(8)
చీమచిటుక్కుమన్న వినిపించే నిశ్శబ్దం….ఆ కేబిన్ లో సుగాత్రి డిటెక్టివ్ సిద్దార్థ మాత్రమే వున్నారు.ఇద్దరూ ఎదురెదురుగా కూచున్నారు.వాళ్ళ మధ్య టేబుల్ మీద కాఫీ పొగలు కక్కుతూ వుంది.
“మై డియర్ యంగ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫీసర్ ఇప్పుడు చెప్పండి..నన్నెండుకు అరెస్ట్ చేసారో? సుగాత్రి వంక చూసి అన్నాడు
“చిన్న కరెక్షన్ మిస్టర్ జీనియస్ డిటెక్టివ్ సిద్దార్థగారు..మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు..వాక్యం బావుందని ‘యు అర్ అండర్ అరెస్ట్” అన్నంత మాత్రాన అరెస్ట్ కావడానికి డిటెక్టివ్ సిద్దార్థ అమాయకుడు కాదు…మా ఫ్రెండ్ మీలాంటి వాళ్లకు ఓ మంచిపేరు పెట్టింది…మాయకులు…”నవ్వుతూ అంది సుగాత్రి కాఫీ కప్పును సిద్దార్థ చేతికి ఇస్తూ…
“నేనా…ఆల్చిప్పల్లాంటి కళ్ళు ఉన్నవాళ్లకు టైలర్ మేడ్ తెలివితేటలుంటాయని ఎక్కడో విన్నాను”అంటూ కాఫీ కప్పు అందుకుని .కాఫీ స్మెల్ చూస్తూ ‘ఫిల్టర్ కాఫీ అయితే బావుండేది”అన్నాడు.
“మీకోసం నేర్చుకుంటాను”అనాలనుకుంది..కానీ అప్పటికే కేబిన్ బయట మిగితా ఆఫీసర్స్ వున్నారు.
“మనం ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం మిస్టర్ డిటెక్టివ్ .ప్లీజ్ “అంది అభ్యర్ధనపూర్వకంగా.డిటెక్టివ్ సిద్దార్థ అధికారానికి ఆధిపత్యానికి తల వంచడని తెలుసు.
“నేనెప్పుడూ నిజాలే మాట్లాడుతాను..ఐ ఈట్ నిజాలు..ఐ డ్రింక్ నిజాలు..ఐ లవ్ నిజాలు..ఆఫ్ కోర్స్ /ఐ లవ్…”అని ఆగి “చెప్పండి ఏం నిజాలు మాట్లాడుకుందాం? అడిగాడు కాఫీ సిప్ చేస్తూ…
“మీరు హైద్రాబాద్ ఎందుకొచ్చారో ఆ నిజాలు “అంది సుగాత్రి
“మీ సిబిఐ వాళ్ళేం చెప్పలేదా?అయినా ది గ్రేట్ సుగాత్రి మేడం కు తెలియని సీక్రెట్ ఉంటుందా?
“టీవీ స్టూడియో దగ్గరికి వచ్చేసరికి మిస్టర్ డి .మీ మీద ఎటాక్ చేయించడానికి మనుష్యులను పంపించినట్టు తెలిసింది..అందుకే ఈ అరెస్ట్ నాటకం…మీతో మాట్లాడితే కానీ ఓ క్లారిటీ రాదు కదా? సుగాత్రి చెప్పింది.
‘ఇపుడు నేను కాసేపట్లో తప్పించుకుంటాను…పోలీసులు కళ్లుగప్పి డిటెక్టివ్ సిద్దార్థ పరారీ”అనే వార్త మీడియాలో వస్తుంది.చెప్పాడు సిద్దార్థ.
ఒక్కక్షణం అలానే చూస్తూ ఉండిపోయింది సుగాత్రి…పెదవులతో ..చిరునవ్వుతో మాట్లాడగలడు..కళ్ళతో కేసు పరిశోధించగలడు..చూపుల్లో వాడివేడి…మిస్సయిల్ లా దూసుకువెళ్తాడు…
“థాంక్యూ సుగాత్రి గారూ “అన్నాడు సిద్దార్థ
“గారు వద్దులెండి సుగాత్రి చాలు”అంది
“అవును నాకు గతి చాలు”మనసులో అనుకుని ..సుగాత్రి వైపు చూసి..”నాకు సిటీ లో వున్నా గప్ చుప్ ..అదే పానీపూరి బండ్ల డిటైల్స్ కావాలి.ముఖ్యంగా స్కూల్స్ కాలేజెస్ ముందు ఉండేవి..అందులోనూ ఈ మధ్య “డి” మొబైల్ పానీపూరి వాలాల డిటైల్స్ కావాలి… “చెప్పాడు సిద్దార్ఛ్,
“ష్యూర్..”అంది సుగాత్రి.
“నేను నేచురల్ గా తప్పించుకుంటాను … మీకూ నాకు తప్ప ఎవరికీ ఈ విషయం తెలియకూడదు.”అన్నాడు.
“అంటే నా తలమీద బాది “నవ్వి అంది సుగాత్రి
సుగాత్రి వంక చూసి “మిస్టర్ డి తో మనం ఢీ కొనబోతున్నాం ” అన్నాడు.
“మీ అనుమానం ..”అంటూ ఆగింది సుగాత్రి
“అనుమానం కాదు నిజం..మోస్ట్ డేంజరస్ డ్రగ్స్ పానీపూరీలో ఉపయోగిస్తున్నారు…మెల్లిమెల్లిగా దీనికి ఎడిక్ట్ అవుతుంది యువత.చివరికి పిల్లలు కూడా..ఇది చాలా ప్రమాదకరమైంది ..రోజు కొన్ని లక్షల్లో బిజినెస్ ”
ఒక్కక్షణం అలానే ఉండిపోయింది.ఎంత ఘోరమైన విషయం…చాప క్రింద నీరులా…
సరిగ్గా గంట తరువాత ప్రెస్ కు,,ఎలక్ట్రానిక్ మీడియాకు ప్ ఫ్లాష్ న్యూస్ వెళ్ళింది
“పోలిసుల కళ్లుగప్పి డిటెక్టివ్ సిద్దార్థ పరారీ ”
***
జేమ్స్ కు నిద్రపట్టడం లేదు.రెండురోజులుగా విచిత్రమైన సంఘటనలు.పెద్దపేరున్న డిటెక్టివ్ సిద్దార్థ అరెస్ట్ కావడమేమిటి?అతను తన క్యాబ్ లో ఎక్కడం..తనను కిడ్నాప్ చేయడం..డేవిడ్ చనిపోవడం…అతని బుర్ర వేడెక్కి పోతోంది.
“త్వరగా వచ్చి పడుకోండి”డేవిడ్ భార్య అంది భర్తను ఉద్దేశించి
“నువ్వు పడుకో వస్తున్న”అంటూ కిటికీ తలుపు వేయబోయి ఉలిక్కిపడ్డాడు.డేవిడ్ తన వైపే చూస్తున్నాడు..
తనను పి…లు…స్తు…న్నా…డు...
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఘోస్ట్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్