నాకు అలవాటు ప్రకారం ప్రొద్దున 7 గంటలకు మెలకువ వచ్చింది. అప్పటికే చాలా మంది నిద్ర లేచారు.
కొత్త ప్లేస్ అయినా ముందు రోజు బస్ జర్నీ పైగా మంచి ఎండ కావడంతో ఒళ్ళు ఎరుగని నిద్ర పట్టేసింది. పొద్దున్న లేవగానే ఫ్రెష్ గా అనిపించింది.
ఇక బాత్ రూమ్స్ దగ్గర క్యూ తలుచుకునేసరికి ఒక్కసారి నీరసం ఆవహించింది.
ఇన్ని వందల మందికి నీళ్ళు ఎలానో, అలాగే అందరూ స్నానాలు చెయ్యడం అంటే ఎంత టైం పడుతుందో తలుచుకుంటేనే ఒళ్ళు జలదరించింది.
పేస్ట్ బ్రష్ టవల్ తీసుకుని బాత్ రూమ్స్ వైపు నడిచాను. ఆశ్చర్యం…
అక్కడ పెద్ద క్యూ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తే ఎవరూ లేరు. ఒకరో ఇద్దరో బ్రష్ చేసుకుంటూ ఉన్నారు.
మా జూనియర్స్ కూడా ఎప్పుడో స్నానం చేసి రెడీ అయ్యారు. మనదే ఆలస్యం అనుకుంటూ బాత్ రూమ్ లో దూరాను.
పది నిముషాలలో రెడీ అయ్యి షెడ్ లోకి వచ్చాను. నాకోసం ఆంటీ మా జూనియర్స్ వెయిట్ చేస్తున్నారు. నిన్న డిన్నర్ కి నేను మిస్ అవడంతో ఈ రోజు నన్ను ఎలా అయినా బ్రేక్ ఫాస్ట్ కి తీసుకెళ్లాలని ఆంటీ పట్టుబట్టినట్టు ఉంది.
అందరూ రెడీ అయినా నా కోసమే వెయిట్ చేస్తూ ఉంది. నేను రెడీ అవడంతో అందరు కలసి క్యాంటీన్ వైపు వెళ్లాం. రెండు నిముషాల నడకతో క్యాంటీన్ కి వచ్చాం. అలవాటుగా మెనూ ఉన్న బోర్డు వైపు చూశాను…
పొంగలి, ఉప్మా లాంటి పదార్ధాలతో పాటు ఇడ్లీ వడ లాంటి నాకిష్టమైన వంటకాలు ఉండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
యదాప్రకారం క్యూలో నిలబడి టోకెన్ తీసుకుని సప్లై చేసే ప్లేస్ కి వచ్చాను.
అందరూ సాయిరాం అంటూ పలకరించుకుంటున్నారు… మనకు అలవాటు లేని కారణంగా నన్ను పలకరించినవారికి చిరునవ్వుతో సమాధానం చెపుతూ ఇడ్లీ కౌంటర్ వైపు నడిచాను.
ఇడ్లీ వడ తీసుకుంటూ నిన్న కౌంటర్ లో కనిపించిన సాయి భక్తుడు ఉన్నాడేమో అని చూశాను. ఎక్కడా కనపడలేదు.
బహుశా ఈవెనింగ్ షిఫ్ట్ లో వస్తాడేమో… పొద్దున్న కాలేజీకి వెళ్లి ఉంటాడు అనిపించింది.
టిఫెన్ టేస్ట్ బాగానే ఉంది. పైగా రేట్ తక్కువ కావడంతో కావలసినంత తిన్నాను.
టైం చూస్తే 8 కూడా కాలేదు. టిఫెన్ ముగించుకుని బయటకు వచ్చాం.
ఆ రోజు కార్యక్రమాలు దగ్గరలో ఉన్న బోర్డు పైన కనిపించాయి.
ఇంతలో దూరంగా కలకలం… మా షెడ్స్ వద్ద జనం పెద్దగా గుమిగూడారు.
మేము కూడా ఏమి జరిగిందో అనుకుంటూ వడివడిగా షెడ్ వైపు కదిలాము.
అక్కడ…
అందరూ భక్తిగా నిలబడి ఒకవైపు చూస్తున్నారు…
నేను వాళ్ళు చూసేవైపుకు చూశాను.
అక్కడ నాకు ఏమీ కనపడలేదు. ఎందుకు ఇంత కోలాహలం అనుకుంటూ దగ్గరలో ఉన్న బెంచ్ పై కూర్చున్నాను…
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్