ఇక అక్కడ నుండి లేవబోతుండగా నా ప్రక్కన కూర్చున్నవారు ఒక్కసారి ఇబ్బందిగా చూడడంతో ఇక మారు మాటాడక అక్కడే కూర్చున్నాను.
ఎండ బాగా కాస్తోంది. ఆ ప్రభావం ఏమో తెలీదు కాని చెమట బాగా ఇబ్బంది పెట్టేస్తోంది.
తల మండుతోంది. కింద సిమెంట్ నేల కూడా మంట పెడుతోంది. హింస అంటే ఏమిటో అప్పుడే కాస్త తెలిసి వచ్చింది.
ఇక నా కాన్సంట్రేషన్ నా చుట్టు ప్రక్కల ఉన్న జనంపై పెట్టాను.
కొంత మంది సాయిబాబాను చూసి మైమరిచిపోతున్నారు. మరికొంతమంది కళ్ళు మూసుకుని ఏదో ధ్యానం చేస్తున్నట్టు ఉన్నారు.
మరికొందరు భక్తిశ్రద్దలతో వింటున్నారు. అసలు అతను చెప్పింది అర్థం అవుతుందో లేక సాయిబాబా చెప్పడం వల్ల ఏది చెప్పినా బాగుందనే భావనలో ఉన్నారో అర్థం కాలేదు.
నమ్మకం ఇంత గుడ్డిగా కూడా ఉంటుందా అని నాకు ఆక్షణంలో అనిపించింది.
అయినా నా చుట్టుప్రక్కల ఉన్నవారిని చూస్తుంటే నాకు సరదాగానే ఉంది. బోర్ అన్న ఫీలింగ్ పోయింది.
మధ్య మధ్యలో నీరు తాగుతూ సాయిబాబా తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాడు. ఇంగ్లీష్ ట్రాన్స్ లేటర్ ని చూస్తుంటే నాకు మరింత సరదాగా ఉంది. సాయిబాబా తన వాక్చాతుర్యంతో స్పీడ్ గా వెళ్లిపోతుంటే అతన్ని అందుకోలేక ట్రాన్స్ లేటర్ పడే బాధ చూస్తుంటే నవ్వు వస్తోంది.
ఆ టైంలో నేను నవ్వితే నా చుట్టూ ఉన్న వీర భక్తుల చేతిలో నా పరిస్థితి ఏమిటో తలచుకోగానే రాబోయే నవ్వు టక్కున మాయం అయ్యింది.
పైగా ఎక్కువసేపు నిలబడి స్పీచ్ ఇవ్వాలంటే చాలా పేషన్స్ ఉండాలి.
మంగళహారతి ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే సూచనలు ఇచ్చారు.
బాలవికాస్ లో ప్రతి ఆదివారం అన్ని ప్రోగ్రామ్స్ అయ్యాక మంగళహారతి ఉంటుంది. అది ఎలా ఇస్తారో నాకు బాగా తెలిసి ఉండడం వల్లనో లేక ప్రోగ్రాం ఐపోతోందన్న సంతోషమో మరి నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది.
సురేంద్ర రచనలకు ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/ksearch.php?searchfor=surendra
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ సీరియల్ ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు …చీఫ్ ఎడిటర్