శ్రీవికారినామ ఉగాదికి శుభ స్వాగతం …ములుగు లక్ష్మీ మైథిలి

ప్రత్యూష కాంత నీలి వస్త్రం ధరించి
మేలి పొద్దును స్వాగతిస్తోంది
చైత్ర మాసపు గానరవళులతో
తెలుగుతనపు మధురభావనలతో
తొలిపండగ తెలుగువారి
ముంగిట్లో శ్రీకారం చుట్టింది.

ఏ చిత్రకారునికి అందని మనోహరదృశ్యం ..
పచ్చ పచ్చని లేమావి చివురులు
అరవిచ్చిన మల్లెల గుబాళింపులు
ఆమని రాకతో ప్రకృతిశోభ
ద్విగూణికృతమైంది
మనుగడలో మకరందాన్ని నింపి
షడ్రుచుల పరమార్ధం తెలిసేలా
జీవితం లో వసంతమై రావమ్మా..

తెలుగు తల్లిని వేనోళ్ళ కీర్తిస్తూ
మాతృభాష కు అక్షర హారతులతో
యుగాలకు ఆదివై, నవ్య ఉగాది వై
చేజారుతున్న సంస్కృతి సంప్రదాయాలను..నిలుపరావమ్మా

నీరాక తో ప్రతిఇల్లు మావిళ్ళతోరణాలతో
నవ్యశోభల సంతరించుకుంది
యువత వెన్నుతట్టే చైతన్యమూర్తివై
సజ్జలను సంరక్షించి
దుర్జనులను శిక్షించ ..
రావమ్మా..శ్రీవికారినామ వత్సరమా
స్వాగతం..సుస్వాగతం..!

******************
ములుగు లక్ష్మీ మైథిలి
(నెల్లూరు)

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY