కహానియా కథతో కల్కి ..రాజశేఖర్ కు మరో విభిన్నచిత్రం …కల్కి ట్రయిలర్ కోసం వీడియో క్లిక్ చేయండి.

( లక్ష్మి పెండ్యాల )
గరుడవేగ తరువాత డాక్టర్ రాజశేఖర్ చేసిన కల్కి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.
కహానియా తెలుగు మరో మైలురాయికి చేరింది. కహానియా నుంచి తీసుకున్న కథతో “కల్కి” సినిమా రూపొందిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం (28-06-2019) న విడుదలైన ఈ సినిమా ఎంతో బాగుందని అందరి ప్రశంసలు అందుకుంటోంది.
హీరో రాజశేఖర్ లీడ్ రోల్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సి.కల్యాణ్ నిర్మించారు.
సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా కథకి మూలం “కహానియా” లో ప్రచురితమైన “ఆత్రేయశ దేశరాజ్” గారి “కల్కి” సీరియల్.
ఈ సీరియల్ ప్రచురితమౌతున్న సమయంలోనే ఎంతో ప్రజాదరణ పొందింది. ఇదే కథ సినిమాగా తెరకెక్కడం విశేషం.

80లలో తెలంగాణలోని కొల్లాపూర్‌లో ఓ ఎమ్మెల్యేకి అతని శత్రువులకి మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఆ గొడవల్లో ఎమ్మెల్యే తమ్ముడు శేఖర్ బాబు హత్యకు గురవుతాడు. ఈ హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఆఫీసర్ “కల్కి” కొల్లాపూర్ వస్తాడు. కేసును ఇన్వెస్టిగేట్ చేసే సమయంలో హత్య చుట్టూ అల్లుకున్న ఎన్నో నిజాలు వెలుగులోకి వస్తాయి. అసలు శేఖర్ బాబును ఎవరు హత్య చేశారు? హత్య వెనుక దాగి ఉన్న నిజాలు ఏంటి? “కల్కి” వాటిని ఎలా బయటపెడతాడు? ఇదే “కల్కి” సినిమా మెయిన్ స్టోరి.

ఈ హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఆఫీసర్ “కల్కి”కొల్లాపూర్ వస్తాడు. కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుండగా హత్య చుట్టూ దాగి వున్న ఎన్నో నిజాలు బయటపడతాయి. అసలు శేఖర్ బాబుని ఎవరు హత్య చేశారు? హత్య వెనుక ఉన్న నిజాలు ఏంటి? కల్కి వాటిని ఎలా బయట పెడతాడు. ఇదే “కల్కి” సినిమా మెయిన్ కథ.

రాజశేఖర్,అదాశర్మ,నందితా శ్వేత,అశుతోష్ రాణా,నాజర్,సిద్ధు జొన్నలగడ్డ,రాహుల్ రామకృష్ణలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.హీరో రాజశేఖర్ టైటిల్ రోల్ లో అద్భుతంగా నటించారు. జర్నలిస్ట్ పాత్రలో రాహుల్ రామకృష్ణ సూపర్ అనిపించాడు. సినిమా చివరి సీన్స్ లో డైరెక్టర్ రివీల్ చేసిన ట్విస్ట్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

గ్రహాంతరవాసితో ప్రేమలో పడ్డ హీరో …పెళ్లయ్యాక తన (హీరో సిద్ధార్థ) ప్రతిరూపం ఆమె (గ్రహాంతరవాసి)కడుపులో రూపుదిద్దుకున్నాక కనిపించకుండా అదృశ్యమైన ప్రహేళిక…?ఈ ప్రపంచంలో కనిపెట్టలేనిది ఏమిటి?అనే గ్రహాంతరవాసుల అన్వేషణ..వాళ్ళు కనిపెట్టలేకపోయినది ఏమిటో తెలిసాక మన మనసులో భావోద్వేగానికి గురవుతాయి.ఒక సినిమా చూస్తోన్న అనుభూతి.అక్షరాల వెంట కళ్ళను పరుగెత్తించే థ్రిల్లర్ క్యూ..
ఈ నవలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

http://kinige.com/book/Q+Aame+Kanabaduta+Ledu

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

 

NO COMMENTS

LEAVE A REPLY