హెచ్చరిక పెల్వినియా నగరవాసులకు హెచ్చరిక…నగరంలోకి డ్రాక్యులా ప్రవేశించింది.రాత్రిళ్ళు ఎవరూ వచ్చినా..ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి…ష్..ఎవరు ? (26-08-1018)

( హారర్ ను ఆసక్తిగా చదివే పాఠకులకోసం )
4

హెచ్చరిక పెల్వినియా నగరవాసులకు హెచ్చరిక…నగరంలోకి డ్రాక్యులా ప్రవేశించింది.రాత్రిళ్ళు అపరిచితులు ఎవరూ వచ్చినా తలుపులు తెరువవద్దు.తొమ్మిదిదాటిన తరువాత బంధువులు అయినా సరే…ఇంటికి ఆహ్వానించవద్దు..హెచ్చరిక హెచ్చరిక హెచ్చరిక 

నగర మేయర్ జారీచేసిన హెచ్చరికను పోలీస్ వెహికిల్స్ ద్వారా పెల్వినియాసిటీ అంతా ఎలర్ట్ చేస్తున్నారు..
రాత్రి పది దాటింది దాటింది.
అర్థరాత్రి రెండు గంటల వరకు సందడిగా విదేశీయులతో కళకళలాడే పెల్వినియా సిటీ పదిగంటలకే నిర్మానుష్యం అయింది.
నగర పౌరులు ఇళ్లలోకి దూరి తలుపులు వేసుకున్నారు.రాత్రి తొమ్మిది గంటలకే మాల్స్ మూతబడ్డాయి.బస్సు సర్వీస్ చివరి ట్రిప్ ఆగిపోయింది.
దానికి కారణం పెల్వినియా సిటీలోకి డ్రాక్యులా ప్రవేశించిందన్న వదంతి.దానికి తోడు కొందరు పౌరులు డ్రాక్యులాలు గా మారిపోయారు.
చర్చి ఫాథర్స్ రంగంలోకి దిగారు.అప్పటి వరకూ ముందు జాగ్రత్తగా హెచ్చరికలు చేస్తున్నారు.పోలీసులు శిరస్త్రాణాలు ధరించారు.ఆయుధాలు చేతబట్టారు.ఏ మాత్రం అనుమానం వచ్చినా కాల్చివేయడానికి ” షూట్ ఎట్ సైట్ ” ఉత్తర్వులు వెలువడ్డాయి .
***

రాత్రి పదకొండు దాటింది .నికల్సన్ దంపతులు అప్పుడే డిన్నర్ పూర్తి చేసారు.నికల్సన్ కిటికీ తలుపులు వేయబోతూ ఎదురింటి వైపు చూసి భార్యతో అన్నాడు.
” మార్గరేట్ ఇంట్లో లైట్స్ ఇంకా వెలుగుతున్నాయి.ఇంట్లో ఒక్కర్తే ఉంటుంది..తాను తొమ్మిది గంటలకే పడుకుంటుందిగా …” అనుమానంగా
” అవును ..నాకూ అదే డౌట్ ..” మిసెస్ నికల్సన్ మాటలు పూర్తి కాకుండానే తలుపుల మీద దబదబా బడిన శబ్దం.ఆ వెంటనే అరుపులు
” అంకుల్ ప్లీజ్ ఓపెన్ ది డోర్ ” అది మార్గరెట్ గొంతు.
భయంలో డోర్ బెల్ ప్రెస్ చేయడం మరిచిపోయి తలుపుల మీద బాదుతోంది
నికల్సన్ తలుపు తీయడానికి వెళ్తుంటే భయంతో వారించింది మిసెస్ నికల్సన్ .
” వద్దు నికల్సన్ ….ఈ రాత్రివేళ..”
” కమాన్ డార్లింగ్ ..అవతల వున్నది మన మేగీ ..” అంటూ వెళ్లి తలుపు తీసాడు.
మార్గరెట్ లోపలి వచ్చి నికల్సన్ ను చుట్టేసింది.ఒళ్ళంతా చెమట
” ఏమైంది బేబీ…” అడిగాడు నికల్సన్
” డ్రా..డ్రా..డ్రాక్యులా..నన్ను చమ్పాడానికి వచ్చింది ” భయంతో చెప్పింది
” వాట్..? అంటూ కిటికీలో నుంచి మార్గరెట్ ఇంటివైపు చూసి మార్గరేట్ వైపు తిరిగి ” నేను వస్తాను పద ” అన్నాడు
” నేను రాను ” అంది భయంగా నికల్సన్ ను గట్టిగా పట్టుకుని
నికల్సన్ టేబుల్ మీద వున్న టార్చీని ,టేబుల్ సొరుగులో వున్నా లైసెన్స్ వున్నా రివాల్వర్ ను తీసుకున్నాడు.పోలీస్ అధికారిగా రిటైర్ అయ్యాడు వృత్తిరీత్యా కాకుండా స్వతహాగా ధైర్యస్థుడు.
” నేను చూసొస్తాను వుండు ” అంటూ భార్య వారిస్తున్నా వినకుండా బయల్దేరాడు.
***
మగరెట్ ఇంట్లోకి డుగుపెట్టాడు నికల్సన్.ఇల్లంతా చీకటిగా వుంది.టార్చిలైట్ వెలుగులో మార్గరెట్ రూమ్ లోకి వెళ్ళాడు.టార్చిలైట్ న బెడ్ మీదికి ఫోకస్ చేసి షాకయ్యేడు.బెడ్ మీద రక్తపు మడుగులో మా…ర్గ…రే…ట్ .ఆమె మెడమీద కోరలు దిగిన గుర్తులు .
వెంటనే వెనక్కి తిరిగి పరుగెత్తాడు తన ఇంటివైపు,
ఇంట్లోకి అడుగుపెట్టగానే అతనికి కనిపించిన దృశ్యం…
తన భార్య మెడకోరుకుతున్న ఒక మహిళ..తన భార్య పెనుగులాడుతోంది.
” ఏయ్ స్టాప్ దేర్ ..షూట్ చేస్తాను ” హెచ్చరించాడు నికల్సన్
అతను చూస్తుండగానే అతని భార్య నెలకు ఒరిగింది.థన్ భార్య మీద కొరికిన మహిళ వెనక్కి తిరిగింది.శరీరం అంతా వెండి రంగులో..కోరల్న్తి పళ్ళ నుంచి రక్త కారుతూ..మార్గరేట్..డ్రాక్యులా గా మారిన మార్గరెట్…
నికల్సన్ వైపు చూస్తూ తన ఇంటివైపు వెళ్తోంది.
నికల్సన్ భార్య వైపు చూసాడు.
రక్తపు అడుగులో వున్న భార్య శరీరం వెండిరంగులోకి మారుతోంది.
మెల్లిగా లేచి భర్త వైపు వస్తోంది.
***

జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

 హారర్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY