అనురాగం పిలిచే
••••••••••••••••••••••
ప్రణయభావమే మోహనరాగమై
నా ఆరోప్రాణమై
నా జీవనగీతికై
నా మధురభావనై
నా వలపురాగమై
నా ప్రేమస్వప్నమే
నా స్నేహబంధమై
ఈ మధురభావనే మోజులదీవెనై
అమరమై నిలిచిపోయే
వసంతుడే మనకై
చెలి వనమంతా విరిసిపోయే
ప్రేమ స్వప్నాలేవో చూపావు
స్నేహా మాధుర్యమే చవిచూపావు
కొత్త పాటేదో నేర్పినావు
మదిలో లేనిఊహలేవో రేపినావు
ఈ ఊహలతో ఈ ఊసులతో
మానసమే ప్రేమమయమయ్యే
మనసువిరి తోట ఘుమఘుమలతో
వసంతుడే మనకై
చెలి వనమంతా విరిసిపోయే
ఎదతీసే కూనిరాగాలతో
మనసే మురిసిపోయే
వలపే మైమరచిపోయే
ఎదలో క్రొత్త ఊహల్నే నిద్రలేపే
కటకటా నిద్రనే దూరం చేసే
ఈ ప్రేమస్వప్నమే నా స్నేహబంధమై
అమరమై నిలిచిపోయే
వసంతుడే మనకై
చెలి వనమంతా విరిసిపోయే
ప్రేమ రుచే చవి చూపి
వలపు రాగాలే మది నింపి
మత్తు ఎదో చల్లినావు
గమ్మత్తు అదేదో చేసినావు
ఎదలోని మధుర గానమే
కోటి మానసవీణలపై పలికే
ఈ ప్రణయరాగమే జీవనగీతమై
అమరమై నిలిచిపోగ
వసంతుడే మనకై
చెలి వనమంతా విరిసిపోయే
మమతల్లోని మాధురికి
తనే భాష్యం
అత్మీయత అప్యాయతకు
తనే నిజరూపం
చల్లగ కురిసే వెన్నెలే
తన కడగంటిచూపు
మెల్లగ వీచే పిల్లగాలే
తన మందహాసం
తపనలు రేపే రేతిరే
తన సోగకళ్ళకాటుక
మరుని వింటి పూబాణమే
తన సోయగం
ఈ సింగారాలే తడిమేతపనలై
అమరమై నిలిచిపోయే
వసంతుడే మనకై
చెలి వనమంతా విరిసిపోయే
చెలి ప్రేమ
ఈ జన్మకందిన వరమయ్యే
తన చెలిమి
పది జన్మలకైనా చాలనయ్యే
చెలి పలుకు మధురం
చెలి అధరం మధుఫలం
చెలి పిలుపు రమ్యం
చెలి తలపు రసరమ్యం
చెలి నడక వయ్యారం
చెలి నడుము లలితకవనం
ఈ లతికజవ్వని తలపులే
అమ్రుతధారలే ఎదలో కురిసిపోయే
వసంతుడే మనకై
చెలి వనమంతా విరిసిపోయే
•••••••••••
విసురజ
25/04/2020