(గత సంచిక తరువాయి)
సాయిబాబా ఆశ్రమ ప్రాంగణం…
వేల మంది భక్త జనం…
అదో జాతరలా ఉంది. దాదాపు అన్ని బ్యాచ్ లు అక్కడే ఉన్నాయి. ఒక్కో బ్యాచ్ కి ఒక్కో కలర్ డ్రెస్. రంగు రంగుల డ్రెస్ లో కాంతివంతంగా ఉంది ఆ ప్రదేశం.
అక్కడ జనాన్ని చూస్తుంటే రిపబ్లిక్ డే లో పెరేడ్ చేసే సైనికులు గుర్తుకు వస్తున్నారు. బ్యాండ్ మేళంతో ఉన్న జనం, చేతిలో కోలాటం కర్రలతో ఉన్న బ్యాచ్… ఇలా రకరకాల బ్యాచ్ లో జనం…
అన్ని బ్యాచస్ లైన్ గా నిలబడి ఉన్నారు.
నేను ఆ ప్రాంగణం అంతా ఒక రౌండ్ వేద్దామని బయలుదేరాను.
ఇంతకూ మూల పురుషుడు… సాయిబాబా ఎక్కడ ఉన్నాడో చూద్దామన్న కుతూహలం…
ఆశ్రమం అంతా ఒక రౌండ్ కొట్టాను. దాదాపు అందరూ వైట్ డ్రెస్ లోనే ఉన్నారు. లేడీస్ కూడా తెల్ల చీరలోనే ఉన్నారు…
తెలుపులో ఏదో ఒక అట్రాక్షన్ ఉంది… తెలుపు రంగు చూడగానే మనసంతా ఏదో తెలియని ప్రశాంతత… అప్పటి నుండేమో తెలియదు కానీ తెలుపు అంటే ఇష్టం ఏర్పడింది.
తెల్ల డ్రెస్ చూస్తే నాకు ఎంతో ఆనందం…
ఆశ్రమ ప్రాంగణం ముందరి భాగంలో ఏదో కోలాహలం.. సాయిబాబాకు అత్యంత దగ్గరి భక్తులు అక్కడ ఏదో హంగామా చేస్తున్నారు.
నాకు అర్థం అయ్యింది ఏమంటే సాయిబాబాకి ఈ అనుంగు శిష్యులు సకల సదుపాయాలు చేసేవారు. ఆయన రావడానికి ముందే అక్కడి ఏర్పాట్లు గమనించడం… ఏదైనా తేడా వస్తే దాన్ని సరి చేయడంలాంటి పనులు చేసే గ్రూప్.
ఇంతకూ ఆ కోలాహలం ఏమిటో చూద్దామని దగ్గరగా వెళ్లాను.
బాల వికాస్ గ్రౌప్స్ అన్నింటికీ పెద్ద లాంటి ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన చుట్టూ చాలా మంది జనం. ఆ జనంలో మా ఆంటీ కూడా ఉంది.
ఆంటీ అక్కడ ఉండడంతో ఆయన ఎవరో అర్థం అయ్యింది… ఆ గ్రూప్ లో నాకు తెలిసిన మరికొంత మంది ఉన్నారు. వాళ్ళు అందరు తిరుపతిలో బాల వికాస్ మెయిన్ టైన్ చేసే వాళ్ళు.
అక్కడ పరిస్థితి చూస్తుంటే ఏదో తీవ్రంగా చర్చించుకున్తున్నట్టు ఉంది. అందరి మొహంలో ఏదో తెలియై టెన్షన్.
వాళ్ళు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారో అర్థం కాలేదు. క్రమంగా ఎండ పెరుగుతోంది.
గ్రూప్ గా నిలబడి ఉన్న జనంలో కాస్త అసహనం మొదలైంది.
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్