సరస్వతీదేవి తన బిడ్డలు తన మూలంగా ( చదువు మూలంగా) తనువు చాలిస్తే తట్టుకోలేదు
బలవన్మరణాలు విషాదాన్ని మిగులుస్తున్నాయి.
చదువే జీవితమా? చదువే శాశ్వతమా ?
సంస్కారం విజ్ఞానం సృజనాత్మకత మానవ విలువలు జీవితపాఠాలు అక్కర్లేదా?
రాజనాలు పండించే రైతన్నలు,
అక్షరాలు దిద్దించే ఉపాధ్యాయులు ,
దేశాన్ని కాపాడే వీరజవానులు,
అపర సృష్టికర్తలు శాస్త్రవేత్తలు ,
దేశ ఆర్థికప్రగతిని ముందుకు తీసుకువెళ్లే వ్యాపారవేత్తలు
గాయకులు రచయితలు..
ఇన్ని వృత్తులు ఎనెన్ని ప్రవృత్తులు
అమ్మానాన్నల అనుబంధాలు కుటుంబ విలువలు
అన్నీ వదిలి మార్కుల భూతాలకు జడిసి
ఒత్తిడికి తలవంచి ..
చిట్టితల్లీ నువ్వు ఆత్మహత్య చేసుకుంటే
చిట్టితండ్రీ నువ్వు ఈ లోకాన్ని వదిలిపోతే…
నువ్వే ప్రపంచంగా బ్రతికే నీ వాళ్లకు కడుపుకోత మిగిలిస్తే…
ఇన్నాళ్లు పెంచిన మమకారం నీ మరణంతో వారి ఆనందం సమాధి అవుతుంది.
ఈ పాపం ఎవరిదీ?
ఈ శాపం ఎవరి ఇచ్చినది ?తిలాపాపం తలా పిడికెడు.
చదువుకోసం ఒత్తిడి పెట్టె విద్యాసంస్థలదా?
మా బిడ్డకు ర్యాంక్స్ వస్తే చాలు ?అని అతిగా ఆలోచించే తల్లిదండ్రులదా?
ఒత్తిళ్లు పెంచే విద్యాసంస్థల మీద కఠినచర్యలు తీసుకుని అధికారులు అలసత్వానిదా ?
ఒక తండ్రిగా ,
ఒక ఉపాధ్యాయుడిగా,
ఒక మానవతావాదిగా.
ఒక రచయితగా ..
వినమ్రంగా విన్నవిస్తున్నాను
డియర్ పేరెంట్స్
మీ పిల్లలను నిరంతరం గమనిస్తూ వుండండి.చదువొక్కటీ జీవితం కాదనే ధైర్యాన్నిఇవ్వండి.
వారికి నచ్చిన రఁగంలో రాణించే అవకాశాన్ని ఇవ్వండి.మీ బిడ్డ భవిష్యత్తు మీరు చూపించే ఒత్తిడిలో లేదు..మీరు అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుని భరోసా ఇవ్వడంలో వుంది.
విద్యాసంస్థల్లారా ..
విద్యార్థుల్లో ఒత్తడి పెంచకండి.వారికి వ్యక్తిత్వ వికాస పాఠాలూ చెప్పండి.వారి సృజనాత్మకతను తల్లిదండ్రులకు చెప్పండి.
వారి ఒత్తిడిని గమనించి వారికి అండగా ధైర్యంగా నిలవడండీ.
విద్యార్థులూ మీకు నేనున్నాను..మేమున్నాం .
ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి
ఒక్కసారి ఆలోచించండి.
డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://kinige.com/author/Vijayarke
ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్