మనపిల్లల భవిష్యత్తును మనమే కాలరాద్దామా? ప్రతీపౌరుడూ సివిల్ పోలీస్ కావాలి.ప్రాణాలుహరించే రోడ్డుప్రమాదలకు మనమే కారణం కారాదు….విద్యారత్న లయన్,విద్యా వైభవ విశారద…డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి(09-08-2019)

బాధ్యతారాహిత్యం,నిర్లక్ష్యం,రేపటితరాన్ని నిర్వీర్యం చేసే మృత్యువు హెచ్చరిక
రక్తసిక్తమయ్యే రహదారుల్లో వీధులపాలయ్యే కుటుంబాలు ,ఆప్తులను కొల్పోయిన బాధితుల రోదనలు
అయినా మనకేమీ పట్టదా?ప్రతీరోజూ రోడ్డుప్రమాద వార్తలు విని ” ఎవరెట్లా పోతే మనకేం ” అని మిన్నకుండిపోదామా?
అదే పరిస్థితి,అదే దుస్థితి మనకొస్తే పోలీసులను ప్రభుత్వాన్ని నిందిద్దామా? ఇదెక్కడి అలసత్వం..
పెద్దలారా ఆలోచించించండి
విజ్ఞులారా వివేకంతో కదిలిరండి.
ఇది ఆవేదనతో రాస్తున్న కథనం
ఇది వ్యర్ధపూరిత విన్నపం.
మీ పిల్లలకు మైనర్లకు వాహనాలు ఇస్తున్నారు.వాళ్ళు రోడ్డుమీదికి వచ్చి ప్రమాదాలు సృష్టిస్తున్నారు.ఫలితంగా ప్రాణాలు కోల్పోయే బాధితులు….మీ పిల్లల బ్రతుకు అంధకారం.మీకు జైలుజీవితం.
ఇది అవసరమా? వీధుల్లోకి వచ్చే మైనర్ల వాహనాలు ప్రమాదానికి గురైతే,బాధ్యులెవరు? తల్లిదండ్రులుగా మీరు కాదా?
ఓవర్ స్పీడ్ తో వాహనాలు నడిపి ప్రమాదం జరిగితే మీ కుటుంబానికే కాదు ఆ ప్రమాదంలో మరణించిన కుటుంబానికీ చీకటే
హెల్మెట్ లేకుండా వాహనం నడిపి మీరు ప్రాణాలు కోల్పోతే
రాంగ్ రూట్ లో డ్రైవ్ చేస్తే ..
నంబర్ ప్లేట్ కనిపించకుండా చలానా బారిన పడకుండా ఉందామని అనుకుని చట్టాన్ని,మీ బాధ్యతను విస్మరిస్తే మీకన్నా దేశద్రోహి ఎవరుంటారు?.మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారా?
ప్రతీ పౌరుడు సివిల్ పోలీస్ లా మారాలి.మీ మొబైల్ కు పని చెప్పండి/.
రాంగ్ రూట్ లో డ్రైవ్ చేసేవాళ్ళు
తాగి డ్రైవ్ చేసేవాళ్ళు
హెల్మెట్ లేకుండా వాహనం నడిపేవాళ్లు
ర్యాష్ గా డ్రైవింగ్ చేసేవాళ్ళు…
ఒక్కసారి శిక్షకు గురైతే ,మరోసారి ఆ తప్పు చేయకుండా ఉండాలి.
సోషల్ రెస్పాన్సబిలిటీ తీసుకోవాలి
వ్యక్తుల మీద
ప్రభుత్వం మీద
శాంతి భద్రతల మీద
దృష్టిపెట్టాలి.
లేదంటే ..
పాదచారులు హెల్మెట్ పెట్టుకుని వెళ్లేరోజు వస్తుంది.వాహనాలు నడిపిన మైనర్లు వారి ల్లిదండ్రులు కటకటాల్లోకి వెళ్లే దుర్దినం దాపురిస్తుంది.
సెల్ ఫోన్ డ్రైవింగ్ ..గో టు హెల్ అని చెబుతుంది
ర్యాష్ డ్రైవింగ్ నీ లైఫ్ యాష్ ( బూడిదగా మారుస్తుందని చెబుతుంది)
తాగి డ్రైవ్ చేస్తే మద్యం నీ ఆయుష్షును తాగేస్తుంది.చావును అందిస్తుంది
హెల్మెట్ లేకపోతే నువ్వు హెల్ ( నరకం ) లోకి వెళ్తున్నట్టే.
అని చెబుతున్న రోడ్డు జాగ్రత్తలు పాటించండి..ఆలోచిందండి.

విద్యారత్న లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అందించే అక్షరాల భవిష్యత్తు గీత…” పిల్లలు విద్యార్థులు తల్లిదండ్రులు “… పుస్తకరూపంలో మీ ముందుకు వస్తుంది 

ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

ఈ కథనాన్ని మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY