రచయితల పుస్తకాలకు అందమైన ముఖచిత్రం ” కినిగె “( 24-03-2019)

( మేన్ రోబో బ్యూరో ) మార్చి 24
అతికొద్ది మంది రచయితలను మినహాయిస్తే రచయితలు తమ రచనలను అచ్చువేయించుకోలేని పరిస్థితిలో లేదా అచ్చు వేయించుకున్నా అమ్ముకోలేని దుస్థితిలో వున్నరోజులకు చెల్లుచీటి వచ్చేసింది.
పత్రికల్లో సీరియల్స్ గా వస్తున్నా రోజుల్లోనే పబ్లిషర్స్ సీరియల్ రచయితల దగ్గరికి వెళ్లి అడ్వాన్స్ లు ఇచ్చి పుస్తకరూపంలో మార్కెట్ లోకి విడుదల చేసే రోజులు కనుచూపు మేరలో మిణుకుమిణుకు మంటూ కనిపిస్తున్నాయి.
డైరెక్ట్ నవలలు కూడా విడుదల అయ్యేవి. ఏ కొద్దిమంది రచయితలకో పారితోషికం / రాయల్టీ వచ్చేది.
ఎక్కువశాతం రచయితలు స్వీయముద్రణలతో అచ్చేసుకున్న పుస్తకాలను డిస్టిబ్యూటర్స్ దగ్గరికి పుస్తకాల షాపులకు చేర్చి తమ అమ్మకాల తాలూకు సొమ్ముకోసం ఎదురుచూసేవారు.
ఎంతమంది రచయితలకు పెట్టినసొమ్ము వెనక్కి వస్తుందని ప్రశ్నిస్తే బేతాళుడు కూడా చెప్పలేని సమాధానం.
పుస్తకాలు పెట్టుకునే చోటుకూడా కష్టమే.పుస్తకాలు శిథిలావస్థకు చేరినప్పుడు రచయిత కళ్ళు కన్నీటి గోదావరులే .
కానీ ..ఇప్పుడా పరిస్థితి లేదు.ఇ బుక్ అందుబాటులోకి వచ్చింది.
రచయితలు పుస్తకాలు ప్రింట్ చేసుకుని అమ్మకాలకు తిరుగవలిసిన పనిలేదు.
పబ్లిషర్స్ కోసం ఎదురుచూపులు అక్కర్లేదు.
పుస్తకాలు వేసినా పబ్లిషర్స్ డబ్బులు ఇస్తారన్న గ్యారంటీ లేదు.
ఇప్పుడు మీ పుస్తకాలకు మీరే పబ్లిషర్
మీరు పుసకాలు ప్రింట్ చేయవలిసిన అవసరం లేదు…టైపు చేసి అందమైన ముఖచిత్రంతో కవర్ పేజీ,ఇన్నర్ పేజెస్ పిడిఎఫ్ పంపిస్తే మీ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా వున్నా తెలుగువారి / చదువరుల లోగిళ్ళకి వెళ్తుంది.
మీ పుస్తకం డిస్క్రిప్షన్ ..ఫ్రీ పిడిఎఫ్ కొంతభాగం చదివి ..నచ్చి మీ పుస్తకాన్ని డౌన్ లోడ్ చేసుకుంటే / కొనుక్కుంటే పుస్తకం అమ్మకాల్లో రాయల్టీ నేరుగా నిర్ణీత వ్యవధిలో మీ బ్యాంకు అకౌంట్ లోకి వస్తుంది.
కి…ని…గె
మూడక్షరాల ఇ బుక్ ప్రపంచం రచయితల పుస్తకాలకు అందమైన ముఖచిత్రంగా మారింది.మీకు నచ్చిన సబ్జెక్టు ..రాసుకోవచ్చు.కేవలం డిటిపి కవర్డి పేజీ జైనింగ్ పిడిఎఫ్ ఫార్మెట్ ..అంతే..
ఒక్కసారి అప్లోడ్ చేసాక మళ్ళీ మళ్ళీ ప్రింటింగ్ చేసుకోవాలిసిన అవసరమే లేదు.మీ సన్నిహితులకు అభిమానులకు మిత్రులకు సమాచారాన్ని అందించి మీ పుస్తకాన్ని మీరే ప్రమోట్ చేసుకోవచ్చు.
పుస్తకాన్ని కొనుక్కోవడం దూరప్రాంతాల్లో ఉంటే తెప్పించుకోవడం కష్టమైన విషయం.తీరిగ్గా మీ మొబైల్ లో, మీ ఇంట్లో లాప్ టాప్ లో / సిస్టమ్ లో చదువుకోవచ్చు.
దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన కినిగె ఇప్పటివరకూ కొన్నివేల పుస్తకాలను తెలుగుపాఠకులకు,ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారికి అందుబాటులోకి తెచ్చింది.
ప్రముఖ రచయితలు వర్ధమాన రచయితలు వర్తమాన రచయితలు కినిగె లో కొలువుతీరారు.
ఇతరభాషా రచయితల రచనలు కూడా అందుబాటులో వున్నాయి.
జానపద డిటెక్టివ్ మానవసంబంధాలు రొమాన్స్ క్రైమ్ ఫిక్షన్ నాన్ ఫిక్షన్ హారర్ ..నవరసాల భావోద్వేగాల సమ్మిళితమై రచనాప్రపంచం కినిగె లో ఆవిష్కృతమవుతుంది.
కినిగె రాజన్ గా చిరపరిచితులైన రాజన్ కినిగెను రచయితల పుస్తకాలకు అందమైన ముఖచిత్రంగా మారుస్తున్నారు.
“లాభాపేక్ష కన్నా విభిన్నమైన సాహిత్యాన్ని, పాఠకప్రపంచం ముందు నిలబెడుతున్నామన్నసంతృప్తి మిన్న” అన్న వెన్నలాంటి మనసున్న మాటలు కినిగెకు శ్రీరామరక్ష

http://kinige.com/

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY