అలా ఎదురుచూస్తుండగానే ఎవరో మావైపు వస్తున్నట్టు అనిపించింది. తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుని బాగా వయసైన వ్యక్తి మావైపు వస్తున్నాడు.
దేవుడా మేము ఎదురుచూసే వ్యక్తి ఇతనే కావాలి అని దేవుని మొక్కుకుంటూ అతనివైపే చూడడం ప్రారంభించాను.
అతను ఆంటీని చూసి పలకరింపుగా నవ్వాడు. దానితో నాలో ఒక్కసారి ఇంట్రెస్ట్ పెరిగింది.
అబ్బా… ఇక వెయిటింగ్ పీరియడ్ ఐపోయిందిరా దేవుడా అని ఆ దేవునికి మనసులోనే థాంక్స్ చెప్పుకున్నా…
ఆంటీ కూడా ఆయనను చూసి నవ్వడంతో ఇక కన్ఫర్మ్ అయ్యి నా లగేజ్ తీసుకున్నా…
ఆయన మమ్మలను వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఆయన వెనుక వెళుతూనే నేను పరిసరాలను గమనించసాగాను.
పుట్టపర్తి బస్ స్టాండ్ నుండి ప్రశాంతి నిలయం 8 కిలోమీటర్లు దూరం ఉండడంతో మినీ వ్యాన్ మాట్లాడుకుని వచ్చినట్టు ఉన్నాడు. ఆయన వెనుక మేం వెళ్లి వ్యాన్ లో కూర్చున్నాం.
సాయిబాబా ఆశ్రమానికి వెళ్ళడానికి దాదాపు అర్థగంట పట్టింది.
రోడ్లంతా గతుకులమయం… ఆ అర్థగంట ప్రయాణం ఒక రకంగా నరకాన్నే చూపించింది మాకు.
ప్రశాంతి నిలయం…
సాయిబాబా ఆశ్రమం…
నేను ఆశ్రమాన్ని చూడగానే ఒక్కసారి స్టన్ అయ్యాను.
ఆశ్రమం అంటే చిన్న కుటీరంలా సినిమాలో చూపించే విధంగా ఉంటుందన్న నా అంచనా ఫెయిల్ అయ్యింది.
ఇంద్రుని మయసభను తలపించే విధంగా బ్రహ్మాండమైన కట్టడాలు…
ఫైవ్ స్టార్ హోటల్ కు ఏ మాత్రం తీసిపోని బిల్డింగ్స్…
కళ్ళు చెదిరే నగిషీలతో. కాష్ట్లీ టేకుతో కట్టిన ఆశ్రమం…
దేవుని దూతలు (అప్పటికే సాయిబాబా భగవాన్ శ్రీసాయిబాబా అయ్యాడు) ఇలా ఉండాలా. ఇలా ఉంటేనే దేవుడు పలుకుతాడా?
ఎదురుగా సాయిబాబా భజన చేసే పెద్ద హాల్. హాల్ అనడం కన్నా పెద్ద మందిరం అంటే సరిపోతుంది.
కనీసం వెయ్య మంది కూర్చునేందుకు వీలుగా ఉన్న మందిరం. దాని చుట్టూ ఓపెన్ ప్లేస్. అక్కడ మరో రెండు వేలమంది కూర్చోవచ్చు.
దాన్ని ఆశ్రమం అని ఎందుకు ఎలా అంటున్నారో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్