మార్చి 10 ( మేన్ రోబో బ్యూరో )
లోటస్ ల్యాప్
పాఠశాల పేరుకు ఒక బ్రాండ్ ఇమేజ్..ఒక ప్రత్యేకత తీసుకువచ్చిన ఘనత డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి స్వంతం
లోటస్ ల్యాప్ విద్యాసంస్థల డైరెక్టర్ గా…
ఒక ఉపాధ్యాయుడిగా..
సోషల్ అవేర్ నెస్ వున్న మానవతావాదిగా..
ఒక రచయితగా…
విభిన్న కోణాల్లో తన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన వ్యక్తి.
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి బాబు జగ్జీవన్ రామ్ భావం లో జ్యోతి ప్రజ్వలన చేసి లోటస్ ల్యాప్ పాఠశాల 20 వ వార్షికోత్సవ వేడుకల సంబరాలను ఘనంగా ప్రారంభించారు.
ఫ్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, ఎఎంహెచ్ఓ మల్లిఖార్జున్ ,స్కూల్ డైరెక్టర్ మంజులారాణి,ప్రిన్సిపాల్ గీతాలింగం ,వైస్ ప్రిన్సిపాల్ కె.రాధ, ఉపాధాయ్యులు తదిరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి …” వినయంతో విద్యను,వివేకంతో వ్యక్తిత్వాన్ని,కృషితో అత్యున్నత స్థానాన్ని చేరుకోవాలని,అందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాఠశాలలు తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని ” అభిలషించారు.
తమ పాఠశాలలోని ఏ విద్యార్ధి తన ప్రతిభను ఆసక్తిని కోల్పోకుండా చూసుకోవలిసిన బాధ్యత మా మీద వుంది.మా పాఠశాల ప్రాంగణంలో అడుగుపెట్టే విద్యార్ధి తిరిగి ప్రయోజకుడై,ఉన్నత వ్యక్తిత్వంతో బయటకు వెళ్లాలన్నదే ” తమ ఆకాంక్షగా అభివర్ణించారు…
ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్