మెస్మరైజింగ్ రైటర్ “విసురజ”కు పుట్టినరోజు శుభాకాంక్షలు

మేన్ రోబో లో తొలిరచన ముగ్ధమోహనం అద్భుతమైన సంచలనాలను సృష్టించింది.సాహితీప్రక్రియల్లో తనదైన బాణీ వాణి …అనితరమైన శైలి.

వివాదరహితుడు స్నేహశీలి మెస్మరైజింగ్ రైటర్ విసురజకు పుట్టినరోజు ( ఆగష్టు 1 ) కు పుట్టినరోజు శుభాకాంక్షలు
నా కవిత్వం
……………..
నా కవిత్వం
భావుకతకు భవ్యభవితిచ్చే ప్రణవాక్షరం
మధ్యతరగతి రాగకూజితాలుకూసే విహంగం
మమతలుపండే స్నేహసౌరభాలకుచుట్టు శ్రీకారం
తన్మయంతో తీపితలపులన్నీచేసే ఘీంకారం

నా కవిత్వమంటే
ప్రభాత కిరణాలకి దిక్సూచిగా
ప్రమోద క్షణాలకి అలంబనేగా
మధురా మధురిమలకు స్వాగతాలుగా
నినాద నాదాలసడులకు స్వగతాలుగా

నా కవిత్వమేమో
అన్నార్తుల అకలికేకలకు గోడపత్రిక
విపన్నుల సం రక్షకులకు స్నేహదీపిక
పీడిత అణగారినోళ్ళవేనగొంతుల నగారా
శోకమే అవేదనాపూరితశ్లోకఘోషల గోసాల

నా కవిత్వమైతే
సరసుగుండెల ఆత్మీయప్రేరణకు కీర్తన
మనసుముచ్చట్ల సొగసుసరాగాలకు ప్రార్ధన
వలపురాగాలకు వయసుతొందరలకు వంతెన
చిలిపికళ్ళకు సిరివన్నెలశోగకళ్ళకు వాదన

వెరసి
నా కవిత్వం కాగలదు బాధితవర్గాలకు బాసట
నా కవిత్వం కాగలదు ప్రేమతత్వానికి పీఠిక
నా కవిత్వం కాగలదు నవీనత్వానికి ప్రేరణ
నా కవిత్వం కాగలదు మధురవర్ణాల స్వప్నిక

విసురజ/విశుజగన్
30/07/2018
మెస్మరైజింగ్ వైటర్ విసురజ రచనల..ఇ.బుక్స్ లింక్

http://kinige.com/book/Mugdhamohanam

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ శీర్షికను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY