మరుసటి రోజు పొద్దున్నే లేపారు. మంచి నిద్రలో ఉండగా లేపడంతో కాస్త చిరాకు అనిపించింది.
నేను పుట్టపర్తిసాయిబాబా ఆశ్రమం షెడ్ లో ఉన్నానని లేచిన తరువాత కానీ నాకు అర్థం కాలేదు.
ఇక నచ్చినా నచ్చకపోయినా అక్కడ ఉన్న రూల్స్ ఫాలో కాక తప్పదు అనుకుంటూ కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయలుదేరాను.ఆ రోజు ఈశ్వరాంబ డే కావడంతో ఆశ్రమం అంతా సందడిగా ఉంది.
అసలు ఆ రోజు కార్యక్రమం ఏమిటని ఆంటీని అడిగాను.
నువ్వే చూస్తావు కదా అన్నట్టు ఒక్క చూపు చూసి బయటకు వెళ్ళింది.
ఈలోగా టిఫిన్స్ తిని వచ్చాం.
ఇక మనకు పనేం లేక పోవడంతో ఒక రౌండ్ కొట్టి వద్దామని షెడ్ బయటకు వచ్చాను. షెడ్ బయట కోలాహలంగా ఉంది. చాలా గ్రూప్స్ అప్పటికే వచ్చి ఉండడం వల్ల అందరు గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు.
అసలు అక్కడ ఏమి జరుగుతుందో అన్న ఇంట్రెస్ట్ తో అటు వైపు వెళ్లాను.
అక్కడక్కడ ఒక్కో గ్రూప్ ఉంది. ఏదో కాన్సెప్ట్ మీద ప్రతి గ్రూప్ రెడీ అవుతుంది. కొందరు డాన్స్ డ్రెస్ వేసుకుని ఉన్నారు. మరికొంత మంది కోలాటం కర్రలు చేత్తో పట్టుకుని ఉన్నారు.
ఇంకా కొంతమంది మేకప్ వేసుకుంటూ ఉన్నారు. చూస్తుంటే ఇదేదో జాతరలా ఉంది.
ఇలా ఒక్కో గ్రూప్ ను చూస్తూ తిరుగుతున్నాను. కాసేపటి తరువాత ఎండ బాగా రావడంతో ఇక తిరిగే ఓపిక లేక మా షెడ్ వైపు వచ్చాను.
ఒకటికి రెండు సార్లు షెడ్ నెంబర్ గుర్తు పెట్టుకుని ఉండడం వల్ల మేము ఉన్న షెడ్ ను కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు.
షెడ్ లోపలకు తొంగి చూశాను. చాలా వరకు ఖాళీగా ఉంది. మా జూనియర్స్ కోసం వెదికాను.
ఎక్కడా కనపడలేదు. ఇంతలోనే ఎక్కడకు వెళ్లి ఉంటారా అని అనుకుంటూ బయటకు వచ్చాను.
అప్పటికే బయట ఉన్న గ్రూప్స్ రెడీ అయినట్టు ఉన్నారు. ఎవరూ బయట కనపడలేదు.
మొత్తానికి ఏదో ప్రోగ్రాం జరగబోతోంది. అది ఏమిటో అర్థం కాలేదు.
సాయిబాబా మెయిన్ హాల్ ముందు చాలా ఖాళీ ప్లేస్ ఉంది. అక్కడకు వెళ్లి ఉంటారేమో అనుకుంటూ బయలుదేరాను.
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్