్న వార్త తెలిసిన కంట్రోల్ రూంలో గగ్గోలు మొదలైంది
ఆ దెయ్యం మహిళ విమానాన్ని ఎక్కడ దింపాలో సూచనలిస్తోంటే పైలట్ ఆ ప్రదేశంలో విమానాన్ని దించేశాడు. ప్రయాణీకులను పైలట్ ను అందరినీ దిగమని చెప్పి తన వెంట తీసుకువెళుతోంది ఆ దెయ్యం మహిళ. అలా వెళ్లి ఒకచోట ఆగింది. అందరూ ఆగి చుట్టూ చూశారు. అదొక శ్మశానం. అక్కడున్న సమాధుల మీద ఎంతో మంది కూర్చుని ఉన్నారు. వారందరికీ కోరలు ఉన్నాయి. వారిని చూస్తూ ప్రయాణీకులందరూ భీతితో వణికిపోతున్నారు. అంతలో ఆ ప్రదేశంలో మెల్లిగా చీకటి ఆవరించడం మొదలుపెట్టింది.
ఆ మసకచీకటిలో అక్కడున్న కోరల ఆకారాలన్నీ మెల్లిగా లేచి అక్కడున్న ప్రయాణీకులవైపు వస్తున్నాయి వాటిని చూస్తున్న అందరూ వణికిపోవడం మొదలుపెట్టారు. ఇంతలో అక్కడినుండి ఒక వ్యక్తి తప్పించుకుని పక్కకు వెళ్లిపోయాడు
ఆ వ్యక్తి సక్సేనా
అలా తప్పించుకున్న సక్సేనా విమానం ఎక్కి పైలట్ కాబిన్ లోకి వెళ్లాడు. కొన్ని నిమిషాల తర్వాత ప్రయాణీకులకు కోరల ఆకారాలకు ఒక పక్కగా ఉన్న స్థలంలో విమానాన్ని నిలిపాడు. ప్రయాణీకులందరినీ విమానం ఎక్కమని హెచ్చరించాడు. అలా హెచ్చరిస్తున్న సక్సేనాను కోరల మహిళ తన వాడికోరలతో పొడవటానికి ప్రయత్నిస్తోంది. దాని కోరలను చేతితో పట్టుకుని నిలువరిస్తూ అందరినీ విమానం ఎక్కించాడు సక్సేనా. చివరిలో విమానం ఎక్కుతున్న పైలట్ సక్సేనా కు కృతజ్ఞతలు చెప్తూ కోరలమహిళను తోసేసి సక్సేనా కూడా విమానం ఎక్కేందుకు సహాయపడ్డాడు.
విమానం తిరిగి టేకాఫ్ తీసుకుంది యథాప్రకారంగా ముందుకు సాగుతోంది. అప్పుడప్పుడే తేరుకుంటున్న ప్రయాణీకులందరూ జరిగిన సంఘటనలు చర్చించుకుంటూ సక్సేనా కు కృతజ్ఞతలు తెలుపుకోసాగారు. అవన్నీ వింటూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు సక్సేనా.
: ఎట్టకేలకు విమానం సురక్షితంగా లాండ్ అయింది. ఊపిరి పీల్చుకున్న ప్రయాణీకులు అందరూ విమానం నుండి దిగసాగారు. తమను కాపాడిన సక్సేనా కోసం ప్రయాణీకులు అక్కడున్న అధికారులు ఎదురు చూస్తున్నారు. కానీ సక్సేనా విమానం దిగలేదు. అక్కడున్న అధికారులు విమానం ఎక్కి అంతా కలయజూశారు కానీ సక్సేనా ఎక్కడా లేడు. ఇంతలో పైలట్ కు ఒక ఆలోచన వచ్చింది.
కోరల మహిళ తమను బంధించినపుడు విమానాన్ని తమ పక్కగా నిలిపినవాడు సక్సేనా. పైలట్ కి తప్ప విమానాన్ని నడపటం ఎవరికీ రాదు. కాబట్టి సక్సేనా తప్పకుండా పైలట్ అయి ఉంటాడని ఊహించాడు. సక్సేనా రూపురేఖలను గుర్తుతెచ్చుకున్నాడు. సక్సేనా ఒక ఇండియన్ అని అర్థమైంది.
ఆ ఆధారాలను ఆధారంగా చేసుకుని లాప్ టాప్ లో ఇండియన్ పైలట్ల గురించి వెతకసాగారు. ఒకచోట సక్సేనా ఫోటోతో పాటు కొన్ని వివరాలు ఉన్నాయి.
“తాను నడిపే విమానం ఉగ్రవాదులు హైజాక్ చేసినపుడు ప్రాణాలకు తెగించి దాదాపు 150 మంది ప్రయాణీకులను కాపాడి ఉగ్రవాదుల చేతులలో మరణించిన పైలట్ శరత్ చంద్ర సక్సేనా” అని ఉంది.
అది చదివి అక్కడున్న వారందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. బ్రతికున్నపుడు మాత్రమే కాకుండా చనిపోయాక కూడా తన విధులను హృద్యమయ్యేలా నిర్వర్తిస్తున్న సక్సేనాను తలుచుకుని అక్కడున్న వారందరి హృదయాలు భారంగా మారిపోయాయి!!
1972 లో న్యూయార్క్ లోని JFK విమానాశ్రయం నుండి బయలుదేరిన ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ విమానం కూలిపోయి అందులో అందరితో పాటు మరణించిన కెప్టెన్ రాబర్ట్ ఆత్మగా మారి ఆపదలో ఉన్న విమానాలను రక్షిస్తూ ఉంటాడని తెలిసిన సమాచారం ఆధారంగా…
గుప్పెడంత ఆకాశం ప్రపంచమంతా విస్తరించి వున్న తెలుగు పాఠకులకు చేరువైంది.ఇ.బుక్ ఇప్పుడు మీకు అందుబాటులో వుంది.
గుప్పెడంత ఆకాశం లింక్
http://kinige.com/book/Guppedanta+Akasam
గుప్పెడంత ఆకాశం లింక్
http://kinige.com/book/Guppedanta+Akasam
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్